ప్రపంచ దేశాల సారస్వతం
203-అమెరికాదేశ సాహిత్యం -5
19వ శతాబ్ది సాహిత్యం -2
అమెరికన్ రినైసేన్స్
క్లాసిక్ న్యు ఇంగ్లాండ్ రచయితలలో హెర్మన్ మెల్ విల్లీ ,వాల్ట్ విట్మన్ మొదలైనవారు కొత్త ఆత్మ ,మనసు తో రాసి నవశకానికి దారి చూపించారు .అమెరికా మొదటి ప్రెసిడెంట్ ఆండ్రూ జాక్సన్ ప్రమాణ స్వీకారం నాడు చేసిన ప్రసంగానికి ప్రాజాస్వామ్య విలువలకు ఆకర్షింప బడి రాచనా వ్యాసంగం కొనసాగించారు .ఈ కాలం లో స్థానికత చాలా ప్రాచుర్యం వహించింది .అప్పటిదాకా రచనలలో,పాత్రలలో బ్రిటిష్ వాసన తప్ప స్వంత భాష స్వంత దేశానికి చెందిన పాత్రలు రాలేదు. ఈ లోపాన్ని వీరిద్దరూ గ్రహించి కొత్త మార్గం లో నడిచి మార్గదర్శులు ,వైతాళికులయ్యారు.
1830నుంచి 67వరకు హాస్యరచయిలలో రెండు గ్రూపులు ఏర్పడి రాశారు.కొందరు అత్యంత నిమ్న యాంకీ పాత్ర సృష్టి చేసి రాజకీయ సాంఘిక విషయాలపై వ్యాఖ్యలు కామిక్ గా రాశారు .వీరిలో సేబా స్మిత్ ,జేమ్స్ రస్సెల్ లోవెల్,బెంజమిన్ పి.షిల్లబెర్ ఉన్నారు .ఆనాటి అమెరికా భాష పాత్రలను బాగా అర్ధం చేసుకొని ,అంతకు ముందు ఎవరూ చేయని విధంగా రాసి కొత్త వొరవడి సృష్టించారు .పూర్వపు సౌత్ ఈస్ట్ లో ఉన్న రచయితలూ డేవీ క్రాకేట్ట్,ఆగస్టస్ బాల్డ్విన్ లాంగ్ స్ట్రీట్ జాన్సన్ జే.హూపర్ ,ధామస్బాన్గ్స్ ధోర్పే,జోసెఫ్ జి.గాల్ద్విన్ ,జార్జి వాషింగ్టన్ హార్రిస్ లు ఉరుకులు వేసే ఉత్సాహపరచే సరిహద్దుసామాన్య ప్రజల విషయాలను ,జాక్సోనియన్ డెమోక్రసీ లోని విషయాలను గొప్పగా చిత్రించారు .
న్యు ఇంగ్లాండ్ బ్రాహ్మణులు
అప్పటికే ఆగ్రూపులోని లోవెల్ మట్టి వాసన అంటే దేశీవాసనున్న హాస్యం సృష్టించాడు .న్యు ఇంగ్లాండ్ లోని హార్వర్డ్ ,కేంబ్రిడ్జ్,మాసాచూట్స్ లోని ‘’బ్రాహ్మిన్స్ ‘’గా పిలువబడిన రచయితలతో జీవి తాంతం స్నేహ ధర్మం పాటించాడు . ఇది రెండవ గ్రూప్ .ఇందులో హెన్రి వార్డ్స్ వర్త్ లాంగ్ ఫెలో ,ఆలివర్ వెండల్స్ హోమ్స్ ,లోవెల్ మొదలైనవారంతా అరిస్టోక్రాట్స్. వీరందరూ విదేశీ సంస్కృతీ ఒంటబట్టించుకొన్న హార్వర్డ్ ప్రొఫెసర్స్ .లాంగ్ ఫెలో యూరోపియన్ పద్ధతులైన కథా సంవిధానం వర్ణనాత్మక కవిత్వం ను అమెరికన్ చరిత్రతో అనుసంధానం చేసి అనుసరించాడు .కొన్ని సందేశాత్మక లిరిక్స్ టెక్నిక్ తో ,విషయ సౌభాగ్యంతో రాశాడు .హోమ్స్ -1858-91కాలం లో ‘’బ్రేక్ ఫాస్ట్ టేబుల్ సిరీస్ ‘’లో నగరీకరణ లను చిరుహాస్యం తెలివిగా మర్యాదాత్మక సాహిత్య౦గా రాశాడు .లోవెల్ మాత్రం అమెరికా లోనిఆరు బయటి విషయాలను తన దేశీ అమెరికన్ విషయాలను మనోహరంగా కవిత్వీకరించాడు .1865లో రాసిన ‘’హార్వర్డ్ కమెమో రేషన్ ఓడ్ ‘’నోబుల్ సెంటి మెంట్ కు మనోహర రూపం ఇలాంటి ఓడ్స్ చాలారాశాడు .
ట్రాన్ సేండెంట లిస్ట్ లు
మాసాచూసేట్స్ లో కేంబ్రిడ్జ్ కి దగ్గరలో ఉన్న కాన్కార్డ్ గ్రామం లో మరొక న్యు ఇంగ్లాండ్ రచయితల గ్రూప్ ఏర్పడింది .వీరికి ఆలోచనాత్మక విధానం ,కాల్వనిజం బదులు కొత్తగా వచ్చిన యుని టేరియనిజం ముఖ్య అంశాలు .కాంకర్డ్ ఫిలాసఫర్స్ లో రాల్ఫ్ వాల్డో ఎమెర్సన్ కొత్త యునిటేరియనిజం మినిస్టర్ అయి ,తన విశాల దృక్పధాలకు,విశ్వాసాలకు భూమిక ఏర్పాటు చేసుకొన్నాడు .ఆయనే పూర్వపు ప్లేటో లాగా ఇప్పుడు ఆధునిక ప్లేటో గా పేరుపొంది ట్రాన్స్ సెండ లిస్ట్ అయ్యాడు .లోతైన సత్యాన్వేషణకు అంతరాత్మ సాక్షి,దానికి అనుకూలమైన తర్కం ,ఏదైనా వెలువరించటానికి అనుభవం ఉండాలి అన్నది ఈయన సిద్ధాంతం .అతి సామాన్య విషయాలనుంచి అత్యున్నతఆలోచనాత్మక ,అనుభూతి లో నమ్మిన విషయాలవరకు ఆయన దృష్టి సారించి ప్రబోధించి వ్యాప్తి చెందించాడు .1841-44వరకు ఎమర్సన్ రాసిన ‘’ఎస్సేస్ ‘’చాలా విలువైనవి అందులో –రిప్రేజెటటివ్ మెన్ -1850,ఇంగ్లీష్ ట్రైట్స్-1856లు అద్భుత ఆలోచనాత్మక కవితారూప వివరణలు .అతని పాటలు కూడా ఆలచన ,భావ గర్భితాలైన ఆణిముత్యాలు .ఇవి 17వ శతాబ్ది మెటాఫిజికల్ కవితలు లాగా ఉంటాయి .ఎమర్సన్ భావాలను భారతీయ తత్వవేత్తలేందరో ఉటంకించి శిరోధార్యంగా భావించారు .అవన్నీ నిర్మలమైన అంతకరణ నుంచి వచ్చిన రుషి వాక్యాలు గా ఉంటాయి .
ఎమర్సన్ తోడు గా మట్టిమనిషిగా ఉన్న హెన్రి డేవిడ్ థోరోఒకప్పటి సర్వేయర్ లేబరర్ నేచురలిస్ట్ .ఎమర్సన్ కంటే అత్యంత ప్రాక్టికల్ మాన్ ,హ్యూమరిస్ట్ డ్రై యాంకీ .పరస్పర విరుద్ధమైన –para doxical ఫ్రేజులు వాక్యాలతో సరదా హాస్యం సృష్టించాడు .మహా ప్రజ్ఞాని .అతని రచనలు దేశ విదేశాలమేదావులు చదివి తెలకేత్తుకొన్నారు .గాంధీ కూడా ఆయన అభిమానే.అవి ఒరిఎంటల్ క్లాసిక్స్ స్థాయి పొందాయి .ఎ వీక్ ఆన్ దికంకర్డ్,మేర్రిమాక్ రివర్స్ ,-1849’’ది వాల్డన్ ‘’-1854 తానూ వాల్డన్ పాండ్ లో ఒక గుడిసెలో అతిసాధారణ జీవితం గడుపుతూ పొందిన అనుభవాల సారాంశమే వాల్డేన్ .ఆధునిక మానవుడు కోరికలు తగ్గించుకొని సుఖమైన ఆనంద జీవితం గడపాలని,అన్ని సంకుచితభావాలను విడనాడాలని ఆయన సందేశం.1849లో రాసిన ‘’సివిల్ దిజ్ ఒబీడిఎన్స్’’ గాంధీకి సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రేరణ కలిగించింది .ప్రభుత్వ దమన నీతికి అధికారదౌస్ట్యా నికి వ్యతిరేకం గా నిరసనగా హక్కులకోసం ఆయన చేసిన పోరాటం అది ‘’of such a nature that it requires injustice to another [you should] break the law [and] let your life be a counter friction to stop the machine.”
అనిఆదేశానికే కాదు ప్రపంచ దేశాలన్నిటికీ గొప్ప సందేశమిచ్చాడు థోరో తాత. ఎమర్సన్ ధోరోలతోపాటు బ్రాన్సన్ ఆల్కాట్ ,జార్జి రిప్లీ ,ఒరిస్టేస్ బ్రౌనిన్సన్ మార్గరెట్ ఫుల్లర్ ,జోన్స్ వెరికూడా ట్రాన్ సేండెంట లిస్ట్ లు గా గుర్తింపు పొందారు .ఫుల్లర్ ‘’ది డయల్’’ అనే ఆ భావ మాసపత్రిక ఎడిటర్ మాత్రమె కాక ఫెమినిస్ట్ ఉద్యమకారిణి కూడా .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-8-20-ఉయ్యూరు