అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -3
టిం మరియానాకు మరిన్ని వివరాలు చెప్పాడు ‘’మా అమ్మ నాకోసం బెంగపెట్టుకొంటు౦ది .ఇక్కడ చూడటం అయ్యాక నన్ను ఇంటికి పంపిస్తారా ?అని అడిగాను .’’ఇంకా నీకు వెళ్ళాలనే అనిపిస్తే పంపటానికి ప్రయత్నిస్తాం.ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్లాలని అనుకోరు .ఒక వేళ వాళ్ళు వెళ్లి ఇక్కడి విషయాలు చెప్పినా అక్కడి వాళ్ళు నమ్మరు .ఇది చాలా ప్రశాంత ప్రదేశం .ఇక్కడ డబ్బుకోసం పోట్లాటలు ఉండవు .మాకు కావాల్సినవన్నీ సమకూరుతాయి . భూమిపై వాళ్ళను ఓ కంట కనిపెడుతూనే ఉంటాం.వాళ్ళు సాధించిన అభి వృద్ధి వినాశనానికే తోడ్పడుతోంది .ఇక్కడ అంతా తేలిక .నీకు నచ్చుతుంది ‘’అన్నాడు.నా చేతులు తీసుకొని నాకళ్ళల్లోకి సూటిగా చూశాడు డేరియాల్ .దానితో నాకు వర్ణించలేని గొప్ప మనశ్శాంతి లభించింది.అయినా మానాన్న ,అమ్మ మా చెల్లెలు చిన్నారి అన్ గురించి బెంగ పోలేదు .కాని క్రమంగా ఈ భావం నశించి ఇక్కడే కొంతకాలం ఉండిఈ దేశ వింతవిషయాలు తెలుసుకోవాలని పించింది .ఒక దేవదూత మెత్తని రెక్కలస్పర్శ అనుభవి౦చి నట్లుగా ఉంది .కొద్ది దూరం లో మధురమైన లలిత సంగీతం వినిపిస్తోంది. అది జర్మనీకి చెందినా మొజార్ట్ లాంటి పాతతరం వాళ్ళ మోడరన్ మ్యూజిక్ లాగా లేదు .’’మాన్యుల్ నిన్ను కొద్దిరోజుల్లో మా సరిహద్దులదగ్గరకు విహారానికి తీసుకు వెడతాడు .మొదటగా ఉపరితలం పై నుంచి ఇక్కడికి చేరే ‘’టెలోస్ ‘’ చూపిస్తాడు.టిమోతీ నేను నీ స్నేహితుడిని నీకు వచ్చే అన్ని సందేహాలకు సమాధానాలు చెబుతాను .సమయం వచ్చినప్పుడు మళ్ళీ మనం కలుసుకొందాం ‘’‘’అన్నాడు డెరిక్.
2-భూగర్భ స్వర్గం
‘’దుఖం లేని దేశమా ?’’అన్నాను ఆశ్చర్యంగా మాన్యుల్ తో అతడు నన్ను ఒక గ్రామానికి తీసుకు వెడుతుండగా .అతడు చిన్నగా నవ్వాడు .’’అవును నిజమే .ఇక్కడ ఉండే వాళ్ళంతా నీ లాగా ,నా లాగా సాధారణ మనుషులే .ఇక్కడా దుఖం ఉంటుంది .దాన్ని వేరే విధంగా నివారిస్తారు .అక్కడ దుఖం మిమ్మల్ని డామినేట్ చేస్తుంది .ఇక్కడ మేము దాన్ని కంట్రోల్ చేసి నిరోధిస్తాం .సాయం కావాల్సి వచ్చినప్పుడు ఆపన్నహస్తాలు శారీరకం గా మానసికంగా ఆదు కొంటాయి .భూమిపైన మీరు ఒకరికొకరు సాయంచేసుకోరు .మీ యావ డబ్బు మీదే .అందరిదగ్గరా డబ్బు ఉండదుకదా.కానీ మిత్రమా టిం!ప్రతివాడికి హృదయం ఉంది .దానికి ఖర్చు పెట్టాల్సిదేమీ లేదు కదా .కాని నువ్వు దాని మాట వినాలి అంతే.నీమనసు నీకు మంచి సలహా ఇస్తుంది .నువ్వుకూడా అదేభాష మాట్లాడుతూ ఆ అనుభావం పొందుతూ ,అర్ధం చేసుకోవాలి .అదే నీకు సహాయకారి అవుతుంది ‘’అన్నాడు .
తర్వాత ఏమి జరిగిందో నాకు తెలీదు .అంతా వేగంగా జరిగిపోయింది .నా చెయ్యిపట్టుకొన్న మాన్యుల్ బడికి వెళ్ళే ఏడేళ్ళ కుర్రాడిలాగా మొదట కనిపించాడు .అక్కడ దృశ్యాలన్నీ చకచకా మారి పోతున్నాయి .కొద్దిసేపటికి నా కాళ్ళ కింద నీరు చూశాను .ఆనీలి నీటిపై తెల్లని బాతు ఈదుతోంది .తర్వాత బంగారు రంగు ఇసుక ఉన్న బీచ్ లు ,తర్వాత మరకతం అంటే పచ్చలు పరచినట్లున్న పచ్చగడ్డి ,చివరికి భూమి కనిపించింది .’’చుట్టూ బాగా చూడు ‘’ఆన్నాడు మాన్యుల్ .అతడు చేయి పత్తుకొని ఉండకపోతే నేను మూర్చపోయి ఉండేవాడిని .నా కంగారుకు కారణం ఉంది .అక్కడ అందమైన ప్రదేశాలే అన్నీ .స్పష్టంగా ,ఆహ్లాదంగా ,వైల్డ్ గా ఉన్నాయి .అక్కడ ప్రతి చిన్న పొద ,చెట్టు పువ్వు శబ్దం చేస్తోంది .కాకిగోలగా ఉంది .చిన్నచిన్నవి యేవో ఇటూ అటూ ప్రశాంతంగా పడవప్రయాణ౦ చేస్తున్నాయి.చుట్టూ తిరుగుతున్నాయి .చెట్లల్లోకి పొదల్లోకి దూరుతూ ఆశ్చర్యంగా తిరుగుతున్నాయి .’’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-9-20-ఉయ్యూరు