ప్రపంచ దేశాల సారస్వతం
- 171-మెక్సికో దేశ సాహిత్యం
- ఉత్తర అమెరికాలో యునైటెడ్ మెక్సికన్ స్టేట్స్ గా పిలువబడే దేశం మెక్సికో.రాజధాని మెక్సికో సిటి .గుర్తింపబడిన భాషలు –స్పానిష్ తోపాటు 68అమేరిండియన్ భాషలు .జాతీయ భాష- స్పానిష్ .జనాభా 12.62కోట్లు .కేధలిక్ క్రిస్టియానిటి మతం .కరెన్సీ –మెక్సికో పెకో .పెట్రోలియం మైనింగ్ ,పొగాకు కెమికల్స్ మోటార్ వెహికల్స్ , ఐరన్, ఫుడ్ఆదాయవనరులు .98.53శాతం అక్షరాస్యత .ప్రైమరీ లో 1-6గ్రేడులు ,జూనియర్ హైస్కూల్ -7-9గ్రేడులు హైస్కూల్ -10-12 గ్రేడులు .కాన్కన్ బీచెస్ ,మెక్సికో సిటి ,చిచెన్ ఇజ్రా ,టులూం విజిటింగ్ స్పాట్స్ .నిబంధనలు పాటించి చేయాలి .
- మెక్సికో దేశ సాహిత్యం –మెక్సికన్ సాహిత్యంస్పానిష్ భాషలో ఉంటుంది .ఘనతవహించిన రచయితలలో ఆక్టేవియా పాజ్ ,అల్ఫాంసో రోయేస్,కార్లోస్ ఫ్లున్టేస్,సేర్జియోపిటాల్,ఏమిల్లో పాచేకో ,ఏలినా పోనాలియా వోట్స్కా ,ఫెర్నాండో డెల్పాసో ,జువాన్ రుల్ఫో ,అమెడో నేర్వో ,జువానా ఐరిస్ డిలా క్రూజ్ ,కార్లోస్ డిసిగు౦జా , వై గో౦గూర .
- కలోనియల్ కాల సాహిత్యం లో చాలా పీరియడ్లున్నాయి .ఇది 16వ శతాబ్ది వరకు సాగింది 17వ శతాబ్దం లో బరాక్ లిటరేచర్ బాగా అభి వృద్ధి చెంది సాహిత్య ఆటలు కూడా ప్రవేశించాయి అనాగ్రమ్స్,ఏమ్బ్లెంస్ అండ్ మేజెస్ వంటివి .కార్లోస్ డి సోగుంజా గోంగూర ,గువాన్ రిజ్ ,జువానా ఐన్స్ డీగోడీ రేబెలాలు ప్రముఖరచయితలు. 18వ శతాబ్దిలో కలోనియల్ పాలన అంతాన జోస్ జాక్విన్ ఫెర్నాండెజ్ రాసిన ఎల్పెరిక్విలో సర్మిఎంటోనవల ను ఏమ్బ్లేమాటిక్ ఆఫ్మెక్సికన్ పికారేక్క్యు అంటారు .లా క్విజో టిటాయు సు ప్రీమా ,డాన్కార్టిన్డేలా ఫిచేండానవలలు అమెరికన్స్ రాసిన మొదటి నవలలు .క్లాసిక్ రచయితలుగా గుర్తింపు పొందినవారిలో –డియగోజోస్ అబాడ్,ఫ్రాన్సిస్కో జేవియర్ అలేగ్రే ,లఫెల్ లాండివార్ మొదలైనవారు .
- స్వతంత్ర్యానంతరం 19వ శతాబ్దం లో సాహిత్యంలోనే కాక ఇతర కళలలోకూడా తగ్గింది .శతాబ్ది ఉత్తరార్ధం లో ఉత్తేజకర సాహిత్యం లాస్ మేక్సికనోస్ పింట్ర డోస్ పోర్ సిమిస్మోస్ పుస్తకం ఆనాటి మేధావులు తమ సమకాలీనులను ఎలా చూశారో ఉంటు౦ది .శతాబ్దం చివర్లో అమోడో నేర్వో ,మాన్యుల్ గూటరేజ్నజేరా కవులు మోడర్నిస్ట్ లుగా ప్రసిద్ధిపొందారు .రోమాన్టిజం,రియలిజం –నాచురలిజం ,మోడర్నిజం కవిత్వాలు ప్రవేశించాయి .వందలాది సాహిత్య సంస్థలేర్పడ్డాయి .కొత్తతరం కవులు రచయితలూ ఉత్సాహంగా రాశారు .వీరిలో జోస్ మాన్యుల్ ,మార్టినేజ్ డీ నవరెటే,విసేంటే రివా పలాసియో ,జాక్విన్ అర్కాడియోకాస్పియన్ వగైరా ఉన్నారు .పాజిటివిజం కాలం లో లూయిస్ జి ఇంసియన్ ,రాఫెల్ డీలగాడో,ఏమిల్లో రబాసా ,ఏంజెల్ డీ కంపో బాగా వెలిగారు .
- వ్యాస రచయితలలో –లూకాస్ అలామన్ ,సేలాపియో బకీరో బారెర,జోస్ వాస్కోసేలాస్కాల్డేరాన్ ముఖ్యులు .నవలలు ,కధలు రాసిన వారిలో ప్రసిద్ధులు –ఏంజెల్ డీ కంపో ,రాఫెల్ డేల్గాడో,జోస్ రూమేన్ రోమేరో ఫ్రాన్సిస్కో జేవియర్ మోరెనో .వగైరా .కవులలో-మాన్యుల్ అకునా,మాన్యుల్ కార్పియో ,సాల్వడార్ డియాజ్ మిరాన్ ,జువాన్ డీ డయోస్ పేజా ,అలియానా అల్వరేజ్ వగైరా .
- 21వ శతాబ్దం లో మెక్సికన్ రివల్యూషన్ తర్వాత దృక్పధాలు మారాయి .నవల నాటకం బాగా రాశారు .మేరియానో అజులా ,రోడాల్ఫో ఉసిగి జాతీయ సాహిత్యం రాశారు .ఇండీజినస్ లిటరేచర్ ప్రాముఖ్యం పొంది రికార్డోపోజాస్ ,ఫ్రాన్సిస్కో రోజా గొంజలేజ్ అందులో రాశారు .ఆగస్టిన్ ఎనెజేజ్-ఆల్ ఫిలో డెల్ అగువా నవల ను సమకాలీన మెక్సికన్ నవల అన్నారు .1960ఆన్దాలజి ని తెచ్చారు .చరిత్రకారుల్లో –ఆల్ఫాన్సో జంకో ,కార్లోస్ పెరి య్రా ,మేరియానో కువేసా లూకాస్ అలామన్ వగైరా ప్రసిద్ధులు .ఆక్టేవియాపాజ్ కు 1990లో సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ ‘’సన్ స్టోన్’’కవిత్వానికి లభించింది .172-కెనడా దేశ సాహిత్యం
- ఉత్తర అమెరికా ఉత్తరాన పది ప్రావిన్సేస్ మూడు టేర్రిటరీలు ఉన్న దేశం ప్రపంచం లో రెండవ పెద్ద దేశం కెనడా ..3.76కోట్ల జనాభా .రాజధాని అట్టావా.కరెన్సీ –కెనెడియన్ డాలర్ .కేధలిక్ మతం .ఇంగ్లీష్ ఫ్రెంచ్ భాషలు .99శాతం అక్షరాస్యత .అత్యున్నత విద్యా ప్రమాణాలాతో విద్య .కెమికల్స్ మినరల్స్ ,కలప ఫుడ్ ప్రొడక్షన్ ,పెట్రోలియం ఫిషింగ్ ఆదాయవనరులు .బెనిఫ్ నేషనల్ పార్క్ ,స్టాన్లీపార్క్ ,cn టవర్ వగైరా చూడదగినవి .సురక్షితం .
- కెనడా దేశ సాహిత్యం –కెనెడియన్ సాహిత్యం కెనెడియన్ ఇంగ్లీష్,కెనెడియన్ ఫ్రెంచ్ ,కెనెడియన్ గేలిక్ భాషలలో ఉంటుంది .ఇంగ్లిష్ లో ఇ౦డిజినస్ సాహిత్యం అంటే దేశీయ సాహిత్యం ఎక్కువ .జెంనేట్టి ఆర్మ్ స్ట్రాంగ్ మాటలలో “I would stay away from the idea of “Native” literature, there is no such thing. There is Mohawk literature, there is Okanagan literature, but there is no generic Native in Canada”.[
- ఫ్రెంచ్ కెనెడియన్ సాహిత్యం -1937క్యూబెక్ దేశభక్తి ఉద్యమం వచ్చి ఫిక్షన్ రచన బాగా జరిగింది మొదటినవల – L’influence d’un livreను Philippe-Ignace-Francois Aubert de Gaspé, or simply Philippe Aubert de Gaspé (1814– 41రాశాడు
- 1967కాన్ఫెడరేషన్ తర్వాత చార్లెస్ రాబర్ట్ ,ఆర్చిబాల్డ్ లాంప్ మన్, బ్లిస్ కర్మాన్,డంకన్ కాంప్ బెల్ స్కాట్ విలియం విల్ఫ్రెడ్ కాంప్ బెల్ ప్రసిద్ధ రచయితలుగా గుర్తింపు పొందారు .పాలిన్ జాన్సన్ ,పాలిన్ జాన్సన్ డ్రమ్మాండ్ లుపాప్యులర్ కవులు అప్పుడు .ఎల్ ఏం మాంట్ గోమరి నవల ‘’అన్నే ఆఫ్ గ్రీన్ గేబుల్స్ ‘’1908లో ప్రచురితమై 50మిలియంకాపీలు అమ్ము డుపోయింది .లియోనార్డ్ కోహేన్స్ నవల బ్యూటిఫుల్ లూజర్స్ ను మోస్ట్ రివోల్టింగ్ బుక్ గా భావించారు .యితడు ఫోక్ సింగర్ సాంగ్ రైటర్ కూడా .ఫార్లీ మోవాట్రాసిన ‘’నేవర్ క్రై ఉల్ఫ్ ‘’ బెస్ట్ నవల. అతడి లాస్ట్ ఇన్ దిబార్రెల్ అనే బాల సాహిత్యరచనకు గవర్నర్ జనరల్ అవార్డ్ లభించింది .విమర్శ నవల కవిత్వం రాసినవారు – మార్గరెట్ అట్వుడ్ .షార్ట్ స్టోరీస్ రాసిన ఆలిస్ మన్రో 2013లో నోబెల్ ప్రైజ్ రావటం తో సాహిత్యానికి గొప్ప దశ ఏర్పడింది కెనడియన మహిళకు దక్కిన అరుదైన మొదటి ప్రైజ్ ఇది ..నవలాకారులుగా కరోల్ షీల్డ్స్ ,లారెన్స్ హిల్ ,గుర్తింపుపొందారు ,కరోల్ నవల –ది స్టోన్ డయరీస్ ‘’కు 1955పులిట్జర్ ప్రైజ్ వచ్చింది .లారిస్ పార్టి కి ఆరంజ్ ప్రైజ్ దక్కింది .
- అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కెనెడియన్ రచయితలు –ఆలిస్ మన్రో ,మైకేల్ ఒండటాజే,మార్గరెట్ అట్వుడ్,యాన్ మార్తెల్ ,కార్లోస్ షీల్డ్స్ ,అరిస్టాల్ మాక్లియో డ్,రవి హూజ్ ,అన్నే మైకేల్స్ ,ఆలివ్ సీనియర్ ,రిచ్లర్ ,రోహింటన్ మిస్త్రి ,ఆస్టిన్ క్లార్క్ ,లారెన్స్ హిల్ .
- సశేషం
- మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-7-20-ఉయ్యూరు