ప్రపంచ దేశాల సారస్వతం
- 185-ది బహమస్ దేశ సాహిత్యం
- ది బహమస్ దేశాన్ని ది కామన్ వెల్త్ ఆఫ్ ది బహమస్ అ౦టారు .లుకేయన్ ఆర్చిపెలాగో లో ఉంటుంది .కరేబియన్ లో లుకేయన్ ఆర్చి పెలాగోలో 97శాతం భూభాగం ,అర్చిపెలాగో జనాభాలో 80శాతం జనం ఉన్న దేశం .రాజధాని –నసావు .భాష బహామయన్ క్రయోల్ .కరీన్సీ –బహామియన్ డాలర్ .ప్రొటెస్టెంట్ మతం ఎక్కువగా మిగిలిన క్రిస్టియన్ మతాలూ ఉన్నాయి .అధికారభాష –ఇంగ్లీష్ .99శాతం అక్షరాస్యత .5-18వయసు వారందరికీ కంపల్సరీ విద్య.వ్యవసాయం ,సిమెంట్ ముఖ్య ఆదాయవనరులు .ఉల్లి ,ఆక్రా, టమాటా బాగా పండిస్తారు .అట్లాంటిస్ కాసినో ,పారడైజ్ ఐలాండ్ ,హార్బర్ ఐలాండ్ చూడ తగినవి .రేప్ ల భయం ఉన్నా యాత్రకు రక్షణ ఉంటుంది .
ది బహమస్ సాహిత్యం – Islanders in the Stream: A History of the Bahamian People: Volume One: From Aboriginal Times to the End of Slavery” పుస్తకాన్ని 1992లో ముద్రించారు.రచయితలు మైకేల్ క్రేటన్,గైల్ సాండర్స్ .ఆదేశ ప్రజల సమస్త విషయాలు ఉన్నాయి .ఇదే మొదటి పుస్తకం .ఆఫ్రో-బహామియన్ జానపద సాహిత్యం 18వ శతాబ్దం వరకు పర౦పరగా వచ్చిన కథలు గాథలు పాటలు ఉంటాయి. ముఖ్యంగా బి రాబీ ,బీ బౌకీ ,బి స్పైడర్ బి ఎలిఫెంట్ లపై ఉన్నాయి .మౌఖికంగా మాత్రమె ఉన్న వాటిని 19వశతాబ్దిలో పాట్రీషియా గ్లింటన్మికోలాస్ అనే ఆయన An Evening In Guanima: A Treasury of Folktales from the Bahamas”.[
గా ప్రచురించి మహోపకారం చేశాడు .
అయిదుగురు ప్రముఖ రచయితలు-నటాషా రూఫిన్ – సన్ ఫ్లవర్స్ ఫీల్డ్స్ కవితా సంపుటి ప్రచురించిన యువ కవయిత్రి .ఈమె హెచ్ ఐ వి యాక్టి విస్ట్ కూడా .ఇందులో మరణం ,శోకం ,తన విషయాలు ఉంటాయి .
టోనీ ఎస్ వాంగ్ –ఎలెక్ట్రానిక్స్ చెందిన యితడు రచయిత,కవికూడా .మిస్టర్ మైఖేల్ జాక్సన్ ,టోనీస్ బాగల్డ్ వ్యూ,రాఖేల్ రే,రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ ,లాంగ్వేజ్ సుపీరియర్ కంఫుట్(ఎ గ్లోబల్ లాంగ్వేజ్ )ఎలెక్ట్రికల్ ఎలెక్ట్రానిక్ వైబ్రేషన్స్ సిమ్ప్లి బీమ్స్ ఫైడ్. రాశాడు .
షాన్ టి గార్డినర్-ఫ్రీలాన్స్ రైటర్ .’’ది లైఫ్ స్టార్ ‘’ఫాంటసి నవల రాశాడు .
ఫే లోవేల్స్ –నవలలు కథలు రాసింది .దిలేడీ మాగజైన్,ది బ్రాడ్కిల్ రివ్యు లలో కలు రాసింది . బ్లార్ కూడా .రొమాంటిక్ నవలు రాసింది .సన్ బీమ్స్ ఫ్రం ది హార్ట్ వంటివి ప్రసిద్ధమైనవి .
అలిసన్ అల్బురి –లైఫ్ ఆన్ ఎ రాక్ నవలతో పేరుపొందింది .
186- బెలిజే దేశ సాహిత్యం
మధ్య అమెరికా తూర్పున కరేబియన్ సముద్ర తీరాన బెలిజే దేశం ఉంది .తూర్పు పడమరలో దట్టమైన అరణ్యాలుంటాయి .వందలాది లోతట్టు ఐలాండ్స్ ఉంటాయి .సముద్ర సంపద పుష్కలం .టవరింగ్ పిరమిడ్ కు ప్రసిద్ధి .రాజధాని –బెల్మోఫోన్.కరెన్సీ –బెలిజేన్ డాలర్ .3.8లక్షల జనాభా .క్రిస్టియన్ దేశం .ఇంగ్లిష్ అధికార భాష .బెలిజేన్ క్రయోల్ భాషాజనం ఉన్నారు .ప్రీ స్కూల్ ,ప్రైమరీ ,సెకండరి ,టేరిటరి,హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థ .అక్షరాస్యత -70శాతం .వ్యవసాయం ముఖ్య ఆదాయం –చెరకు బనానా పంట ఎక్కువ టూరిజం కూడా ఆదాయమే .గ్రేట్ బ్లూ హోల్ ,కేయే కాకర్ ,బెలిజే బారియర్ రీఫ్ ,తవరింగ్ పిరమిడ్స్ .సుఖవంతమైన ప్రయాణం .
బెలిజే సాహిత్యం –బెలేజియన్ సాహిత్యం –జీ ఎద్జేల్ ,గ్లెన్ గాడ్ ఫ్రే ,ఫెలిషియా హీర్మాండే వగైరా మంచి రచయితలున్నారు .జీ ఎడ్జేల్-బెకా లాంబ్ నవల రాసింది .జాతీయ ఉద్యమవివరాలు ఇందులో ఉన్నాయి .ఫెస్టివల్స్ ఆఫ్ సాన్ జాక్విలిన్ ,,టైంఅండ్ దిరివర్ రాసింది .గ్లెన్ గాడ్ ఫ్రే-ఆ దేశ సంస్కృతిపై రచనలు చేశాడు ..దిసిన్నర్ బసనోవా ,నవల మంచి పేరు తెచ్చింది .ఫెలీషియా హీర్మా౦ డెజ్ –ఆ దేశ మహిళల గురించి రాసింది .ఐ డోంట్ నో యు బట్ ఐ లవ్ యు నవల ,,దోజ్ రెడిక్యులర్ యియర్స్ నరెంగా ,రిఫ్లెక్షన్స్ వంటి ఫామిలీ స్టోరీస్ కథసంపుటి ప్రచురించింది ,జార్జ్ సేమూర్ గబా –ది స్లీపింగ్ జాయింట్ చిత్రం గీశాడు .ఎల్లో టైల్ నాటకం ,ది నేకేడ్ ఐ కవితా సంపుటి రాసి అనేక ప్రైజులు పొందాడు .జేమ్స్ సల్లివాన్ మార్టినేజ్ –కరేబియన్ జన్గిల్స్ అనే అద్భుత కవితా సంపుటిప్రచురించాడు .జాన్ అలేక్జాండర్ వాట్లర్ –కవిత్వం కథలురాసిన జానపద గాయకుడు .క్రై అమాంగ్ రైన్ క్లౌడ్స్ ,బాస్ ఆఫ్ డాన్గ్రిగా రాసి ప్రచురించాడు
లియో బ్రాడ్లీ –చరిత్రకారుడైనకవి .లుకింగ్ ఎట్ అవర్ లిటరేచర్ ,అమాంగ్ మై సావనీర్స్ ,బెలిజెయన్ ఫ్లేవర్ రాశాడు .రేమాండ్ బారో –డాన్ఈజ్ ఎ ఫి షర్ మాన్ అనే ప్రముఖ కవిత రాశాడు జోయిలా ఎలిస్ బ్రూనే –హీరోస్ ,లిజార్డ్స్ అండ్ పాషన్స్, కదా సంపుటులు రాసిన లాయర్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-20-ఉయ్యూరు