ప్రపంచ దేశాల సారస్వతం
187-ఆంటిగువా అండ్ బర్బుడా దేశ సాహిత్యం
రెండు పెద్ద ,అనేక చిన్న ఐలాండ్ ల సముదాయ దేశమే అట్లాంటిక్ కరేబియన్ సముద్రం కలిసే చోట ఉన్న ఆంటిగువా అండ్ బర్బుడా .రీఫ్ లైన్డ్ బీచెస్ కు ప్రసిద్ధి .రాజధాని సెయింట్ జాన్స్.కరెన్సీ –ఈస్టర్న్ కరీబియన్ డాలర్ .ఆఫ్రికన్లతో సహా అనేక జాతులున్న దేశం .97వేల జనాభా .క్రిస్టియన్ దేశం .ఇంగ్లీష్ అధికారభాష .ఆన్టిగ్వియన్ క్రయోల్ భాష .98.95శాతం అక్షరాస్యత .5-16మధ్యవయసు వారందరికీ కంపల్సరీ విద్య .బ్రిటిష్ విద్యా విధానం .టూరిజం ఆదాయవనరు .చెరకు మామిడి కొబ్బరి గుమ్మడి ,బనానా బాగా పండుతాయి .నేల్సన్స్ డాక్ యార్డ్ , లాంగ్ ఐలాండ్ ,డికేన్సన్స్ బే చూడదగినవి .సురక్షితం .
ఆంటిగువా అండ్ బర్బుడా సాహిత్యం –
జహ్రా ఎయిరాల్ -,రచయిత్రి స్త్రీ హక్కు ఉద్యమ కారిణి .షుగర్ ఆపిల్ దియేటర్ యామానురాలు .చాలా అవార్డు ల గ్రహీత .ది ఫర్గాటెన్ నాటకంరాసింది .ది లుకింగ్ గ్లాస్ వంటి కథలు రాసింది .అన్నే హార్ట్ గిల్బర్ట్-మేమాయిర్సాఫ్ జాన్ గిల్బర్ట్ ,రాసింది .జోయాన్నే సిహిల్హౌస్ –ది బాయ్ ఫ్రం విల్లో బెండ్ ,డాన్సింగ్ నూడ్ మ్యూజికల్ యూత్ , నవలలు,దికరేబియన్ రైటర్ ,పెన్ అమెరికా ,ఎస్సెన్స్ ,రైటర్స్ డైజెస్ట్,హుఫ్ఫింగ్టన్ పోస్ట్ ,కలబాష్ ,కరేబియన్ బీట్ ,మోకో మేగజైన్ వంటి నాన్ ఫిక్షన్ .వాడాలి యూత్ పెన్ అవార్డ్ పొందింది .ఆన్ బికమింగ్ కవితా సంపుటి ,ఓ గాడ్ నవల.lost ఎ కరేబియన్ సి అడ్వెంచర్ కూడా రాసి టెలివిజన్ లోనూ పని చేసింది .మేరీ ఎలీనా జాన్ –ఇంటర్నేషనల్ డబ్లిన్ లిటరరీ అవార్డ్ గ్రహీత .అన్ బర్నబుల్ నవలతో విఖ్యాతురాలైంది .ఎలిజబెత్ హార్ట్ త్వైటీస్-మొదటి ఇద్దరు కరెబియన్ మేదాడిస్ట్ రచయిత్రులలో రెండవ ఆమె .అన్నేహార్ట్ ఈమె అక్క మొదటి ఆమె .జమైకన్ కిన్ కైడ్-ఎ స్మాల్ ప్లేస్ అనే నాన్ ఫిక్షన్ ,లైఫాండ్ debt అనే డాక్యుమెంటరి చేసింది .అన్నేజాన్ ,లూసీ ,దిఆతోగ్రఫీ ఆఫ్ మై మదర్ ,మిస్టర్ పాట్లర్ ,సి నౌ దెన్ నవలలు అవండో,దిఫినిషింగ్ లైన్ ,క్సుఎలా తోపాటు ఎట్ ది బాటం ఆఫ్ దిరివర్ ,షార్ట్ స్టోరీస్ ,ఏ స్మాల్ ప్లేస్ ,మై బ్రదర్ ,టాక్ స్టోరీస్ ,మై గార్డెన్ బుక్ ,అమాంగ్ ఫ్లవర్స్ వంటి అనేక నాన్ ఫిక్షన్ రచనలు ,అన్నే గ్వెన్ లిల్లీ ,పాం ,టులిప్ కవితలు రాసింది .మోర్టాన్ ,గుగ్గేన్హాం ,లనాన్ ,అమెరికన్ అకాడెమి వంటి అనేక అవార్డులు ,ఆనరారి డాక్టర్ ఆఫ్ హ్యుమేన్ లెటర్స్ తోపాటు డాన్ డేవిడ్,లీలా వాలెస్ రీడర్స్ డైజెస్ట్ ప్రైజ్ లు అందుకొన్న విదుషీమణి .
మెల్విన్ కాక్స్టన్-జర్నలిస్ట్ .వర్జిన్ ఐలాండ్ క్రైం అనే సిరీస్ రాసి పులిట్జర్ ప్రైజ్ పొందాడు
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-20-ఉయ్యూరు