19 వ శతాబ్ది సాహిత్యం -5 సివిల్ వార్ నుంచి 1914 వరకు-2
సివిల్ వార్ నుంచి 1914 వరకు-2
ఒహాయో లో పుట్టి పెరిగిన విలియం డీన్ హోవెల్స్ కొత్త వాస్తవ రచనలో సిద్ధహస్తుడు .సాధారణ ప్రజల విషయాలను రియలిజం లో బాగా చెప్పొచ్చని భావించాడు .కామెడి బదులు ట్రాజేడి ని ఎంచుకొన్నాడు .సెక్స్ లాంటి విషయాలతో తక్కువ వాచ్యంగా శక్తివంతంగా చెప్పెవిధానం చేబట్టాడు .’’దెయిర్ వెడ్డింగ్ జర్నీ –‘’1872,ఎమోడరన్ ఇన్ స్టన్స్-1882,దిరైజ్ ఆఫ్ సిలాస్ లాఫం -1885నవలలు పై విధానం లో రాశాడు .టాల్ స్టాయ్ చెప్పిన ‘’సెట్ ఆర్ట్ ఫర్ ఎవర్ బిలో హ్యుమానిటి ‘’అనేది ప్రేరకంగా ‘’అన్నీ కిల్ బర్న్’’-1888,’’ఎ హజార్డ్ ఆఫ్ న్యు ఫార్ట్యూన్స్ ‘’ 1890లో రాశాడు .తనపత్రాలు సమాజ వ్యక్తుల,ప్రబుత్వాల ,ఆర్దికాలపై . వ్యాఖ్యానాలు గా చేశాడు .
నేచురలిస్ట్ రచయితలు
మిగిలిన అమెరికన్ రచయితలు 19వ శతాబ్ది చివరికి నేచురలిజ౦ కు దగ్గరయి అడ్వాన్స్ స్టేజ్ కి చేర్చారు . హామ్లిన్ గార్లాండ్ రచనలు ఫిలసాఫికల్ గా ,సాంఘిక బోధగా ఉన్నాయి .మైన్ ట్రావెల్డ్ రోడ్స్’’1891,రోజ్ ఆఫ్ డచర్స్ కూలీ ‘’1895లో ప్రత్యెక మెళకువలు చూపాడు .కొత్త ఫిక్షన్ ‘’క్రంబ్లింగ్ ఐడల్స్ ‘’1894కు ఇవి మానిఫెస్టో అయ్యాయి .కొద్దికాలానికి ఫ్రెంచ్ నేచురలిస్ట్ ఎమిలీ జోలా ప్రభావంతో కొందరు రాశారు .వీరిలో దియోడర్ డ్రైజర్ పాతవారికంటే డేరింగ్ సబ్జెక్ట్ లు తీసుకొని రాశాడు .పాత్రపోషణ ప్లాట్ లు బాగా చేశాడు .మనుషులపనులు ‘’కెమికల్ కంపల్సన్స్’’అని పాత్రలు తమపనులను నిర్దేశి౦చు కో లేకపోవటం చెప్పాడు .పాత్రలు బలీయమైన ,క్రూరమైన వ్యతిరేకుల చే ఓడిమ్పబడుతాయన్నట్లు చెప్పాడు .అతని ముఖ్యనవలలు ‘’సిస్టర్ కారీ ‘’1900,జెన్నీ గెర్హాడ్ట్ 1911,దిఫైనాన్షియర్-1912,దిటైటాన్1914,తర్వాత 1925లో రాసిన ‘’ది అమెరికన్ ట్రాజేడి పైభావలకు ప్రతిరూపాలే .శైలికి సున్నితత్వానికి విస్తృత సిమ్బాలిజానికి ప్రాముఖ్యమివ్వలేదు .కానీ స్టీఫెన్ క్రేన్ ,ఫ్రాంక్ నారిస్ లు మాత్రం వీటిపై దృష్టి ఎక్కువ పెట్టారు .క్రేన్ రాసిన షార్ట్ స్టోరీ లలో మగ్గీ –ఎగర్ల్ ఆఫ్ది స్ట్రీట్స్-1893,ది రెడ్ బాడ్జ్ ఆఫ్ కరేజ్ -1895లో మరికొన్ని కథలలో ఇంప్రెషనిస్ట్ గా కనిపిస్తాడు .మనిషి ని పరిస్థితులు ,పర్యావరణ౦ హతమారుస్తాయని చెప్పాడు .ఫ్రాంక్ మారిస్ రచయిత క్రేన్ పద బంధాలను ను అభినందించి ,తానుకూడా మంఛి నేరేటివ్ లుగా ‘’మిక్ టీగ్-1899,దిపిట్-1903రాశాడు .ఈ ఇద్దరు యవ్వనం లోనే తమ ఆలోచనలకు విస్తృత రూపం ఇవ్వకుండానే చనిపోవటం దురదృష్టం .ఐతే 20వ శతాబ్దం లో అవి బాగా పుష్పించి ఫలించాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-8-20-ఉయ్యూరు