ప్రపంచ దేశాల సారస్వతం
203-అమెరికాదేశ సాహిత్యం -8
19 వ శతాబ్ది సాహిత్యం -5(చివరి భాగం ))
సివిల్ వార్ నుంచి 1914 వరకు
హెన్రి జేమ్స్ –న్యుయార్క్ లో పుట్టిన హెన్రి జేమ్స్ తర్వాత ఇంగ్లాండ్ వెళ్లి కొత్తమార్గం లో రచనలు చేశాడు .రియలిస్ట్ ,నేచరలిస్ట్ లలాగే ఫిక్షన్ వాస్తవాన్ని చెప్పాలని భావించాడు .వాస్తవం రెండువిధాలుగా అనువాదం పొందుతుందని ,ఒకటి రచయిత విశేష అనుభవం ద్వారా ,రెండోది అతడి రచనా ప్రక్రియ ద్వారా .లోతైన అంతర్ దృష్టి,అనుభవం లకు ప్రాముఖ్యంలేదని ,రచయిత సంక్లిస్ట రచనా విధానమే మేలని చెప్పాడు .ఆయన 1884లో రాసిన ‘’ది ఆర్ట్ ఆఫ్ ఫిక్షన్ ‘’అనే నవలాకారులపై వ్యాస సంపుటి ,తనరచనలకు ము౦దురాసిన ఉపోద్ఘాతం ఆయన పడుతున్న ఆవేదన కు ,సమస్యలకు దర్పణం గా ఉంటాయి .కాల్పనిక సాహిత్యకళకుఇవి కరదీపికలుగా నిలిచాయి .మంచి చిన్నకథా సృష్టికర్త జేమ్స్ నవలాకర్తగా మారి అద్భుతమైన మార్గదర్శకాలైన ‘’దిఅమెరికన్ ‘’-1877,దిపోర్ట్రైట్ ఆఫ్ ఎ లేడీ ‘’1881,దిస్పాయిల్స్ ఆఫ్ పోయ్నంటన్-1897,’’వాట్ మైసీ న్యు’’-1897,’’ది వింగ్స్ ఆఫ్ ది డవ్ ‘’1902,’’ది అంబాసిడర్స్’’1903,’’ది గోల్డెన్ బౌల్’’1904 రాశాడు .వీటిలో మొదటివి ఇంటర్నేషనల్ నవలలు .యూరోపియన్స్ ,అమెరికన్ల మధ్య రేగిన వివాదాలు చూపిస్తూ ప్రతిగ్రూపు లోనూ వారి పాత్రలస్వభావాలను బాగా విశ్లేషణాత్మకం గా రాశాడు .కాలం గడిచినకొద్దీ తక్కువ అంతర్ దృష్టి ఉన్న భావోద్రేకాలు పుష్కలంగా ఉన్న సైకలాజికల్ పాత్రల సృష్టి చేశాడు .
పూతమెరుగుల కాలం(గిల్డేడ్ ఏజ్) పై విమర్శకులు
అనేక రకాల రచనలు సివిల్ వార్ నుంచి 1914వరకు వచ్చాయి .ఇవి సాంఘిక తిరుగుబాటు(సోషల్ రివోల్ట్ ) రచనలు .వ్యాపార వాణిజ్య ధోరణుల ,పెరుగుతున్న ప్రభుత్వ అవనీతి పై దాడితో రాసిన నవలలు .కొందరు ‘’ఉటోపియా’’ఆదర్శంగా అల్లారు .హెన్రి ఆడమ్స్ నవల ‘’డెమోక్రసీ ‘’1880,ఎడ్వర్డ్ బెల్లమి ‘’లుకింగ్ బాక్ వార్డ్ ‘’-1888లో నవలలో రాజకీయ అవినీతి అసమర్ధత ప్రత్యక్షం చేశాడు .కేపిటలిజంపై నేరారోపణ ,utopia పై ఆరాధనా కనిపిస్తాయి .హోవెల్స్ రాసిన ‘’ట్రావలర్ ఫ్రం అల్ట్రూరియా ‘’1894,లో సమానత్వ దేశం కావాలని ప్రభుత్వం ప్రజలహక్కులకు కళ్ళెం వేస్తోందని వివరించాడు .1906లో అప్టాన్ సిన్లేర్’’ది జంగిల్ ‘’నవలరాసి అమెరికన్ ప్రభుత్వ ఆర్ధిక ,రాజకీయ విధానాలను దుయ్యబడుతూ వీటికి విరుగుడు సోషలిజమే అని చెప్పాడు
కవులు పాటలతో విమర్శించారు .ఎడ్విన్ మార్ఖాం ‘’మాన్ విత్ ది హో’’1899లో దోపిడీకి గురౌతున్న లేబర్ గురించి( లేబర్ ఎక్స్ప్లాయిటేషన్)వర్ణించి పరిస్థితులు ఇలానే కొనసాగితే రివల్యూషన్ వచ్చే ప్రమాదముదని హెచ్చరించాడు .ఇది దేశవ్యాప్తంగాప్రజలలో ఉద్దీపన ,చైతన్యం కలిగించి ఆసక్తి రేపింది .ఒక ఏడాది తర్వాత విలియం వాన్ మూడీ ‘’ఓడ్ ఇన్ టైం ఆఫ్ హెజిటేషన్ ‘’రాసి, పెరుగుతున్న అమెరికాప్రభుత్వ ఇమ్పీరియలిజం –సామ్రాజ్యవాద మనస్తత్వాన్ని, అంతరిస్తున్న పూర్వ నైతిక సూత్రాలను ఎండగట్టాడు .1901లో రాసిన ‘’ఆన్ ఎ సోల్జర్ ఫాలెన్ ఇన్ దిఫిలిప్పీన్స్ ‘’లో పై సిద్ధాంతాలనే మరి౦త తీవ్రంగా బలీయంగా తెలియజేశాడు .
జర్నలిస్టిక్ మాగజైన్స్ విజ్రుమ్భిస్తున్న కాలం లోఅమెరికా విమర్శకులు దాన్ని ఆయుధంగా చక్కగా ఉపయోగించుకొన్నారు .’’ముక్రాకర్స్ ‘’ను ధియోడర్ రూజ్ వెల్ట్,ఇడాఎం టార్బెల్ లు ‘’దిహిస్టరీ ఆఫ్ స్టాండర్డ్ ఆయిల్ కంపెని-1904,లింకన్స్ స్టెఫెన్స్,దిషేం ఆఫ్ దిసిటీస్’1904 ఇద్దరు జర్నలిస్ట్ క్రుసేడర్లైన రచయితల అద్భుత విమర్శక చిత్రణలు .
హెన్రి ఆడమ్స్
పురాతన న్యు ఇంగ్లాండ్ కుటుంబానికి చెందిన ఇద్దరు ఆడమ్స్ ఆటోబయాగ్రఫీ లాంటి రచనలతో ఆధునిక జీవిత పతనాన్ని ఎత్తి చూపారు .హార్వర్డ్ లోనూ ఇతరదేశాల్లోనూ విద్యాభ్యాసం చేసిన హెన్రి ఆడమ్స్ గొప్ప టీచర్ చరిత్రకారుడు .’’హిస్టరీ ఆఫ్ యునై టెడ్ స్టేట్స్-1889-91,మాంట్ సైంట్ మైఖేల్ అండ్ చార్ట్రెస్-1904రాశాడు ‘’ది ఎడ్యుకేషన్ ఆఫ్ హెన్రి ఆడమ్స్ 1918లో ప్రపంచం లో శాంతి సుహృద్భావాలకై తన జీవితకాల పోరాటం చిత్రింది .మనిషిపై గొప్ప విశ్వాసాన్ని ,అతనికలవరపాటును చెప్పింది .వ్యంగ్యం అంతర్వాహినిగా రాసిన పెసిమిస్టిక్ పుస్తకం ఇది .
ఈ కాలం కవులు
19వశతాబ్దం 20వ శతాబ్ది మొదలు అమెరికన్ కవిత్వం పెద్దగా వర్దిల్లలేదు .పాటలకు పల్లకీ కట్టి ఊరేగి౦చారుకానికవులను కవిత్వాన్ని మర్చిపోయారు .దక్షిణ రాష్ట్రం లోపుట్టిన సిడ్నీ లేనియర్ ప్రతిభ కల సంగీతకారుడు .తన సంగీతం ప్రయోగించి1875లో ‘’కార్న్ ‘’,దిసింఫనీ,1878లో ‘’మార్షేస్ ఆఫ్ గ్లిన్ ‘’పాటలను ఇతరకవులలాగా అమెరిక జీవన విదానాలలో వచ్చిన మార్పులకు విసుగు చెంది రాశాడు .తన అద్భుతకవితలలో అనుమానాలు భయాలు సలహాలు పొందుపరచాడు .
న్యు ఇంగ్లాండ్ కే చెందిన ఎమిలి డికిన్సన్ ఆటకాయి తనపు సిగ్గరి. తానురాసిన అనంతసాహిత్యాన్ని బ్రతికిఉన్నకాల౦ లో ముద్రించుకోలేదు .ఆమె చనిపోయాక నాలుగేళ్ళకు 1890లో ఆమెకవితల మొదటిసంపుటి సోదరి ప్రచురించి తర్వాత వరుసగా వెలువరించింది .తరువాతికవులు ఈమె టెక్నిక్ ,ఆమె దృష్టి రైమ్స్ ,సాధారణ రిధంస్ ను విసర్జించటంనిగూఢమైన భావ పుష్టి చిన్న స్టాంజాలో కవిత్వం చెప్పటం ఆదర్షంగాచేసుకొన్నారు .ఆమె ప్రఖ్యాతమైన కొన్నికవితలు-దిస్నేక్ ,ఐ లైక్ టు సి ఇట్ లాప్ ది మైల్స్ ,దిఛారియట్’’ఫార్దర్ ఇన్ సమ్మర్ దాన్ ది బర్డ్స్ ,దేర్ఈజ్ ఎ సర్టెన్ స్లాంట్ ఆఫ్ లైట్ ‘’లలో ఆమె అసాధారణ ప్రతిభ దర్శనమిస్తుంది .ఇక 20వ శతాబ్దిలోకి ప్రవేశిద్దాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-8-20-ఉయ్యూరు