ప్రపంచ దేశాల సారస్వతం
203-అమెరికాదేశ సాహిత్యం -7
19 వ శతాబ్ది సాహిత్యం -4
సివిల్ వార్ నుంచి 1914 వరకు
రివల్యూషన్ , ప్రెసిడెంట్ గా ఆండ్రూ జాక్సన్ ఎన్నికలలాగే సివిల్ వార్ కూడా అమెరికా చరిత్రలో ఒక గొప్ప మలుపు ,కొత్త జీవితవిధానానికి భూమిక అయింది పరిశ్రమలు ప్రాముఖ్యం పొందాయి .ఫాక్టరీలు సిటీలు పెరిగాయి .వ్యవసాయం వెనకబడింది .ఆర్ధిక ప్రణాళికలో ఇప్పటిదాకా ప్రాముఖ్యం పొందిన ఫ్రాంటియర్ క్రమంగా పశ్చిమానికి ప్రాకి 19వ శతాబ్ది చివరికి సమాప్తమైంది .సహజం గా నూతన . అమెరికా రూపు దాల్చింది .సాహిత్యంలోనూ ఆ మార్పులు ప్రతి ఫలించాయి .
సాహితీ హాస్య గాళ్ళు
పూర్వపు వాళ్ళ ధోరణి లో హాస్యం మొదట్లో రాసినా క్రమంగా తమ వ్యక్తిత్వాలను చూపిస్తూ కొత్తగా రాయటం మొదలుపెట్టారు .వీరిలో చార్లెస్ ఫరార్ బ్రౌనే,డేవిడ్ రాస్ లాకే ,చార్లెస్ హెన్రి స్మిత్ ,హెన్రి వీలర్ షా ,ఎడ్గార్ విల్సన్ నై..ఆర్టేమాస్వార్డ్ ,పెట్రోలియం వి నాస్బే బిల్ ఆర్ప్ జోష్ బిల్లింగ్స్ ,బిల్ నై ఉన్నారు .పాత్రల స్వభావం కంటే వ్యాకరణరహిత వాచ్యానికి ,సరైన ఉచ్చారణ లేకపోవటం మాండలికాలకు ప్రాధాన్యత హెచ్చింది .లాటిన్ పదాలు ,అల్ల్యూజన్స్ చొరబడ్డాయి .చాలా దారుణంగా రాసినా జనాలకు వినోద హాస్యాలు బాగా పంచారు .
కాల్పనిక స్థానిక రచన
కొత్త హాస్యం కోసం స్థానిక జనాన్ని వదిలేసిన వారి గురించి రాసే రచయితలూ వచ్చారు .వీరిలో మొదటి వాడు బెర్ట్ హార్టే చాలా బాగారాసి విజయం సాధించాడు .కొద్ది కాలం లోనే ఉద్యమమార్గ దర్శ రచయితలూ వచ్చారు .హారియట్ బీచార్ స్టవ్’’ఓల్డ్ టౌన్ ఫోక్స్’’-1869,సం లాసన్స్ఓల్డ్ టౌన్ ఫైర్ సైడ్ స్టోరీస్-1871,రచనలు ముచ్చటైన న్యు ఇంగ్లాండ్ దృశ్యాల పై రాశారు .హార్టే రాసిన ‘’లక్ ఆఫ్ రోరింగ్ కాంప్ ‘’అండ్ ఆదర్ స్కెచెస్-1870లు కాలిఫోర్నియా మైనిగ్ కాంప్ జీవితాల హాస్య సెంటి మెంట్ లను పండించాయి .ఎడ్వర్డ్ ఈగిల్టన్ రాసిన ‘’హూసియర్ స్కూల్ మాస్టర్ ‘’-1871నవల ఇండియానాలో మొదటి సెటిల్ మెంట్ పై రాసినదే .20వ శతాబ్దం దాకా వీరు అడపా దడపా ఎక్కువగా చిన్న కథలు , అతి తక్కువగా నవలలు రాశారు .ఈ కాలం లో దేశం లోని అన్ని ప్రాంతాల పై అక్కడి స్థానిక రచయితలూ కలర్ఫుల్ గా రాశారు ,వీటికి తోడూ జార్జి కేబుల్ ‘’లూసియాన క్రియోల్స్ ‘’,ధామస్ నెల్సన్ పేజ్’’ది బ్లాక్స్ ‘’ జోయెల్ చాన్డ్లేస్ హార్రిస్ ‘’జార్జియా బ్లాక్స్ ‘’,మేరీ నియోలిస్ మెర్ఫీ ‘’టేనస్సీ మౌన్టేనీర్స్’’,సారా ఓర్నె జ్యుఎట్ ‘’టైట్ లిప్డ్ ఫోక్ ఆఫ్ న్యు ఇంగ్లాండ్ ‘’,మేరీ ఇ విల్కిన్సన్ ఫ్రీమన్’’పీపుల్ ఆఫ్ న్యూయార్క్ సిటి ‘’హెన్రి కూయ్లర్ బాన్నర్ ‘’ఓ హెన్రి అనే విలియం సిడ్నీ పోర్టర్ లు చక్కని హాస్యం,సెంటిమెంట్ చిన్నకథలలో సృష్టించారు .వీరందరి ఉద్దేశ౦ ఒక్కటే –సమాజం లోని వివిధ వర్గాల ప్రజల యదార్ధ జీవితాన్ని మొత్తం సంయుక్త అమెరికా ప్రజలందరికీ తెలియకేయటమే .నిజంగానే వీరు ఆలక్ష్యాన్ని సాధించారు .సాధారతక్కువగానే ఉంటుంది కానీ మహా రచయితలూ తమమేధస్సుకు పదునుపెట్టి సెంటిమెంట్ కు హాస్యం జోడించి తక్కువ గ్లామర్ ఉన్న జనాలను పాత్రలను చేసి అద్భుత రచనలు చేసి సుభాష్ అనిపించారు అందులో హెన్రి వి నభూతోగా ఉండటం విశేషం . రొమాన్టిజం ,నాస్టాల్జి కి పట్టాభి షేకం చేసిన ఈరచనలు తర్వాత రియలిజానికి మార్గం చూపాయి .కొందరు రొమా౦టిజం కు దూరమై వాస్తవికత కే ప్రాణం పోశారు.
చార్లెస్ లాంగ్ హార్న్ క్లేమేన్స్ అసలు పేరైన ‘’మార్క్ ట్వేన్ స్థానిక హాస్య కమెడియన్స్.స్థానిక కలరిస్ట్ లతో సానిహిత్యం బాగా ఉన్నవాడు .ఒక ప్రి౦టర్ కు అప్రెంటిస్ గా ఉంటూ ,ప్రీ వార్ హ్యూమరిస్ట్ ల ను అధ్యయనం చేశాడు .ఆర్టేమస్ వార్డ్ , బ్రెట్ హార్టేలు అప్పటికే పబ్లిక్ లో ఆరాధ్యులు .వీరి మధ్య ఉంటూ బాగా ఎదిగాడు మార్క్ ట్వేన్ .అయన మొదటిపుస్తకం ‘’ఇన్నో సెన్ట్స్ అబ్రాడ్ -1869,రఫింగ్ ఇట్-1872,రాసి తర్వాత ట్రావేలోగ్ కూడా రాసి పోస్ట్ వార్ ప్రొఫెషనల్ హ్యూమరిస్ట్ లతోకలిశాడు .దిఅడ్వెంచర్స్ ఆఫ్ టాం సాయర్ -1876,లైఫ్ ఆన్ ది మిసిసిపి -1883,దిఅడ్వెంచర్స్ ఆఫ్ హకిల్ బెరీఫిన్-1884 అనే మహాగోప్పనవలలో మిసిసిపి లోయ జీవితాన్ని పరమాద్భుతంగా చూపించాడు .అమెరికన్ గోప్పరచయిటలలో మార్క్ ట్వేన్ ఒకడు .తనము౦దువారి కంటే ఆయన గొప్ప నైపుణ్యం చూపాడు .ఆయన చాలా ఫన్నీమాన్ .ప్రతి సూక్ష్మవిషయాన్నీ విశదంగా వర్ణించే నేర్పు ఉన్న రచయిత.పాత్ర సృష్టి ,చిత్రణలో జీనియస్ మార్క్ ట్వేన్ .
సశేషం
కృష్ణాష్టమి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-8-20-ఉయ్యూరు