- ప్రపంచ దేశాల సారస్వతం
- 179-పనామా దేశ సాహిత్యం
- మధ్య దక్షిణ ఆమెరికాలో పసిఫిక్ ,అట్లాంటిక్ సముద్రాలాధ్య షిప్పింగ్ కోసం ఏర్పాటు చేసిన మానవాద్భుతం పనామా కాలవ ఉన్న దేశం పనామా .రాజధాని పనామా సిటి ఆధునిక ఆకాశ హర్మ్యాలు ,కాసినోలు ,నైట్ క్లబ్ లతో నిండి ఉంటుంది .కరెన్సీ అమెరికన్ డాలర్ ,పనమానియన్ బల్బొవా .జనాభా -42లక్షలు .రోమన్ కేధలిక్ మతం .స్పానిష్ భాష .95.41శాతం అక్షరాస్యత .బేసిక్ సెకండరి ,టేరేటరి విద్యా విధానం .పనామాకాలువ వాణిజ్యం ,సర్వీస్ సిస్టం ముఖ్య ఆదాయ వనరులు .సాన్ బ్లాస్ ఐలాండ్స్ ,పనామ వీజో ,మీరా ఫ్లోర్ లాక్స్ వగైరా చూడచ్చు .సురక్షితం .
- పనామా సాహిత్యం –పనామికల్ సాహిత్యం గొంజేలో ఫెర్ని నాండేజ్ ఆండ్రీ డీలారోకా పై రాసిన కథ తోప్రారంభం .క్రైయింగ్ ఫ్రం పనామా ఎట్ ది డెత్ ఆఫ్ డాన్ ఎన్రిక్ఎన్రిక్వెజ్అనే ఆన్దాలజిని 17వ శతాబ్దిలో కొందరు రచయితలు కలిసి రాశారు .19వ శతాబ్దం లో ఆధునిక సాహిత్యావిర్భావం జరిగింది .రోడ్రిగో మిరో-పోయెట్రి ఇల్టినరి ఇన్ పనామా ‘’ను అనేక స్పానిష్ రచయితలు రాశారు .వరల్డ్ పాలిటిక్స్ పుస్తకం ,తర్వాత ముండోరాసిన స్టేజ్ ప్లే వచ్చాయి .విక్టర్ డీ లా గార్డియాను మొదటి పనామియన్ కవి అంటారు 19వ శతాబ్దిలో రోమా౦టిజం కూడా ప్రవేశించి మాన్యుల్ మేరియా అయాల ,టోమాస్మీరో రూబిని ,జోస్ మేరియా అలేమన్ ,రోడోల్ఫో కైసేడో వగైరాలు రాశారు .మోడర్నిజం కవులలో లియాన్ ఆంటోనియో సోటో,రికార్డోమిరోఉన్నారు ,మీరో –పాట్రియా అనే అద్భుత కావ్యం రాశాడు
- సర్రియలిజం కవులలో రికార్డో బెర్మురేజ్ ప్రసిద్ధుడు.కథారచయిత అగస్టో రోడిగేజ్ .కవులు –స్టెల్లా సియర్రా ,రోక్ జైవార్ లక్వేరెంజా ,హోఫీలియా హూపర్ ఎల్సి రికార్డ్ మొదలైనవారు .తర్వాతకాలం లో బెంజమిన్ రామోన్ ,బెర్టాలికాపెరటాలియా,రామోన్ ఒవీరో ,పాబ్లో మినాకో .20వ శతాబ్దిలో సాల్వడార్ మెడినాబరహోనా,ఐరా హార్బర్ గోమేజ్ ,అలేక్జాందర్ జాంజేస్ గొప్పకవులు
- మొదటి పనమానిక్ పుస్తకాలు –ఆండ్రీస్ గాస్పర్ ,రికార్డో మీరో కవులు కథాకారులు .జోస్ మేరియా నూనిజ్ మోసెస్ కాస్తిల్లో లూ గొప్పవారే .పనామా కాలువ పై అనేక రచనలు వచ్చాయి –ఏర్నేస్టో ఎండారాఎన్రిక్ క్వివేజ్ ,యోలాండాహాక్స్ షా ,డేవిడ్ రాబిన్సన్ ఒరోబియా ,ఎరికా హారిస్ పనామా పై ఆరాధనగా రాశారు .21వ శతాబ్దిలో కార్లోస్ ఫాంగ్ ,రోడ్రిగేజ్ పిట్టి,లిలి మేన్దోజాఆబెల్ ముగులేనా వర్ణనాత్మక రచనలు చేశారు ,వ్యక్తి మహత్వాన్ని చాటారు రచనల్లో .
- కొందరు ముఖ్యరచయితలు –గ్లోరియా గువార్డియ-నావలిస్ట్ జర్నలిస్ట్ ఎస్సేయిస్ట్ .మూడునవలలు ,జ్ఞాపకాలు ,కవితలు షార్ట్ స్టోరీస్ రాసింది .లెక్కలేనన్ని అవార్డులు రివార్డులు అందుకున్న అరుదైన రచయిత్రి .రికార్డో మిరో-మోడర్నిజం కు ఆద్యుడు .8నవలలు ,దిలాస్ట్ సి గల్ వంటి అయిదు కవితా సంపుటులు రాసింది .మేరియా ఒలింపియా –కవయిత్రి .ఒర్క్విడియాస్ పనామా వంటి కవితా సంపుటులు 5వెలువరించింది .రోసా మేరియా బిట్టన్-రచయిత్రి రొమాంటిక్ కవి .రోజులో సినన్-నాటక నవలారచయిత .అమీలా డెనిస్డీ ఇకాజా –కవయిత్రి .అల్సెరోఅంకన్ వగైరా కవితా సంపుటులు రాసింది .స్టెల్లా సియర్రా –సాంగ్స్ ఆఫ్ సి అండ్ మూన్ ,జాయ్ఫుల్ సింపతి ఇన్ ట్వెల్వ్ సానేట్స్ వగైరా రాసింది .అన్నబెన్ మిగులేనా –అనామియా నాటకం రాసి నటించి ప్రదర్శించింది కవయిత్రికూడా .జస్టో అర్రోవో-కథాసంపుటులు, నవలలు రాశాడు .
- సశేషం
- మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-7-20-ఉయ్యూరు