ప్రపంచ దేశాల సారస్వతం
203-అమెరికాదేశ సాహిత్యం -4
19వ శతాబ్ది సాహిత్యం -1
19వ శతాబ్ద ప్రారంభం లో అమెరికన్ రివల్యూషన్ ,ఆతర్వాత 1812యుద్ధం తర్వాత అమెరికన్ రచయితలు తమదైన దేశీ అంటే నేటివ్ సాహిత్యాన్ని రాసి పరిపుష్టికల్గించాలని నిశ్చయించారు .నలుగురు విశిష్ట వ్యక్తులైన రచయితలు విల్లియం కల్లేన్ బ్రియాంట్,వాషింగ్టన్ ఇర్వింగ్ ,జేమ్స్ ఫెనిమోర్ కూపర్ ,ఎడ్గార్ అల్లెన్ పో లు మొదటి అర్ధభాగాన్ని తమ రచనలతో ము౦చేత్తేశారు .
న్యు ఇంగ్లాండ్ అంటే అమెరికాలోనే పుట్టిన బ్రియాంట్ 23వ ఏట మొదటికవిత ‘’తనటాప్సిస్ ‘’ వంటి కవితలు ఇంకా 18వ శతాబ్దికవుల ఆంగ్లవాసనలతో నే 1817లో రాశాడు .తర్వాత వర్డ్స్ వర్త్ మొదలైన రొమాంటిక్ కవుల ప్రభావంతో న్యు ఇంగ్లాండ్ ప్రకృతిపై నేచురల్ కవిత్వం రాశాడు .దిఈవెనింగ్ పోస్ట్ అనే పత్రిక నడిపాడు కాని .ఈయన్ను వాషింగ్టన్ ఇర్వి౦గ్ వెనక్కి నెట్టేశాడు .
సంపన్న మర్చంట్ ఫామిలి కి చెందిన ఇర్వి౦గ్’’సాల్మన్ గుడి పేపర్స్ ‘’1807-08 లో రాసి మాన్ హాటన్ నగరజీవితం వర్ణించాడు .1809లో ది హిస్టరీ ఆఫ్ న్యూయార్క్ ను డీడ్రిచ్ నికేర్ బోకర్ డచ్ కుటుంబాల ఆడంబర పాండిత్య ప్రకర్ష ను పరిహాస భరితంగా రాశాడు .ఇతనికి ప్రేరణ నియోక్లాసికల్ ఇంగ్లిష్ సేటైరిస్ట్ లు .మంచి నగిషీతో చక్కని శైలీ భరితంగా రాశాడు ఇర్వింగ్ .తర్వాత ఇంగ్లీష్ నవలారచయిత సర్ వాల్టర్ ష్కాట్ తో పరిచయం కలిగి ,ఆలోచనాత్మక జర్మన్ సాహిత్యం పై అభిమాన మేర్పడి కొత్త రొమాంటిక్ నోట్’’ది స్కెచ్ బుక్ ‘’1819-20లలో ‘’బేస్ బ్రిడ్జ్ హాల్ మొదలైనవి –‘’-1822లో రాశాడు , బ్రిటిష్ విమర్శకులు తేరిపార జూసే గౌరవించిన మొదటి అమెరికన్ రచయిత ఇర్వింగ్ .
జేమ్స్ ఫెని మోర్ కూపర్ ఇంతకంటే గొప్ప కీర్తి సాధించాడు .స్కాట్ రాసిన ‘’వేవేల్రి ‘’నవలలులాగా ‘’లెదర్ స్టాకింగ్ టేల్స్’’1823-41మధ్య రాశాడు .ఇవి ఫ్రాంటియర్ మాన్ అయిన నాట్టీ బంపో’’పై అయిదుభాగల గొప్పరచన.చరిత్రను సృజనాత్మక భాగాలుగా మలచటం లో పాత్రల వ్యక్తీకరణలో గొప్ప నేర్పు చూఫై అమెరికన్ ఇంగ్లాండ్,యూరప్ సాహితీ వేత్తల ప్రశంసలు పొందాడు .
ఎడ్గార్ అల్లెన్ పో-దక్షిణానపెరిగి బాల్టిమోర్ ఫిలడెల్ఫియా రిచ్ మాండ్ న్యూయార్క్ లలో రచయితగా ఎడిటర్ గా ప్రసిద్ధి చెందాడు .అతని విశ్లేషణాత్మక శక్తి అందర్నీ ఆకర్షించింది .చదువరుల నాడిగ్రహించి తగిన రచనలు అందిస్తూ పత్రికల సర్క్యులేషన్ బాగా పెంచాడు .గోధిక్ కధలను తన భావ వైశద్యంతో తీర్చిదిద్ది లబ్ధప్రసిద్దుడయ్యాడు. మంచి విమర్శ తో రాసే ప్రతిదీ కళాత్మకం గా ఔన్నత్యం పొందేవి .అతడి మాస్టర్ పీసేస్ఆఫ్ టెర్రర్ –దిఫాల్ ఆఫ్ ది ఉషర్ 1839,ది మాస్క్ ఆఫ్ ది రెడ్ డెత్ 1842దికాస్క్ ఆఫ్ అమోన్ టిల్లడో,1846,మొదలైనవి అతిజాగ్రత్తగా సైకలాజికల్ గా రాసినవి .రాసిన డిటెక్టివ్ స్టోరీస్ లో ‘’దిమర్డర్స్ ఇన్ ది రు మోర్గ్ 1841 .’’అమెరికన్ డిటెక్టివ్ సాహిత్యానికి పిత’’ అలాన్ పో .1845లో రాసిన ‘’ది రావెన్ ‘’కవిత్వంతో కవిగాకూడా ఎత్తుకు ఎదిగిపోయాడు .విమర్శకాత్మక రచనలు ,నగిషీచెక్కిన కవిత్వం అమెరికాలో కంటే ఫ్రాన్స్ లో గొప్ప ప్రభావం చూపాయి .చార్లెస్ బాడర్లేర్ వీటినిఫ్రెంచ్ లోకి అనువాదం చేసిమరీదగ్గర చేశాడు .
జాన్ పెండ్లేటాన్ కేన్నేడి,విలియం గిల్ మోర్ సిమ్స్ లు తర్వాత చెప్పుకోదగినవారు .కేన్నేడి’’స్వాలో బారన్ ‘’1832ప్లాంటేషన్ జీవితాన్ని ఆహ్లాదంగా వర్ణించాడు .సిమ్స్ చారిత్రాత్మక నవలలు స్కాట్ లాగా రాశాడు .వీటిలో హరిహద్దు ప్రజల జీవిత చరిత్ర ,తన నార్త్ కరోలినా చరిత్ర ఉన్నాయి .1835లో రాసిన ‘’ది యమస్సీ ‘’ రివల్యూషనరి రొమాన్సెస్ లలో ప్రతిభా వికాసం కనిపిస్తుంది .
సశేషం