- ప్రపంచ దేశాల సారస్వతం
- 180-ప్యూరెటికో దేశ సాహిత్యం
- అమెరికా టేరిటరి కరోబియన్ ఐలాండ్ ప్యూరెటికో దేశం .సాన్ జువాన్ రాజధాని .జనాభా 32లక్షలు .కరెన్సీ-అమెరికన్ డాలర్ .కేధలిక్ మతం .ఇంగ్లీష్ ,స్పానిష్ భాషలు .93శాతం అక్షరాస్యత .5-18వయసు వారందరికీ విద్య కంపల్సరి.ఎలిమెంటరి హైస్కూల్ గ్రేడ్ విధాన విద్య .ఫార్మస్యూటికల్స్,కెమికల్స్ ,పెట్రో కెమికల్ ఎలెక్ట్రానిక్స్ ఆదాయవనరులు .ఎల్ యునిక్ జలపాతం పార్క్ ,కాస్టిల్లోసాన్ ఫిలిప్ డెల్మొరో ,బాహియా బయో లూమినిసెంటీ చూడదగ్గవి .యాత్రా సురక్షిత దేశం .
- ప్యూరెటికో సాహిత్యం –మొదటినుంచి కధలు చెప్పటం వినటం అనుస్యూతంగా వచ్చింది .దీనినే కోప్లాస్ అండ్ డేసిమాస్ అంటారు ,స్పానిష్ రాజులు వారి వంశ చరిత్రలను ఆస్థాన విద్వాసు లచేత రాయించేవారు .వీరిలో ఫాదర్ డీ గో టారెస్వర్గాస్ ఆ దేశ చారిత్ర రాశాడు ,ఫ్రాన్సిస్కో అఎరా డీ సాంటామేరియా మత చారిత్రిక కవిత్వం రాశాడు .వెస్ట్ ఇండీస్ గురించి రాసినవాడు జువాన్ పోలేస్ డీ లియోన్ .ఆ దేశ మొదటి గవర్నర్ ,అక్కడే పుట్టిన జువాన్ పోలేస్ డీ లియోన్ టైనో కల్చర్ వారి మత విషయాలు,ఉత్సవాలు పండుగలు రాశాడు .మొదటి ప్రింటింగ్ ప్రెస్ వచ్చాక1851లో ఒసియోస్ డీ లా జువెంటుడ్ మొదటిపుస్తకం రాసి ప్రింట్ చేశాడు .రాయల్ అకాడెమి ఏర్పాటైంది .
- 19వ శతాబ్దం లో రోమా౦టిజం ప్రవేశించి ఫ్రాన్సిస్కో గొంజేలో మారిన్,రాజరికానికి వ్యతిరేకంగా రాశాడు .కొందరు ప్రవాసాలకు వెళ్ళారు .స్పానిష్ –అమెరికా యుద్ధం లో ఈ దేశాన్ని అమెరికా స్వాధీన పరచుకుని స్వాతంత్ర్యం ఇచ్చాక దేశీ సాహిత్యం వచ్చింది .20వ శతాబ్దిలో అమెరికాకు వలసవెళ్ళారు కవులు రచయితలూ .జీసెస్ కలోన్ ను ‘’ఫాదరాఫ్ ‘’న్యుయోరికన్ మువ్ మెంట్ ‘’అంటారు .అతడు నల్లజాతివాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడటం రాదు .తన అనుభవాలు ,ఇతర వలసదారుల అనుభవాలను గురించి ఇంగ్లీష్‌లో రాసి ఆదేశ ‘’మొదటి జాతీయ రచయిత’’ అనిపించుకొన్నాడు .ఎ ప్యూరోటికన్ ఇన్ న్యు యార్క్ ,మొదలైన పుస్తకాలు రాసిఆదేశ సంస్కృతీ రచనకు శ్రీకారం చుట్టాడు నికొలాస్ మొహర్ కూడా ఇలానే రాశాడు .అతని రచనా సంపుటి పేరు ఎల్ బ్రాంక్స్ నేషనల్ బుక్ అవార్డ్ పొందింది .పిరి ధామస్ –కేఫ్ అనే కవిత ,,పెడ్రో పీట్రీ,గ్రాన్నినా బ్రాషి-క్లాసిక్ స్పానిష్ నవల ‘’యోయో బోయింగ్ ‘’,ఎస్మిరియా సలాంగ్ మొదలైనవారు మంచి రచయితలు .
- ముఖ్య రచనలు –రాఫెల్ కోర్డేరో బోధనలతో రచయితలపై గొప్ప ప్రభావం చూపాడు . మాన్యుల్ అలేన్సో ,’’ఎల్ గిబారో ‘’కవితా సంపుటి ,లో ఆదేశ పేదరికం వర్ణించాడు .కర్రేబియన్ అస్తిత్వం పై యుజేనియో మేరియా డీ హోస్టోస్-లా పెరేగ్రినాసినో డీ బయాన్ రాశాడు .అలేల్జాన్డ్రోతాపియా వైరివేరా ను ‘’ఫాదర్ ఆఫ్ ప్యూరోరిటికాన్ లిటరేచర్’’ అంటారు .కేయే టాకోల్ ఎ టోస్టే ఆ దేశ సమగ్ర చరిత్ర రచయిత .ఎ డ్గార్డో వేగా వాన్క్వే ,’’బ్లడ్ ఫ్యూగ స్ , గియాన్నియా బ్రాస్చి ‘’యోయో బోయింగ్ ,స్పీక్స్ రచయితా సోటో ముఖ్యులు .
- మొదటి కవయిత్రి నాటకరచయిత్రి మేరియా బిబ్లానా బెంటెజ్.మొదటి కవితా సంపుటి La Ninfa de Puerto Rico1832లో రాసి ప్రచురించింది .అలేజాన్డ్రినాబెనేతెజ్ Aguinaldo Puertorriqueño1843లో ప్రచురించింది ఆమె కొడుకు జోస్ గుటిఎర్బెనేటేజ్ ను ఆదేశ గొప్ప రొమాంటిక్ కవిగా భావిస్తారు .విప్లవ గేయాలు “La Borinqueña” . Lola Rodríguez de Tió రాసి ఉత్తేజం కలిగించారు .దేశభక్తి కవిత్వం రాసినవారిలో జోస్ డీ డీగో వర్జిలియో డేవిలియా ,లూయిస్ లారెన్స్ ,నేమేసియో కెనారెస్,హూగో మార్గనేటేస్ వంటి వారున్నారు
- యూనివర్సల్ లిరిసిజం రచయితలలో లూయిస్ పేల్స్ మాటొస్,లూయిస్ లిలోరెంస్ ,ఎవరిస్టో రెబెరో చెవ్రెమాంట్ మొదలైనవారు .నాటక రచయితలలో –ఫ్రాన్సిస్కో అవిర్రి ను ‘’ఫాదర్ ఆఫ్ పోర్టా రికన్ ధియేటర్ ‘’అంటారు .విజ్గాన్టేస్అరెయ్టో ప్రసిద్ధ నాటకాలు రాశాడు .ఇతడిని అనుసరించి రాసిన నాటక కర్తాలలో రీనె మార్క్వేస్-జోన్ బోబో నాటకం గొప్పది .గ్లానినా బాస్చి మొదలైనవారు ప్రయోగాత్మక నాటకరచయితలు .ఆదేశ మహిళల సామాజిక కృషి తెలియజేస్తూ అర్రిగోశియారాసిన చారిత్రాత్మక రచన గొప్పది .ది హిస్టరీ ఆఫ్ టొబాకో కల్టి వేషన్ మొదలైన వ్యవసాయ రచనలూ వచ్చాయి .
- ఆధునిక సమకాలీన రచయితలలో రాఫెల్ అసవేడో,మోసెస్ అగస్టో,యోలాండా అరాయో ,జెంనేట్ బెసేర్రా వగైరా ఉన్నారు .
- సశేషం
- మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-7-20-ఉయ్యూరు