- ప్రపంచ దేశాల సారస్వతం
- 175-హైతి దేశ సాహిత్యం
- ఉత్తర అమెరికాలో కరోబియన్ దేశం .రాజధాని పోర్ట్ ఆవు ప్రిన్స్ .కరెన్సీ –హైతియన్ గూర్డే.జనాభా -1.18కోట్లు .రోమన్ కేధలిక్ మతం .ఫ్రెంచ్ ఆధారిత క్రియోల్ భాష ,ఫ్రెంచ్ భాషలున్నాయి .61శాతం అక్షరాస్యత .15,200 ప్రైమరీ స్కూల్స్ లో 90శాతం నాన్ పబ్లిక్ .కమ్యూనిటీల నిర్వహణలో ఉంటాయి .ఉన్నత విద్య యూనివర్సిటీలు ,పబ్లిక్ ప్రైవేట్ యాజమన్యాలు అందిస్తాయి .వ్యవసాయం ఎక్కువ. సువాసన నూనె వెటివర్ ఆయిల్ ఉత్పత్తి ,బనానా ,కోకా ,మామిడు పంట ఎగుమతులు ఆదాయ వనరులు .సిటడేల్లా లే ఫెరీరా ,సాన్ సౌసి పాలెస్ ,నేషనల్ పార్క్ చూడతగినవి .అత్యాచారాలు సాయుధ దోపిడీ ,హత్యలు కిడ్నాపింగ్ ,రేప్ లు ఎక్కువ .
- హైతి సాహిత్యం -1804లో తిరుబాటు తర్వాత ఫ్రెంచ్ కాలనీ ప్రభుత్వాన్ని కూల్చాకనే సాహిత్యం వచ్చింది .మొదట్లో జాతీయ రచనలు వచ్చాయి .తర్వాత రోమాన్టిజం చేరింది .జీన్ పెర్రి బోఎర్స్ 23ఏళ్ళు దేశాధ్యక్షుడుగా ఉండగా కవిత్వానికి వికాసం కలిగింది .ఒస్వాల్ద్ డ్యురాన్డ్ 1896లో-రైర్స్ ఎట్ పియర్స్ అంటే ‘’లాఫ్టర్ అండ్ టియర్స్ ‘’అక్కడి జీవ జంతుజాల వర్ణన .క్రియోల్ భాషను చక్కగా ఉపయోగించిన మొదటి కవి .మొదటి కవిత ‘’చౌకౌన్ ‘’కు సంగీతం కూడా సమకూర్చారు .దీనితో వచనరచనకూ ప్రోత్సాహం లభించింది .లా రోండే జర్నల్ లో కవులు విస్తృతంగా రాసేవారు .జోసెఫ్ ఆర్ధర్ ప్రవాసానికి వెళ్లి ‘’లేట్రిస్ డీ సెయింట్ ధామస్ ‘’రాసి 1919లో పారిస్ లో పబ్లిష్ చేశాడు .తర్వాత యువ రాడికల్ గ్రూప్ రచయితలు వచ్చి మేధావి వర్గాన్ని ప్రభావితం చేశారు.జీన్ ప్రైస్మార్స్ అంత్రోపాలజిస్ట్ .రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నవలారచయిత అలెక్సీ 1951నుంచి 61వరకు ధారగా రాశాడు .సోషలిస్ట్ రియలిజం ను ఫాంటసి తో కలిపి రాయటం మొదలైంది .అలెక్సీ చివరి నవల ‘’దిఫ్లిక్కర్ ఆఫ్ యాన్ ఐ లిడ్’’.ఫ్రాంక్ ఎటిన్నె1975లో దేజాఫీ ప్రముఖ నవల రాశాడు .పియర్రే ‘’కేతెడ్రల్ ఆఫ్ ది ఆగస్ట్ హీట్ ‘’నవలలో పట్టణ పేదల జీవితగాథా వర్ణన ఉంది .మేరీ చౌవెట్1968’’లవ్ ,యాన్గర్ ,మాడ్ నెస్’’రాసింది .నగర బ్రుటాలిటి ని ఎండగట్టింది
- 1985తర్వాత డీ క్లాడే చార్లెస్ ,దేని లేఫెరేరి లు ట్రాన్స్ నేషనల్ సాహిత్య౦ సృస్టించారు .’’హౌ టు మెక్ లవ్ విత్ ఏ నీగ్రో వితౌట్ గెత్తింగ్ టైర్డ్’’నవల మాన్ హట్టన్ బ్లూస్ రాశాడు .ఎమిలి ఆలివర్ ‘’ది సీల్డ్ అరన్స్’’డయాస్పోరా రచన .స్త్రీలలో ఎడ్విడ్జ్ డంటి కాట్ ,బ్రెత్ ఐస్ మెమరి అనే గోప్పనవల 1994లోరాసి హైతీ యువతుల అనుభవాలు చిత్రించింది .తర్వాత రాజకీయంగా ‘’దిఫార్మింగ్ ఆఫ్ బోన్స్’’1998లో రాసి ఆ దేశ చెరుకు నరికే వారి పై నరమేధం గురించి రాసింది .
- మరికొన్ని మంచి పుస్తకాలు –జనరల్ సన్ మై బ్రదర్ –అలెక్సిస్ ,మేమాయిర్ ఆఫ్ యాన్ ఆమ్నేషియాక్-జాన్ డోమినిక్యు,యాన్దాలజీస్ సీక్రెట్ –ఇడా ఫాబెర్ట్ .మాస్టర్స్ ఆఫ్ ది డ్యు –జాక్వెస్ రొమైన్ వగైరా .
- 176-డొమెనికన్ రిపబ్లిక్ దేశ సాహిత్యం.
- ఉత్తర అమెరికాలో డొమెనికన్ రిపబ్లిక్ దేశ౦అందమైన బీచ్ లకు ,రిసార్ట్, గొల్ఫింగ్ లకు ప్రసిద్ధి .రైన్ ఫారెస్ట్ లు, సవన్నా లు ,హైలాండ్స్ ఉంటాయి .రాజధాని –శాంటో డొమింగో.జనాభా –ఒక కోటి .కరెన్సీ –డొమినికన్ పెకో.రోమన్ కేధలిక్ మతం .స్పానిష్ భాష .93.78శాతం అక్షరాస్యత .ఉచిత కంపల్సరి ప్రైమరీ విద్య .సెకండరీ లో ఫ్రీ బట్ మాండేటరి.మైని౦గ్, వ్యవసాయం .లాటిన్ అమెరికా దేశాలల అత్యధిక బంగారు గనులున్న ఏకైక దేశం . ఇవే ఆదాయం .కోకా, టుబాకో, షుగర్ కేన్, కాఫీ ,వరి,కాటన్,బీన్స్ , బనానా పండిస్తారు .లాస్ హెటిస్ నేషనల్ పార్క్ ,కొసా డీ కాంపో రిసార్ట్ ,ఆల్టోస్ డీచవోన్ దర్శనీయాలు .నేర భయం జాస్తి .
- డొమెనికన్ రిపబ్లిక్ సాహిత్యం-చాలామంది రచయితలున్నారు .కొందర్ని గూర్చి తెలుసుకొందాం .ఐడా కార్ట జినా పోర్టాలాటిన్ –కవి, రచయిత్రి-ఎ వుమన్ ఈజ్ ఎలోన్ ,నిదర్ వైట్ నార్ బ్లాక్ ప్రసిద్ధకవితలు.ప్రీమియో సీక్స్ బార్రెల్ అనే అంతర్జాతీయ ప్రైజ్ పొందింది .10కవితా సంపుటులు ,ఒక నవల ఎస్కేలేర పర్వా ఎలెక్ట్రా తోపాటు యాన్దాలజి రాసింది .అంగీ క్రూజ్ –సోలేడాడ్,లెట్ ఇట్ రైన్ కాఫీ మొదలైనవి రాసింది ఫ్రాంక్ బఎజ్ –పోయేట్ ఎడిటర్ రైటర్ ,-పోస్ట రీస్,ఎన్రోసారియో వగైరా రాశాడు .రీ బెర్రోవా -25కవితా సంపుటులు రాశాడు .ఇందులో బుక్ ఆఫ్ ఫ్రాగ్ మెంట్స్ గొప్పది .ఎడ్గార్ స్మిత్ –కవి .వేర్సేనల్ మొదలైన కవితా సంపుటులు ,శివ ,తాండవ –షార్ట్ స్టోరి బుక్స్ ,పూరో కుఎంటో మొదలైన నవలలు రాశాడు .మాన్యుల్ డీ కార్బెల్ –ట్రోపికో నీగ్రో ,క్యుఎంటాస్,పోయెమ్స్ డీ అమొరి,ఆన్దాలిజా పోఎటికా,ఓబ్రా పోఎటికా వంటి డజను రచనలు చేశాడు క్రిస్టినోగొమేజ్—అగ్రానమిస్ట్ ,కవి ప్రొఫెసర్ .యో డిజోఎల్అమర్,అర్రెంకాడోడీరైజ్ పు స్తకాలు రాశాడు .
- సశేషం
- మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-7-20-ఉయ్యూరు