- ప్రపంచ దేశాల సారస్వతం
182-ట్రినిడాడ్అండ్ టొబాగో దేశ సాహిత్యం
ట్రినిడాడ్అండ్ టొబాగో కరేబియన్ లో డ్యుయల్ ఐలాండ్ దేశం వెనెజుల దగ్గరలో ఉంది .క్రియోల్ జాతి సంప్రదాయ జీవుల ఆవాసం .రాజధాని –పోర్ట్ ఆఫ్ స్పెయిన్ .అనేకరకాల జాతుల పక్షుల నిలయం .చిన్నదైన టొబాగో బీచెస్ కు ప్రసిద్ధి .కరెన్సీ –ట్రినిడాడ్ అండ్ టొబాగో డాలర్ .ఇంగ్లీష్ భాష ,క్రియోల్ భాష .అన్నిరకాల క్రిస్టియన్లతోపాటు హిందువులు ,ముస్లిములున్నదేశం .అక్షరాస్యత 98.7శాతం .5-16వయసువారికి నిర్బంధ ఉచిత విద్య .బాగా విద్యావంతమైన దేశంగా ప్రపంచ ప్రసిద్ధి .అత్యధిక ఆదాయమున్న దేశంగా వరల్డ్ బాంక్ గుర్తించింది .పెట్రోలియం ,పెట్రో కెమికల్స్ ,ఆయిల్ నేచురల్ గాస్ గొప్ప ఆదాయవనరులు .మరకాస్ బీచ్ ,లా బ్రియా పిచ్ లేక్,ఇంగ్లిష్ మానస్ బే దర్శనీయాలు .దోపిడీలు ఎక్కువ వంటరి ప్రయాణం చేయరాదు .
ట్రినిడాడ్అండ్ టొబాగో సాహిత్యం –ఆఫ్రికన్ బానిసలు పర౦పరగా చెప్పుకొనే కథలకు ఈ దేశం మూలం .దేశీయ సాహిత్యం 20వ శతాబ్దిలోనే వచ్చింది .సి ఎల్ ఆర్ జేమ్స్ ,విఎస్ నయీపాల్, సెయింట్ లూసియన్ బారన్ డెరెక్ వాల్కాట్ లు వెస్ట్ ఇండీస్ సాహిత్యాన్ని సృష్టించారు .ఆంగ్లో ఫోన్ కరేబియన్ సాహిత్యం లో అత్యంత ప్రాచీనమైనది 1824లో జీన్ బాప్టిస్ట్ ఫైలిప్పే రాసిన ‘’ఫ్రీ ములట్టో’’.1854లో మైకేల్ మాక్స్ వెల్ ఫిలిప్’’ఇమ్మాన్యుయాల్ అప్పడోకా’’,ఎ టేల్ ఆఫ్ బుకనీర్స్ ‘’ఆ దేశమొదటి నవల
జేమ్స్ కిస్టఫా-ర్ అబోడ్-ది స్టోన్ రోజ్ ,లగాహూ పోయెమ్స్ రాశాడు .మైఖేల్ ఆంధోని-చరిత్రకారుడు హమ్మింగ్ బర్డ్ మెడల్ పొందాడు –దిగేమ్స్ వర్ కమింగ్ ,ది యియర్ ఇన్ సాన్ ఫెర్నేండో,గ్రీన్ దేశ బై ది రివర్ ,టేల్స్ ఫర్ య౦గ్ అండ్ ఓల్డ్ ,గ్లిమ్సేస్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో వంటి 12పుస్తకాలు రాశాడు .రాబర్ట్ ఆంధోని-కామన్ వెల్త్ అవార్డ్, ఆగాఖాన్ అవార్డ్ మొదలైనవి పొందాడు .రాబిన్ క్లార్క్ ,డిబినా ట్రేస్ ,నవలలు మై గ్రాండ్ మదర్స్ ఈరోటిక్ ఫోక్ టేల్స్ నవలు ,నాన్ ఫిక్షన్ గా అనదర్ డే ఇన్ ది బ్లాక్ వాల్కనో ,బ్లాక్ బియర్డ్ డు నాట్ కం హియర్ ఎనీ మోర్,పార్టి ఇన్ దిఐలాండ్స్ రాశాడు .విలియ౦ఆర్చి బాల్డ్ –నాటక రచయిత-వన్ఫర్ ది మని,ఆన్ మై మదర్స్ సైడ్ ,వగైరాలు రాసిసినిమాలుగా కూడా తీశాడు .కెవిన్ బాల్డియో సింగ్ –దికమెడియన్ అనే వన్ యాక్ట్ ప్లే రాశాడు.ఆదేశ చరిత్ర పుస్తకరచనకు సహకరించాడు .దిఆటో బయోగ్రఫీ ఆఫ్ పరాస్ ,విర్జిన్స్ ట్రయాంగిల్ ,ది టెన్ ఇంకార్నేషన్స్ ఆఫ్ ఆడం అవతార్ –అంటే యాడం యొక్క దశావతారాలు నవలలు రాశాడు .నీల్ దేవేంద్ర బిసూదత్-సెల్లింగ్ ఇల్యూజన్స్ ,దిఇన్నోసేన్స్ ఆఫ్ ఏజ్ ,డూయింగ్ ది హార్ట్ గుడ్ ,దిసోల్ ఆఫ్ ఆల్ గ్రేట్ డిజైన్స్ వంటివి చాలారాసి రైటర్స్ ట్రస్ట్ ఆఫ్ కెనడా అవార్డ్ పొందాడు .రమాబాయి ఎస్పినేట్-ది స్వింగింగ్ బ్రిడ్జ్ నవల-దీన్ని’’కాలాపానీ పోఎటిక్స్ గా భావిస్తారు ,,కమింగ్ హోం-కథలు, ఇండియన్ కుసైన్ ,నిన్జాస్ కార్నివాల్ వగైరా రాసింది .ఇస్మిత్ ఖాన్ –ది జంబీ బర్డ్ నవలరాశాడు .దీనిలో న్యుఇండో కరోబియన్ ఐడెంటిటి కి స్థానం కల్పించాడు.దిఓబియా మాన్ ,దిక్రుసిఫిక్సేషన్ నవలలూ రాశాడు .త్రి ట్రినిడాడియన్ మాండలీకానికి పట్టాభి షేకం చేశాడు రచనలలో .సారా లక్ష్మీ సింగ్ కూడా గొప్ప రచయిత్రి .బాలకృష్ణ నయీపాల్ కూడా ప్రసిద్ధుడే .శివ నయీపాల్ –ఫైర్ ఫ్లైస్ ,ది చిప్ చిప్ గాదరర్స్ ,ఎహాట్ కంట్రీ నవలలు,నార్త్ ఆఫ్ సౌత్ ,బ్లాక్ అండ్ వైట్ ,యాన్ అన్ ఫినిష్డ్ జర్నీ వంటి నాన్ ఫిక్షన్ ,బియాండ్ ది డ్రాగన్స్ మౌత్ ,ఏ మాన్ ఆఫ్ మిస్టరి కథలు రాశాడు
వి ఎస్ నయీపాల్ -1932-2018.ఈదేశం లో పుట్టిన బ్రిటిష్ రైటర్ .ఏ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్ మొదటి నవల 1961లో రాశాడు .యాత్రా సాహిత్యమూ రాశాడు .1974లో గేరిల్లాస్ నవలరాశాడు .ఏ బ్లెండ్ ఇన్ ది రివర్ ,ది ఎనిగ్మాఆఫ్ అరైవల్ ,దిమాస్క్ ఆఫ్ ఆఫ్రికా ,.2001లో సాహిత్య నోబెల్ ప్రైజ్ పొందాడు .ప్రసిద్ధ రచయిత జోసెఫ్ కాన్రాడ్ ఆయనగురించి – Naipaul is Conrad’s heir as the annalist of the destinies of empires in the moral sense: what they do to human beings. His authority as a narrator is grounded in the memory of what others have forgotten, the history of the vanquished.[74]
అన్నాడు దిమిడిల్ పాసేజ్ అనే పెద్ద వ్యాసం రాశాడు
దిన్యూయార్క్ రేవ్యూయర్ ‘’ The actual world has for Naipaul a radiance that diminishes all ideas of it. The pink haze of the bauxite dust on the first page of Guerrillas tells us what we need to know about the history and social organization of the unnamed island on which the action takes place, tells us in one image who runs the island and for whose profit the island is run and at what cost to the life of the island this profit has historically been obtained, but all of this implicit information pales in the presence of the physical fact, the dust itself. … The world Naipaul sees is of course no void at all: it is a world dense with physical and social phenomena, brutally alive with the complications and contradictions of actual human endeavour. … This world of Naipaul’s is in fact charged with what can only be described as a romantic view of reality, an almost unbearable tension between the idea and the physical fact …అని శ్లాఘించింది .బుకర్ ప్రైజ్, ట్రినిటిక్రాస్ అవార్డ్ కూడా పొందాడు .85వ ఏట లండన్ లో 11-8-2018 న మరణించాడు .15ఫిక్షన్ రచనలు ,17నాన్ ఫిక్షన్ రచనలు చేశాడు
లక్ష్మీ పెర్సౌద్ –ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ .గొప్పనవలలు –బట్టర్ ఫ్లై ఇన్ ది విండ్ ,శాస్త్రా ,రైజ్ ఇన్ ది లాంటర్న్స్ హై,డాటర్స్ ఆఫ్ ఎంపైర్ మొదలైనవి రాసింది .ఆమె పేరిట వార్విక్ యూని వర్సిటి ఫెలోషిప్ ఏర్పాటు చేసింది .ఆనరరి డాక్టరేట్ పొందింది .రేమాండ్ రామ చరితార్ –కవి .కామన్ వెల్త్ రైటర్స్ ప్రైజ్ పొందాడు .అమెరికన్ ఫాల్ కవితాసంపుటి వెలువరించాడు .డెరెక్ వాల్కాట్ –నోబెల్ ప్రైజ్ విన్నర్ కవి .ఎరిక్ విల్సన్ –హిస్టోరియన్ –కేపిటలిజం అండ్ స్లేవరి ,దినీగ్రోయిన్ ది కరేబియన్ ,ఫ్రం కొలంబస్ టు కాస్ట్రో,బ్రిటిష్ హిస్టోరియన్స్ అండ్ ది వెస్టిండీస్ వంటివి చాలారాశాడు .రవీన్ద్రనాద్ మహారాజ్ –హోమర్ ఇన్ ఫ్లైట్ ,ఏ పెర్ఫెక్ట్ ప్లేడ్జ్ఫాట్ బాయ్ ఫాల్ డౌన్ వంటి నవలలు ,దిరైటర్ అండ్ హిజ్ వైఫ్ కథాసంపుటి .విక్టరి మీట్ రీడింగ్ రైటర్స్ రీడింగ్ సిటి ఆఫ్ వర్డ్స్ మొదలైన నాన్ ఫిక్షన్ రేడియో నాటకాలు స్క్రీన్ ప్లేస్ రాశాడు.క్వీన్ ఎలిజబెత్ మెడల్ కామన్ వెల్త్ రైటర్స్ అవార్డ్ ,బుక్ అవార్డ్ ,లైఫ్ టైంలిటరరీ వార్డ్ వంటివి చాలాపొందాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-7-20-ఉయ్యూరు