ప్రపంచ దేశాల సారస్వతం
203-అమెరికాదేశ సాహిత్యం -10
20వ శతాబ్ది సాహిత్యం -2
01914నుంచి 1945వరకు
కొత్త కవిత్వం
19వ శతాబ్దపు సుస్థిర పద్దతినుంచి కవిత్వం ప్రయోగాత్మక కవిత్వానికి నడిచింది .న్యు ఇంగ్లాండ్ కవులు ఇద్దరు ఎడ్వర్డ్ ఆర్లి౦గ్టన్ రాబిన్సన్ ,రాబర్ట్ ఫ్రాస్ట్ లు ప్రయోగాత్మక కవిత్వం జోలికిపోకుండా విమర్శకుల మన్ననలు పొందటమేకాక,మంచి ప్రాముఖ్యమూ పొందారు .రాబిన్సన్ రాసిన మొదటి కవితా సంపుటి 1896లో వెలువడింది .తనప్రతిభను సానేట్స్ ,,బాలడ్స్ ,స్టాంజాస్ ,బ్లాంక్ వెర్స్ లలో రాసి 1920లో పులిట్జర్ ప్రైజ్ ’’కలేక్టేడ్ పోయెమ్స్’’-1921 .కు పొందాడు .1925లో ‘’ది మాన్ హు డైడ్ ట్వైస్’’1925,ది ట్రిస్ట్రా౦-1927రాశాడు .ఇతనిలాగానే ఫ్రాస్ట్ కూడా సాంప్రదాయ స్టాంన్జాలతో ,ఫ్రీ వెర్స్ లో కవితా సంపుటులు ఎ బాయ్స్ విల్ -1913,నార్త్ ఆఫ్ బోస్టన్-1914,న్యు హాంప్ షైర్-1923,ఎఫర్దర్ రేంజ్-1936,ఎమాస్క్ ఆఫ్ రీజన్ -1945రాసి ప్రచురించాడు .ఆజనరేషలో బెస్ట్ పోయేట్ ఫ్రాస్ట్ .రాబిన్సన్ లాగా జీవితపు విషాద కోణాలను డిజైన్ ,డైరేక్టివ్,ప్రొవైడ్,ప్రొవైడ్ రాశాడు .భాషా శిల్పం ఫ్రాస్ట్ ప్రత్యేకత .సామాన్యభాషను సంప్రదాయ కవిత్వం సంక్షిప్తంగా గా మలచిన ప్రతిభ ఆయనది .
ఆధునిక నాటకం చిన్న దియేటర్ లో వర్ధిల్లి నట్లే,ఆధునిక కవిత్వం లిటిల్ మేగజైన్స్ ద్వారా వికసించింది.1912లో చికాగోలో హారియట్ మన్రో –పోయెట్రి,ఏ మేగజైన్ ఆఫ్ వెర్స్’’స్థాపించాడు .దీనితో పరిసర ప్రాంతం కవులైన వాఖేల్ లిండ్స్ సే ,కార్ల్ సాండ్ బర్గ్,ఎడ్గార్ లీ మాస్టర్స్ కు గొప్ప వరమైంది . లిండ్సే లిజేడరి ,స్థానిక వక్తృత్వం లను నిబంధన విరుద్ధ ఓడ్ లాంటి వాటిని రాసి ,పాడుతూ గొప్ప ప్రచారం చేశాడు .అతని రచనలలో జనరల్ విలియమ్స్ బూత్ ,ఎంటర్స్ ఇంటూ హెవెన్ అండ్ ఆదర్ పోయెమ్స్-1913,ది కాంగో అండ్ అదర్ పోయెమ్స్-1914 ముఖ్యమైనవి .సాండ్ బర్గ్- మిడ్ వెస్ట్రన్ సిటీస్ లోని ప్రయరీ లపై విట్ మన్ స్టైల్లో ఫ్రీ వెర్స్ లో –చికాగో పోయెమ్స్-1916,దిపీపుల్ ,ఎస్-1936,కవితాసంపుటులు రాసి ప్రచురి౦చాడు .మాస్టర్1915లో రాసిన స్పూన్ రివర్ ఆంధాలజి లో ఫ్రీ వెర్స్,మోనోలోగ్స్ లో గ్రామీణ స్త్రీపురుషుల గురించి ,వారి విసుగు చెందిన జీవితాల (ఫ్రస్ట్రేటేడ్ లైఫ్ )గురించి వర్ణించాడు .
ఎడ్నా సెయింట్ విన్సెంట్ మిల్లే,సారాటీ సల్డేల్ లు అసాధారణ కవయిత్రులు .ఆమీ లోవెల్ మాత్రం ఫ్రీ వెర్స్ పై ప్రయోగాలు చేసి ఇమేజ్ ,వర్ణనాత్మక కవిత్వం రాసింది .నల్లజాతి వజ్రాలైన ముగ్గురుకవులు – జేమ్స్ వెల్డన్ జాన్సన్ ,లాంగ్ స్టన్ హగ్స్ ,కౌంటీ కుల్లెన్ పాత మూసలో కొత్త విషయాలైన జాతి వివక్షతపై దృష్టి కేంద్రీకరించి రాశారు .హగ్స్ కవిత్వం లో సామాన్య వ్యావహారిక భాష వాడి తర్వాత వారికి మార్గ దర్శి అయ్యాడు.కాన్రాడ్ ఐకెన్ పోఎటిక్ ఇమిటేషన్ లతో సిమ్ఫానిక్ ఫార్మ్స్ తో చైతన్య స్రవంతిని కలిపి రాశాడు .ఇ.ఇ.కమింగ్స్ టైపో గ్రాఫికల్ నావెల్టీస్ తో వినూతనత్వాన్నీ ,ఆశ్చర్యాన్నీ కలిగించాడు .మేరియాన్నే మూర్ ఫ్రీ వెర్స్ ను ,షార్ప్ ఇడియో సిన్క్రిక్ గా విషయాలను ,వివరాలను వర్ణించాడు .రాబిన్సన్ జెఫెర్సన్ వయోలేంట్ ఇమేజెరి ,మార్పు చేసిన ఫ్రీ వెర్స్ లో కరుకైన పదజాలంతో రాశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-8-20-ఉయ్యూరు