ప్రపంచ దేశాల సారస్వతం
203-అమెరికాదేశ సాహిత్యం
18వ శతాబ్దం అమెరికన్ సాహిత్యం -1
18వ శతాబ్దం మొదట్లోకాటన్ మాదర్ వంటి కొందరు అత్యంత పురాతన సంప్రదాయం లో రచనలు చేశారు .జోనాధన్ ఎడ్వర్డ్స్ ప్యూరిటన్ చరిత్ర,తన జీవిత చరిత్రకలిపి1702లో రాసిన ‘’న్యు ఇంగ్లాండ్ మగ్నాలియా క్రిస్టిఅమెరికానా,1726లో రాసిన తన తీవ్రమైన ‘’మనుగక్టికో అండ్ మినిస్టీరియం’’పుస్తకాలలో ప్యూరిటన్ భావాల,విశ్వాసాల సమర్ధన ఉంది .గ్రేట్ అవేకెనింగ్ తో జోనాథన్ ఎడ్వర్డ్స్ తూర్పు సముద్ర తీరమంతా తన కాల్వనిస్టిక్ డాక్ట్రి న్ తో కల్లోలం చేశాడు చాలా ఏళ్ళు .మానవుడు దేవుని దయతోనే జన్మించి సుగుణాలతో మోక్షం పొందుతాడని విశ్వసించాడు .ఈభావాలు 1754లో రాసిన ‘’ఫ్రీడం ఆఫ్ విల్ ‘’లో వివరించాడు .తనభావాలను మెటాఫిజికల్ సిద్ధాంతాలతో అద్భుతమైన వచన రచనతో సమర్ధించుకొన్నాడు .
ఐతే మాదర్ ,ఎడ్వర్డ్ లు ఇద్దరు వైఫల్యకారణాలనే(డూమ్డ్ కాజ్ )‘’’’నే సమర్దిచారు .ఉదార న్యు ఇంగ్లాండ్ మినిస్టర్స్ జాన్ వైజ్ ,జొనాధన్ మే హ్యు లు మాత్రం సరళమైన మతం గురించి ఆలోచించారు .సామ్యుల్ సేవాల్ 1673-1729రాసిన ‘’డైరీ ‘’లో ఇంకొన్ని మార్పులు సూచించాడు .న్యు ఇంగ్లాండ్ అనే అమెరికాలో దినవారీ కార్యక్రమాలలో కఠిన ప్రోటే స్టంట్ విదానా లకు బదులు ప్రాపంచిక దృక్పధం తో లాభార్జన జీవితం ఎలా ప్రవేశించిందో కళ్ళకు కట్టినట్లు చూపించాడు .జర్నల్ ఆఫ్ Mmeసారా కేమ్బుల్ నైట్ 1704లో తన న్యూయార్క్ యాత్రనుచాల హాస్యవంత౦గా వర్ణించింది .సంప్రదాయం పై పూర్తీ నమ్మకమున్న ఆమె తానుచూసిన విషయాలను చాలా జోక్యులర్ గా వివరించింది .దక్షిణాన వర్జీనియాలో విలియం బైర్డ్ అనే అరిస్టాక్రటిక్ ప్లాంటేషన్ ఓనర్ తన పూర్వీకుల చీకటి జీవితాన్ని విభేదించాడు .1728లో చేసిన సర్వేయింగ్ ట్రిప్ విషయాలను ‘’ది హిస్టరీ ఆఫ్ ది డివైడింగ్ లైన్ ‘’1733లో తన ఫ్రాంటియర్ ప్రాపర్టీ స్ గురించి ‘’ఎ జర్నీ టు దిలాండ్ ఆఫ్ ఈడెన్ ‘’పుస్తకాలో ఆంగ్లికన్ విశ్వాసాలున్నవాడైనా చాలా సరదాగా ,రెస్టోరేషన్ విట్స్ తో రాశాడు
తప్పని సరి అయిన అమెరికా రివల్యూషన్ బ్రిటిష్ ,అమెరికన్ రాజకీయ దృక్పధాలలో పెరుగుతున్న మార్పులను విభేదాలను బయట పడేసింది .కాలనీ వారు విప్లవం తప్పదని యుద్ధానికి దిగారు .కొత్త జాతీయ ప్రభుత్వానికి మార్గం సుగం చేసుకొన్నారు .వీరికి మేదావులైన సామ్యుల్ ఆడమ్స్ జాన్ డికిన్సన్ వంటి రచయితల మద్దతు లభించింది .లాయలిస్ట్ జోసెఫ్ గాలోవే బ్రిటిష్ రాజరికానికి కొమ్ముకాశాడు .వీరికి అతీతంగా బెంజమిన్ ఫ్రా౦క్ లిన్ ,,ధామస్ పైన లు వ్యవహరించారు .
1706లో పుట్టిన బెంజమిన్ ఫ్రాన్క్లిన్ తన రచనలను సోదరుడి పత్రిక ‘’న్యు ఇంగ్లాండ్ కోర౦ట్ ‘’లో 1722నుంచే రాయటం మొదలుపెట్టాడు .’’లెదర్ ఆప్రన్ మాన్’’ గా పిలువబడే ఫ్రాన్క్లిన్ అందరికిఅర్ధమయే భాషలో ,ఆచరణాత్మక చర్చలతో రాసి మన్ననలు పొందాడు .అందరికి ఉపయోగపడే ‘’పూర్ రిచార్డ్స్ ఆల్మనాక్ ‘’ను 1732-57కాలం లో 22 ఏళ్ళు కస్టపడి కూర్చాడు .అందులో వివేకవంతమైన ,చమత్కారమైన ‘’సంక్షిప్త వాస్తవాలు –(అఫో రిజమ్స్ ) చదువుకోకపోయినా విశేషలోక జ్ఞానమున్న రిచార్డ్ సాండర్స్ తో రాయించాడు ప్రత్యేకంగా ..ఫ్రాన్క్లిన్ తన స్వీయ చరిత్రను 1771లో రాయటం ప్రారంభించి 1788లో 17ఏళ్ళురాసి పూర్తి చేశాడు .తనకున్నకోద్దిపాటి పరిస్థితులలోనే ఎదిగి ప్రపంచానికి మార్గదర్శకమైన విలువైన సలహాలెన్నో అందజేశాడు బెంజమిన్ ఫ్రాన్క్లిన్ .
స్వయంగా సంసృతిని అభి వృద్ధి చేసుకొన్న బెంజమిన్ అనేక వ్యాసాలతో అనేక విభిన్న విషయాలపై తన భావదీప్తి వెదజల్లుతూ రాసి ఉత్తేజితులను చేశాడు .బ్రిటన్ తో వచ్చిన విభేదాలపై కూలంకషంగా చర్చించి రచనలు చేసి కాలనీ వాసుల కోరికను గట్టిగాసమర్ధించాడు .స్వంత దేశం ఇంగ్లాండ్ నుంచి అమెరికాలోని ఫిల డెల్ఫియాకు వచ్చినవాడు ధామస్ పైన్.మొదట్లో 14నెలలు మాగజైన్ ఎడిటర్ గా ఉండి .తర్వాత కాలనీ వాసులకోర్కేకు గొప్ప మద్దతు దారు అయ్యాడు .1776జనవరిలో ఆయన రాసిన కరపత్రం ‘’కామన్ సెన్స్ ‘’కాలనీ వాసులకు వరప్రసాదమై స్వాతంత్ర్యంకోసం ఉద్యమి౦చటానికి బాగా తోడ్పడింది .1776డిసెంబర్ నుంచి 1783డిసెంబర్ వరకు ధారావాహికంగా ఏడేళ్ళు రాసి ముద్రించిన ‘’ది అమెరికన్ క్రైసిస్ ‘’విప్లవానికి గొప్ప ఊతంగా నిలిచాయి ప్రేరణ చెందించి ,స్పూర్తి స్వాతంత్రేచ్చను రగుల్కొల్పాయి .ఈ ప్రేరణతో ఈ చిన్నకాలనీ వాసులు ధర్మయుద్ధాన్ని మహా శక్తివతమైన అధర్మ సైన్యంతో పోరాడి విజయం సాధించారు .నల్ల తెల్లా జాతి ప్రాపగాండా బాగా క్లిక్ అయింది .కవిత్వ విధాన రచన ,బలమైఅన పదాల జోడింపు ,స్వాతంత్రేచ్చ రెచ్చగొట్టే విధానం ధామస్ పైన్ ప్రత్యేకత .ఆప్రభావం బాగా పని చేసింది రివల్యూషన్ కు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-8-20-ఉయ్యూరు