’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-12
శాడిజానికి ఫలితం
పరులను బాధించటమే శాడిజం .దానిఫలితం జీవితం లో అనుభవించాల్సిందే .రామచంద్రగారికి తెలిసిన మాష్టారు బాగా చదువు చెప్పేవాడే,కోపం, ద్వేష౦,వ్యసనాలు లేనివాడే కాని ఈగలను చిత్రవధ చేసేవాడు .చివరికి పక్షవాతం వచ్చి మంచం పడితే ఈయన చూడటానికి వెడితే ‘’నా జీవితమంతా మీకు తెలుసుకదా ఎందుకు ఈదుర్గతి ‘’అని వాపోయాడు .వీరు ‘’నిజమేకాని కొన్ని వేల ఈగలను చిత్రవధ చేసి ఉంటారు దాని ఫలితమే ఇది .శరణాగతి మనసంప్రదాయం. కనుక పునర్జన్మ లేదుకనుక పాపఫలితం ఈజన్మలోనే అనుభవించాలి .ధైర్యం తో భగవధ్యానం చేయండి ‘’అని ఓదార్చారు. కొంతకాలానికి ఆయన చనిపోయాడు .
ఆనేగొందే రాకుమారులు శ్రీకృష్ణ దేవరాయలు శ్రీరంగ దేవరాయలురామచంద్రగారి మిత్రులు .వీరి వయసువారే అప్పటికి తోమ్మిదోఏడు.’’అయ్యవారూ మూలుగు తింటావా “”అని వీరితో హాస్యమమాడేవారు వీరికి అదేమిటోతెలీదు .మూలుగు అంటే ఎముకలలోని మజ్జ అని తర్వాత తెలిసింది .ఒకటి రెండుసార్లు వాళ్ళతో వేటకు వెళ్ళారు .చిరుతలను చంపటం ఎలుగులను పట్టుకోవటం వారికి మహా సరదా .వేటాడిన జంతువుల్ని కర్రలతో చిన్న పిరమిడ్ లాగా ,కట్టేలమోపులాగా ఉండే బోనుల్లో బంధించేవారు .దాని ఒకచివర సన్నగా రెండో చివర వెడల్పుగా ఉండేది .సుమారు 15అడుగులపోడవు .దానికి రెండు అరలు .ఒక అరలోమేకను కట్టేసేవారు .చిరుత దానిలో దూరి అరిచే మేక పిల్లను పట్టుకొంటు౦ది,లాగుతుంది పూర్తిగా లాగకుండా అడ్డకర్రలుంటాయి .మేకను లాగగానే కర్రలు అడ్డుపడుతాయి .చిరుత గి౦జు కొంటుంది ఇదో సరదా వాళ్లకు . కదిలే వీలుండదు దానికి .మనిషి, పిల్లి అయితే కావాల్సింది తీసుకొని బయట పడగలవు. కాని పులులు చిరుతలుఅలాచేయలేవు .ఇంకోరకం బోనులు ఎలుక బోనులా బండలతో కట్టేవారు .పులిలోపలికి దూరి మేకను లాగగానే బోనుమూత బండకింద ఢాం శబ్దంతో పడిపోతుంది .పులి బిత్తర పోతుంది .
తర్వాతే అసలు నరకం మొదలౌతుంది .కర్రలబోనులోని చిరుతను ఊళ్లోకిమోసుకొచ్చి పులి ము౦దు కాళ్లలో ఒకదాన్ని బలవంతాన బయటికి లాగి, మడమదగ్గర కత్తితో గాట్లు పెట్టి ,గట్టి నూలుపగ్గం కాలికి కట్టి ముడిగట్టిగా వేసేవారు . అది నొప్పితో బొబ్బలు పెట్టేది .తర్వాత రాచనగరు సెంటర్లో పెద్ద స్తంభం పాతి ‘’చిరుతను ఆడిస్తాం ‘’అని దండోరా వేసేవారు .వినోదం చూడటానికి జనం తండోప తండాలుగా వచ్చే వారు .నూలుపగ్గం మరో కొనను పాతిన స్తంభానికి కట్టి బోను తలుపులకు అడ్డంగా ఉన్న కర్రల్ని తీసేసేవారు .చిరుత బయటపడి బాధతో తప్పించుకొనే ప్రయత్నం చేస్త్తుంది .కుంటుతూ నడుస్తూ జనంపై దూకి పగ్గం తో కిందపడుతుంది .20గజాల ఆపగ్గం తో స్తంభం చుట్టూ తిరుగుతుంది .అది బాధతో అరచినప్పుడల్లా జనం చప్పట్లతో హుషారు చేస్తారు .దానికి ప్రాణ సంకటం వాళ్లకు వినోదం .నాలుగు వైపులనుంచి నలుగురు దాన్ని బల్లాలతో పొడుస్తారు. గింజుకొని వాళ్ళపై దూకే ప్రయత్నం చేస్తుంది .ఇకచాలు మహాప్రభోఅని దొరగారో ఆయన ప్రతినిదో అనే దాకా ఈ చిత్ర హింస ,అమానుష వినోదం సాగుతుంది .చిరుత పరాక్రమాన్ని వర్ణించే శ్లోకం –
‘’లాంగూలే నాభి హత్య క్షితితల మసకృత్ –దారయన్నగ్ర పద్బ్యాం –ఆత్మన్యేనావలేయ ద్రుత సుధ గమనం – ప్రోత్సతన్ విక్రమేణ-స్ఫూర్ణద్దుమ్కారఘోషః ప్రతిది శ మఖిలాన్ –ద్రావయన్నేష జంతూన్-కోపావిష్టః ప్రతివన మరుణోచ్ఛూన చక్షుః తరక్షుః’’
భావం –తోకను తరచుగా నేలకేసికొడుతూ ,పరిగెత్తే వేగం లో కాళ్ళను కడుపు లోకి నొక్కు కొంటూ,పరాక్రమావేశంతో ఎగురుతూ ,పెడబొబ్బల ధ్వనితో సకల దిక్కుల జంతువుల్నీ భయపెడుతూ ,కోపంతో ఉబికిన ఎర్రటి కళ్ళతోనిప్పులు కురిపిస్తూ చిరుత అరణ్య౦ లోకి ప్రవేశించింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-8-20-ఉయ్యూరు