’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -10
హంపీశిథిలాల లో రాతి తొట్ల కథా కమామీషు
విజయనగర రాజులకాలం లో సైన్యం లో గజ దళాలు పదాతి దళాలే ఎక్కువగా ఉండేవి .కృష్ణ దేవ రాయలకాలం లో బహమనీ సుల్తానులకు అశ్విక బలం ఎక్కువగా ఉండటం వలన యుద్ధాలు తేలిగ్గా గెలిచే వారు .ఈ రహస్యం గుర్తించిన రాయలు పశ్చిమ సముద్రతీర గోవాను పట్టుకొని ,విదేశాలనుంచి మంచి జాతి గుర్రాలను దిగుతి చేసుకొని ఆశ్వికదళం పెంచాడు గుర్రప్పిల్లలూ దిగుమతి అయ్యేవి .వాటికి పాలు తాపించటానికి రెండడుగుల ఎత్తు రెండడుగుల వెడల్పు సుమారు పది అడుగులపోడవు ఉండే రాతి తొట్టెలను చెక్కించాడు .ఇ ప్పుడున్న ముక్కలు అవే .అందులో ఒకటే భద్రంగా ఉంది .పురాతత్వ శాఖ వారు హజార రామాలయం దగ్గర భద్రపరచారు .
ఆంధ్రప్రభ ఎడిటర్ నార్ల ఫతేపూర్ సిక్రీ హంపీలు వెళ్లి చూసొచ్చి రామ చంద్ర గారితో ‘’ఫతేపూర్ శిక్రి ఇంప్రెస్ చేనట్లు నన్ను హంపీ ఇంప్రెస్ చేయలేదు ‘’అన్నాడట.బాగా కష్టం కలిగిన రామచంద్ర ‘’దానికీ దీనికీ పోలికేమిటి?అది చెక్కు చెదరకుండా ఉంది .అక్కడి ప్రజలు సహృదయులుకనుక పరరాజుల దండయాత్రలు లేవు .ఒకరాజు శత్రువులను జయి౦చాక తనకోరిక తీరింది కనుక ఆ ప్రాంత ప్రజల్ని, కట్టడాలను ,కళాఖండాలను తనవే అనే భావనతో సంరక్షించటం సంప్రదాయం .కానీ ఇక్కడ బహమనీ సుల్తానులకు వియనగరం అనే హడలు భయం జాస్తి .జనం మళ్ళీ ఎడురుతిరుగుతారనే భయం ,అనుమానం తో విజయ నగరాన్ని ముక్కలు ముక్కలు చేసి ప్రజల్ని చావగొట్టారు .’’పాడు పట్నం ‘’చేసేశారు .కొన్నిమాత్రమే ఆ దాడి నుంచి బయట పడ్డాయి .జపాపా ఎంక్లోజర్ లోని గజశాల ,కమలాపురం పొలిమేరల్లోని లోటస్ మహల్ ,ఉగ్ర నరసింహ ,హజార రామాలయం ,హేమకూట వినాయక విగ్రహాలు ,విఠలస్వామి గుడి ,అప్పటి వాస్తు శిల్పకళా వైభవానికి తార్కాణలుగా మిగిలిలాయి చాలదా ?’’అని క్లాస్ పీకారు .
వేదాలకు వ్యాఖ్యలురాసిన విద్యానగరం విజయనగరం .తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగమైన సరస్వతీ పీఠంకదా .అష్ట దిగ్గజకవుల ,వేదవేదాంగ పారంగతుల ,వైద్య వతంసుల ,రాజనీతి కోవిదుల గ్రంథాలయాలు ఏ మయ్యాయి ?శత్రురాజుల క్రోధాగ్నికి ఆహుతయ్యాయి .మానవల్లి రామకృష్ణ కవి గారు తరచుగా తిరుమలవారితో ‘’విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ,అక్కడి పండితులంతా అనంతపురం, కడప జిల్లాలకు కాంది శీకులై వచ్చారయ్యా .మీ అనంతపురం జిల్లాలో తాడిమర్రి చిగుళ్ళ రేవు, దంపెట్ట,దాడికోట కొండాపురం, కుంటిమద్ది,పెనుకొండ ,మర్రిమాకులపల్లి మొదలైన ప్రాంతాలను బాగా గాలిస్తే అపూర్వ శాస్త్ర గ్రంథాలు దొరుకు తాయయ్యా ‘’అనే వారట .ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త రంగస్వామి సరస్వతి కూడా ఈమాటలే అనేవారని రామచంద్ర జ్ఞాపకం చేసుకొన్నారు .ఏమైతేనేం ?అంతాపాడుపడి పోయింది .గుర్రాలు కూలిపోయాయ్.గుర్రప్పిల్లలు పాలుతాగేతొట్లు విరిగి పోయాయి అని నిర్వేదం చెందారు రామచంద్ర ..
‘’అశ్వా యస్య జయస్తస్య –యశ్వాస్వా స్తస్య మేదినీ-ఆశ్వాయస్య యశస్తస్య –యశ్వాస్వాః తస్య కాంచనం ‘’
భావం –గుర్రాలున్నవాడిదే విజయం .గుర్రాలున్నవాడిదే భూమి .గుర్రాలున్న వాడిదే కీర్తి .గుర్రాలున్నవాడిదే బంగారం .
సశేషం
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-20-ఉయ్యూరు