ప్రపంచ సారస్వతం
195-టర్క్స్ అండ్ కైకాస్ ఐలాండ్స్ దేశ సాహిత్యం
అంట్లాంటిక్ సముద్రం లో ‘’40 లో లైయింగ్ కోరల్ రీఫ్’’ లున్న ఆర్చిపేలగో బ్రిటిష్ ఓవర్ సీస్ దేశమే టర్క్స్ అండ్ కైకాస్ ఐలాండ్స్ .స్కూబా డైవింగ్ కు ప్రత్యేకం .2,134మీటర్ల అండర్ వాటర్ వాల్ ఉన్న గ్రాండ్ టర్క్ ఐలాండ్ గొప్ప ఆకర్షణ .రాజధాని –కాక్ బరన్ టౌన్ .జనాభా -37,670.కరెన్సీ-అమెరికన్ డాలర్ .రోమన్ కేధలిక్ ఆంగ్లికన్ క్రైస్తవ దేశం .ఇంగ్లిష్ భాష .99శాతం అక్షరాస్యత .5-15 ఏళ్ళ వయసు వారికి ఉచిత ఐచ్చిక విద్య .ప్రైమరీ 6ఏళ్ళు.తూరిజమే ముఖ్య ఆదాయం .18శాతం ప్రజలు పేదలు..గ్రేస్ బే బీచ్ ,పార్రట్ కే ,సాల్ట్ కే.
టర్క్స్ అండ్ కైకాస్ ఐలాండ్స్ సాహిత్యం –ఈ దేశానికి చెందిన ఎనిమిది ముఖ్యపుస్తకాలు –వాటర్ అండ్ లైట్ ,ఎడైవర్స్ జర్నీ –స్టీఫెన్ హార్రిగన్,హాగస్టి రీఫ్-జాన్ డౌడ్,ఫుడ్ ప్లేన్ సూప్ –రాన్ లాక్ నికెల్ ,ఎ సమ్మర్ ఆన్ ది బార్డర్స్ఆఫ్ ది కరిబియన్ సి –డెన్నిస్ హార్రిస్ ,స్లేవ్ హిస్టరీ ఇన్ టర్క్స్ అండ్ కైకాస్ ఐలాండ్స్-నీగెల్ సాడ్లేర్,ఎ హిస్టరీ ఆఫ్ ది టర్క్స్ అండ్ కైకాస్ ఐలాండ్స్-కార్లటన్ మిల్స్ ,లివింగ్ ఇన్ ది టర్క్స్ అండ్ కైకాస్ ఐలాండ్స్-చార్లెస్ ఫార్మెర్.ఇంతకూ మించి వివరాలు దొరకలేదు .
196-సింట్ మార్టెన్ దేశ సాహిత్యం
నెదర్ లాండ్స్ లో కరిబియన్ ఐలాండ్ లో సింట్ మార్టెన్ దేశం ఉంది .డచ్ వాళ్ళు సింట్ మార్టెన్ అనిపిలిస్తే ఫ్రెంచ్ వాళ్ళు సెయింట్ మార్టిన్ అని పిలుస్తారు .లగూన్ బీచెస్ కు ,సాల్ట్ పాన్స్ కు ప్రసిద్ధి .రాజధాని ఫిలిప్స్ బర్గ్ ..కరెన్సీ-నెదర్లాండ్స్ ఆ౦టీలియన్ గిల్డర్.జనాభా -40,700.రోమన్ కేధలిక్ మతం .అధికారభాష సింట్ మార్టెన్ .99శాతం అక్షరాస్యత .4-18వయసువారందరికి కంపల్సరీ. విద్య హక్కు అనే భావం ఉన్న దేశం .టూరిజమే ముఖ్య ఆదాయవనరు .మాహో బీచ్ ,లోటెరీ ఫారం ,ముల్లెట్ బే బీచ్ దర్శనీయాలు –సురక్షితం .
సింట్ మార్టిన్ సాహిత్యం –లసానా ఏం సేకు –కవి కధకుడు వ్యాసరచయిత ,జర్నలిస్ట్ పబ్లిషర్ .ది సాల్ట్ రీపర్ ,సేలక్టే డ్ పోయెమ్స్ కవితా సంపుటి రాశాడు .షేక్ కీనే –జాజ్ గాయకుడు కవి .క్లార్క్ అకార్డ్ –దిక్వీన్ ఆఫ్ పరమాబియో ,బిట్వీన్ ఒపేరా అండ్ ఒరేరా ,బింగో రాశాడు .లౌ లిచ్ వెల్డ్-మినిస్టర్ రాయబారి .ఇస్మేనే క్రిష్ణదత్-రేకేన్ మీ ,కుక్ మీ వంటి బాలసాహిత్యం,నవలలు ఆన్దాలజీ కూడా రాసింది.ఇంతకంటే వివరాలు లేవు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-8-20-ఉయ్యూరు
—