- ప్రపంచ దేశాల సారస్వతం
188-సెయింట్ లూసియా దేశ సాహిత్యం
సెయింట్ లూసియా ఈస్ట్ కరేబియన్ ఐలాండ్ దేశం .పడమటి తీరం వల్కానిక్ బీచెస్ ,తూర్పుతీరం పర్వత శ్రేణులు ఉంటాయి .రీఫ్ డైవింగ్ సైట్స్ ,రిసార్ట్ లు ప్రత్యేకత ,రైన్ ఫారెస్ట్ లు వాటర్ ఫాల్స్ కను విందు చేస్తాయి ,రాజధాని –కాస్ట్రీస్..ఫ్రెంచ్ ,సేయిన్ట్ లూసియన్ క్రియోల్ భాష ఉన్నాయి .కరెన్సీ –ఈస్టర్న్ కరేబియన్ డాలర్ .,జనాభా -1’82లక్షలు .రోమన్ కేధలిక్ మతం . అధికార భాష ఇంగ్లీష్ .90శాతం అక్షరాస్యత .ప్రీ స్కూల్ ఇన్ఫ౦ట్ ,జూనియర్ ప్రైమరీ సీనియర్ ప్రైమరీ ,సెకండరి పోస్ట్ సెకండరి విధాన విద్య 5-15వయసు వారందరికీ కంపల్సరి విద్య .బనానా అవకాడ్రో,మా౦గొస్,టూరిజం ఆదాయ వనరులు .గ్రాస్ పిటాన్ ,మేర్గాట్ బే,రోడ్నీ బే దర్శనీయాలు .సురక్షితం .
సెయింట్ లూసియా సాహిత్యం –సెయింట్ లూసియన్ సాహిత్యం అంటే డెరిక్ వాల్కాట్ గుర్తుకొస్తాడు .కవిత్వం లో నోబెల్ ప్రైజ్ విన్నర్ .నాటక రచయితకూడా .ఆయన కావ్యం ‘’ఒమేరాస్ ‘’అజరామరం .నెగ్ మొరాన్, ఫ్రీడం ఫైటర్స్ , సీజన్స్ ఆఫ్ మిస్ట్ ,డెత్ బై ఫైర్ నవలు రాసిన మోడేస్తోడౌన్స్,ఆండర్సన్ రేనాల్డ్స్ అభినందనీయులు ‘’ .సర్ ఫ్రెడరిక్ ట్రావేర్స్ –ది క్రెడిల్ ఆఫ్ ది డీప్ రాశాడు .ఏ హిస్టరీ ఆఫ్ లూసియా జోలీన్ హార్,101ధింగ్స్ టు డు ను రస్సెల్ ,డ్రీం ఆన్ మంకీ డెరెక్ వాల్కాట్ ,లూసియా సెయింట్ లైట్ ను కేధరిన్ ఎ రూమ్ ఆన్ ది హిల్ ను గార్త్ రాశారు
ఈదేశాన్ని కొలంబస్ 1502లో కనుగోన్నాడు .ఇక్కడ ఉడుములు(ఇగూనా ) ఎక్కువగా ఉండటం వలన దీన్ని అయొనాలో అనేవారు .ఇంతకంటే వివరాలు లేవు .
189-సెయింట్ విన్సెంట్ అండ్ గ్రనడైన్స్ దేశ సాహిత్యం
దక్షిణ కరేబియన్ దేశమే సెయింట్ విన్సెంట్ అండ్ గ్రనడైన్స్.ముఖ్య ఐలాండ్ సెయింట్ విన్సెంట్ .దీనికి అనుబంధంగా గొలుసుకట్టుగా చిన్న ఐలాండ్స్ ఉంటాయి .వైట్ శాండ్ బీచెస్ వల్కనో బీచెస్ ఉంటాయి .రాజధాని –కింగ్ టౌన్ .కరెన్సీ –ఈస్ట్రన్ కరేబియన్ డాలర్ .జనాభా -1.1లక్షలు .విన్సే౦టినియన్ క్రియోల్ భాషాజనం .అధికార భాష –ఇంగ్లీష్ . క్రిస్టియన్ మతం .95.65శాతం అక్షరాస్యత .ఉచిత ఐచ్చిక విద్య ..యారో రూట్ ఉత్పత్తిలో ప్రపంచంలో టాప్.మిగిలిన దుంపకూరలూ బాగా పండిస్తారు .టొబాగో, కేస్,యూనియన్ ఐలాండ్ ,పెటిట్ సెయింట్ విన్సెంట్ చూడదగ్గవి . సురక్షితం
సెయింట్ విన్సెంట్ అండ్ గ్రనడైన్స్ సాహిత్యం –కొండలపైనా రాతి ఫలకాలపైనముద్రా సాహిత్యముండేది .ఈ ఐలాండ్ కు చెందిన అతి తక్కువ మంది రచయితలే ఉన్నారు .వారిలో కవిత్వానికి షెకె కీనే ,రాల్ఫ్ ఎవరార్డ్ గోన్సాల్వేస్ –ప్రధానిగా పని చేసి తన అనుభవాలు రాశాడు .సెసిల్ బ్రౌన్ షార్ట్ స్టోరీ రైటర్ .జిమ్మీ ప్రిన్స్ కవి .
190-యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ దేశ సాహిత్యం
ఆఆఆఅమెరికాలొ ఉన్న యుఎస్ వర్జిల్ ఐలాండ్స్ దేశం కరేబియన్ ఐలాండ్ దేశం .వైట్ శాండ్ బెచేస్ ,రీఫ్స్, కొండలు ఉంటాయి .రాజధాని –షార్లెట్ అమలీ .జనాభా ఒక లక్ష .కరెన్సీ-అమెరికన్ డాలర్ .ప్రోటేస్టెంట్ క్రిస్టియన్లు ఎక్కువ .అధికారభాష –ఇంగ్లీష్ .5-16వయసు వారికి కంపల్సరి విద్య .అమెరికన్ ఇంగ్లీష్ విద్యా విధానం .99శాతం అక్షరాస్యత .టూరిజం ట్రేడ్ ఆదాయవనరులు వ్యవసాయం తక్కువ .మేగేన్స్ బె బీచ్ ,ట్రంక్ బే,నేషనల్ పార్క్ చూడతగినవి .సేఫ్.
యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ సాహిత్యం –ఈ దేశ సాహిత్యం టోర్టోలా,వర్జిన్ గోర్డా ,అనేగడ,జోస్ట్ వాన్ డైక్ భాషలలో ఉన్నది .కొద్ది మంది రచయితలున్నారు వారిలో –ఆల్ఫేయస్ఒసారియో నార్మన్ -1885-1942,వెర్నా పీల్ మోర్,జెన్నీ వీట్లీ ,పాట్రీషియా టర్న్ బుల్.
స్కాట్ ఒ డెల్-మై నేం ఈజ్ నాట్ ఎంజేలికా అనే చరిత్రాత్మకనవల 1733బానిసల పునర్జీవనం పై రాసింది .అనేక మంది అభిమానం ప్రశంసలు పొందింది .టోబియాస్ బకేల్ –రాసిన నవల హలో దికోల్ ప్రోటోకాల్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది ,క్రిస్టల్ రైన్ ,రాగ్ ముఫిన్ ,స్లై మాంగోస్ ,అపోక్లిప్సే ఓషన్ అనేక్సేనో వెల్త్ సిరీస్ ,ఆర్కిటిక్ రైజింగ్ ,హరి కేన్ ఫీవర్ హలో ఎన్వాయ్,ది ట్రోవ్ వంటి ఇతర రచనలు ,ది ఎక్సి క్యూషన్ నెస్ అనే నావేల్లా ,టైడ్స్ ఫ్రం ది న్యు వరల్డ్ ,నేసేన్స్ ,మిటిగేటేడ్ ఫ్యూచర్ సంపుటులు,పేల్,బ్లూ మెమరీస్ ,ఒయాసిస్ కథా సంపుటులు ,ది స్టోరీస్ వుయ్ టెల్-బెర్ముడా ఆన్దాలజిఆఫ్ సైన్స్ ఫిక్షన్ ,ఫాంటసి అండ్ హారర్ వగైరా రాశాడు
కేసేన్ కాలెండర్ –బాలసాహిత్య రచయిత.స్టోన్వాల్ బుక్ అవార్డ్ ,లాంబ్డా లిటరరీ అవార్డ్.ఈమె రాసిన ‘’హరికేన్ చైల్డ్ ‘’ ఎపిక్ లవ్ స్టోరీ ..రెండవనవల కింగ్ అండ్ డ్రాగల్ ఫ్లైస్ రాసింది .దిస్ ఈజ్ కింద్ ఆఫ్ ఎపిక్ లవ్ స్టోరీ ,ఫెలిక్స్ ఎవర్ ఆఫ్టర్ లను యువతకు ,ఐలాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ స్ట్రారం సిరీస్ ,కింగ్ ఆఫ్ ది రైజింగ్ ఫాంటసి నవలలు ,రాసింది .
ఎరిక్ డాసన్-డౌన్ స్ట్రీట్ ,సెయింట్ ధామస్ అండ్ బియాండ్ ,ఎడైనమిక్ నైబర్ హుడ్ మొదలైనవి రాశాడు .మాలిక్ సేకౌ –లెఫ్టినెంట్ గవర్నర్ .వర్జిన్ ఐలాండ్ ,కరేబియన్ లపై చాలా వ్యాసాలూ రాశాడు .టిఫినీ యానిక్-ఫిక్షన్ రాసినమహిళ.హౌ టు ఎస్కేప్ ఫ్రం ఏ లెపర్ కాలని నావేల్లా ,వైఫ్ నవల తోపాటు కథలూ రాసింది .అద్భుతకవిత్వం జర్నల్స్ లో రాసి పేరుపొందింది .మొదటి నవల లాండ్ ఆఫ్ లవ్ అండ్ డ్రౌనింగ్ లో ఆ దేశ నాడిని వెతికి పట్టుకొన్నదని ప్రశంసలు పొందింది .అకాడెమీ ఆఫ్ అమెరికన్ పోఎట్స్ ,ప్రైజ్ పొందింది.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-8-20-ఉయ్యూరు ,