ప్రపంచ దేశాల సారస్వతం
203-అమెరికాదేశ సాహిత్యం -9
20 వ శతాబ్ది సాహిత్యం -1
1914నుంచి 1945వరకు
మొదటి ప్రపంచ యుద్ధం కాలం లోనూ ఆ తర్వాత నాటకం ,కవిత్వం ,ఫిక్షన్, విమర్శ రంగాలలో ముఖ్య ఉద్యమాలు వచ్చాయి .యుద్ధం అన్నిటిపై గాఢంగాముద్ర వేసింది సాహిత్యరూపాలు అసాధారణంగా మార్పు చెందాయి .రాడికల్ భావాలు ,టెక్నిక్ లు చోటు చేసుకొన్నాయి .
నాటకం లో ప్రయోగాలు
19వ శతాబ్దిలో డ్రామా కు ముఖ్య పాత్ర లేకపోయినా ,వాణిజ్య స్థాయి నుంచి మరల్చే ప్రయత్నాలు జరగలేదు .20వ శతాబ్దం మొదట్లో యూరప్ లో యాత్ర చేసిన అమెరికన్ లకు విస్తృత వికాస నాటకరంగం కనిపించింది .వారు అమెరికాకు తిరిగివచ్చి ‘’లిటిల్ థియేటర్ ‘’ఉద్యమం దేశ వ్యాప్తంగా మొదలుపెట్టారు .రచయితలూ వర్తక వాణిజ్య పరిదులుదాటి నాటక రచన ,ప్రదర్శన ,నిర్మాణం ,నటన లలో ప్రయోగాలు చేయటం మొదలుపెట్టారు .అప్పటికే కాలేజీలలో ,కమ్యూనిటీ నాటక శాలలో శిక్షణ పొందినయువరక్తం సిద్ధంగా ఉన్నది .కాని కొన్ని థియేటర్ గ్రూపులు ఇంకా పాత విధానాన్నే అనుసరించాయి .ఉదాహరణకు ‘’ది వాషింగ్టన్ ప్లేయర్స్ ‘’ను 1915లో స్థాపించగా తర్వాత దియేటర్ గిల్డ్ గా మారి మొదటిప్రదర్శన 1919లో ఇచ్చింది .ఫలితంగా కొత్త నాటక రచయితలు సృజనాత్మకం గా సీరియస్ గా కొత్త ఆవిష్కారణ గా పరిణతి గా రాయటం ప్రారంభించారు .
యూజీన్ ఓ.నీల్ అత్యధిక ఆదరణ పొందిన నాటకరచయిత ఈ ఉద్యమానికి నాయకుడు .ప్రావిన్స్ టైం ప్లేయర్స్ తో అనుబంధ౦ ను కమ్మర్షియల్ ప్రొడక్షన్ ముందే ఏర్పరచుకొన్నాడు .అతడి నాటకాలు అంతటి ఉదాత్త స్థాయిలో ఉండేవి .’’బియాండ్ ది హోరైజన్ ‘’రాస్తే1920లో మొదటి ప్రదర్శన జరిగింది .అన్నా క్రిస్టీ-1921,డిజైర్ అండర్ దిఎల్మ్స్-1924,దిఐస్ మాన్ కమెత్-1946 నాటకాలు నాచురల్లిస్టిక్ గా రాసినవి .1920లో రాసిన ‘’ది ఎ౦పరర్ జోన్స్ ‘’1922లో రాసిన ‘’ది హైరీ ఏప్’’ లలో ఎక్స్ ప్రెషనలిస్టిక్ టెక్నిక్ ఉపయోగించాడు .ఈ టెక్నిక్ 1914-1924లో జర్మనీలో ప్రాచుర్యం పొందింది .సైకలాజికల్ మోనోలోగ్స్ గా ఉండే ‘’స్ట్రీం ఆఫ్ కాన్షస్ నెస్’’-చైతన్యస్రవంతి విధానాన్ని 1928లో రాసిన ‘’స్ట్రేన్జ్ ఇంటర్ లూడ్ ‘’నాటకం లో వాడాడు . మిత్ ,ఫామిలిడ్రామా ,సైకలాజికల్ అనాలిసిస్ లతో 1931లో ‘’మోర్నింగ్ బికమ్స్ ఎలెక్ట్రా’’రాశాడు .ఓ నీల్ ను మెచ్చుకొన్నంత గొప్పగా జనం ఏ నాటక రచయితనూ మెచ్చుకోలేదు .నాటకం లో మొదటి సాహిత్య నోబెల్ బహుమతి అందుకొన్న ఘనుడు ఓ నీల్ . చాలామంది సీరియస్ నెస్ ,వైవిధ్యం అభివృద్ధి చేసి నాటకాలు రాశారు.వీరిలో మాక్స్ వెల్ ఆండర్సన్ ,రాబర్ట్ ఇ షేర్ వుడ్ ,తోపాటు కామెడి -రీ యునియన్ ఇన్ వియన్నా1931,ట్రాజెడి –దేర్ షల్ బి నో నైట్-1940రాసిన -బ్రాడ్వే ప్రొఫెషనల్ కూడా ఉన్నాడు .మార్క్ కోనేల్లీ హృదయానికి హత్తుకొనే ఫాంటసి ని ఆఫ్రికన్ –అమెరికన్ జానపద భాషలో ది గ్రీన్ పాస్చర్స్ ‘’1930లో రాశాడు .ఓ నీల్ లాగానే ఎల్మెర్ రైస్ ఎక్స్ ప్రెష నిస్టిక్ టెక్నిక్ ను ‘’ది యాడింగ్ మెషీన్ ‘’-1923,నేచురలిజం విధానాన్ని స్ట్రీట్ సీన్ -1929లోప్రయోగించాడు .లిలియన్ హెల్మన్ మెలోడ్రామ బాగా పండిస్తూ’’ది చిల్డ్రన్స్ అవర్ –‘’1934,దిలిటిల్ ఫాక్సెస్-1939లో రాశాడు .మార్క్ బ్లిజిస్టీన్ క్రూరమైన సెటైరికల్ సంగీతపరమైన ‘’ది క్రేడిల్ విల్ రాక్’’1937,రాశాడు ఆర్సల్ వెల్స్ ,జాన్ హౌస్ మాన్ లు ప్రభుత్వ స్పాన్సర్ ప్రోగ్రాం లకు ,ఫెడరల్ దియేటర్ ప్రాజెక్ట్ లకు నాటకాలు రాశారు .ఈ శతాబ్ది రాడికల్ ప్రీమియం ధియేటర్ గా గ్రూప్ దియేటర్ -1931-41 గుర్తి౦పు పొందింది .దీన్ని హారొల్డ్ క్లర్ మాన్,లీ స్ట్రాస్ బెర్గ్ లు నిర్వహిస్తూ ‘’క్లిఫ్ఫోర్డ్ ఓడెట్స్ ‘’కు గొప్పపేరు పండింది .ఇన్ వైటింగ్ ఫర్ లెఫ్ట్ 1935,నాటకం లేబర్ ఐక్యత ను చాటింది .అవేక్ అండ్ సింగ్ -1935 ఆ దశాబ్దపు బెస్ట్ ప్లే న్డులో ఫామిలి కాన్ఫ్లిక్ట్ యువత ఆత్రుత మేళవించి రాశాడు అప్పటి ఓడెట్స్ లో ప్రసిద్ధమైనవి –పారడైజ్ lost-1935,గోల్డెన్ బాయ్ -1937,రాకెట్ టు దిమూన్ 1938,.
ధార౦టన్. వైల్డర్ –పోఎటిక్ డయలాగ్స్ ,స్టైలైజేడ్ సెట్టింగ్స్ తో ‘’అవర్ టౌన్ -1938,ఫా౦ టసి గా ‘’ది స్కిన్ ఆఫ్ అవర్ టీత్ -1942రాశాడు .విలియం సరోయాన్ ఫిక్షన్ నుంచి డ్రామాకు మారి ‘’మై హార్ట్స్ ఇన్ ది హైలాన్డ్స్ ,దిటైం ఆఫ్ అవర్ లైఫ్ 1939లో రాశాడు .ఎంతమంది నాటకాలు రాసినా యూజీన్ ఓ నీల్ ను ఢీకొట్టే మొనగాడు రాలేదు .ఓ నీల్ ఆధునిక అమెరికన్ నాటక పితామహుడు .వైల్డర్ కొంత ప్రాధాన్యం పొందాడు అంతే.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-8-20-ఉయ్యూరు