31జులై 1989న జన్మించిన లౌ జైన్ అల్ హత్ లౌల్ సౌదీ అరేబియా మహిళా హక్కుల యువ పోరాట యోధురాలు, ప్రసార మాధ్యమాలలో క్రియా శీలి ,రాజకీయ ఖైదీ .బ్రిటిష్ కొలంబియా యూని వర్సిటి నుంచి పట్టభద్ర్రురాలు .స్త్రీలు కారుడ్రైవ్ చేయటాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధిస్తే దాన్ని ఎత్తి వేయాలని ,పురుషులతో సమానం గా డ్రైవింగ్ హక్కు మహిళలకు కల్పించాలని అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి చాలాసార్లు అరెస్టయి జైలు కెళ్ళి వచ్చిన స్త్రీ హక్కుల యువ పోరాట యోధురాలు లౌ జైన్ .ఇటీవల అంటే రెండేళ్ళ క్రితం 2018 మే నెలలో .అనేకమంది స్త్రీ హక్కు ఉద్యమకారిణులతో రాజ్యాన్ని అస్థిర పరిచే ప్రయత్నాలు చేస్తున్నారనే నేరం మోపి ,చాలాజగ్రత్త గా పకడ్బందీ గా ప్రణాళిక సిద్ధం చేసి కిడ్నాప్ చేసి యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ లో అరెస్ట్ చేసి నిర్బంధించారు . జోర్డాన్ లో ఉన్నఆమె భర్త సౌది స్టాండ్ అప్ కమెడియన్ ‘’ఫహాద్ అల్ బుటైరీ’’ ని సౌదీ అరేబియా ప్రభుత్వం బలవంతంగా రప్పించి 2018న అరెస్ట్ చేసింది .సమాన హక్కులపోరాటానికి ఆప్రభుత్వం ఆ దంపతులకు ఇచ్చిన ప్రత్యేక బహుమతిఇదా ? .
2015లో ఆరబ్ మహిళలో అత్యంత శక్తి వంతమైన 100మంది మహిళల లో’’ లౌ జైన్ అల్ హత్ లౌల్ ‘’మూడవ రాంక్ పొందిన విశిస్ట మహిళ గా గుర్తింపు పొందింది .PEN అమెరికా 2019 మార్చి 14 న నౌఫ్ అబ్డులజీజ్ , లౌ జైన్ అల్ హత్ లౌల్ ‘’ ఇద్దరికీ PEN అమెరికా /బార్బెరి/ఫ్రీడం టు రైట్ అవార్డ్ అంద జేయ బోతున్నట్లు ప్రకటించి ,PEN అమెరికా లిటరరీ గాలా లో 2019మే 21 న అట్టహాసంగా జరిగిన వేడుకలో సగౌరవంగా అంద జేశారు .
సౌదీఅరేబియాలో స్త్ర్రీలు కారు నడిపే హక్కుఉద్యమాన్ని ,’’పురుషుల గార్డియన్ షిప్’’ విధానాన్నీవ్యతిరేకించే ఉద్యమాన్ని నిర్వహించే నాయకురాలు గా లౌజైన్ గొప్ప పేరుపొందింది .యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ సరిహద్దును దాటి కారులో సౌదీ అరేబియా వెళ్ళ బోయే ప్రయత్నం చేసి౦దనే అభియోగం తో ఆమెను 2014 డిసెంబర్ 1 న రాజ్యం లో ఉన్న స్త్రీ డ్రైవింగ్ నిషేధాన్ని ఉల్లంఘించి కారు డ్రైవ్ చేసిన నేరం మోపి , అరెస్ట్ చేసి 73రోజులు జైలులో నిర్బంధించారు .ఆమెకు యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ లైసెన్స్ ఉన్నా, సౌదీ పోలీసులు లక్ష్య పెట్టకుండా చూపించినా వినకుండా అరెస్ట్ చేశారు దారుణంగా నిర్లక్ష్యంగా .2015 డిసెంబర్ లో సౌదీ లో జరిగే స్థానిక ఎన్నికలలో వోటు వేయటానికి మొదటి మహిళగా హక్కు సంపాదించినా , ఆమెను ఓటు వేయనివ్వకుండా అవరోధం కల్పించారు
2016లో ఆమె, ఆమెతోపాటు 14వేలమంది సౌదీ ప్రభుత్వానికి ‘’మేల్ గార్డియన్ షిప్ ‘’ విధానం రద్దు చేయమని విజ్ఞాపన పత్రం రాసి సంతకాలు పెట్టి పంపారు . 2017జూన్ 4న ఆమెను డమ్మం లోని కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేసి ప్రయాణం రద్దు చేశారు .అధికారికంగా కారణం వెల్లడించకపోయినా ,’’అమ్నెష్టి ఇంటర్ నేషనల్ ‘’మాత్రం మానవ హక్కులపోరాటం చేస్తున్నందుకే ఆమెను అరెస్ట్ చేశారని ప్రకటించింది .ఆమెకు లాయర్ ను ఏర్పాటు చేసుకోవటానికి కానీ ,తనకుటుంబం తో మాట్లాడటానికి కానీ ప్రభుత్వం అవకాశం ఇవ్వక నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించింది .
లౌ జైన్ అల్ హత్ లౌల్ ‘’ను 2018 మార్చ్ లో ఎమిరేట్స్ నుంచి కిడ్నాప్ చేసి,సౌదీ కి పంపి కొన్ని రోజులు నిర్బంధం లో ఉంచి ,ప్రయాణం నిషేధించారు .మళ్ళీ మార్చి 15 సాయంత్రం ఆమెతోపాటు ఇమాన్ అల్ నఫ్జాల్ ,ఐయేషా మల్ అనా ,,అజీజా అల్ యూసఫ్, మదేలా అల్ అజౌష్ తోపాటు కొందరు మగవాళ్ళను సౌదీలో స్త్రీహక్కుల ప్రచారం చేసినందుకు అదుపులోకి తీసుకొని నిర్బంధించారు .దీనిపై’’హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ ‘’దీన్ని రాజు అధికార దుర్వినియోగం ‘’అని సంశయించింది .
వీరందరి సుదీర్ఘ పోరాట ఫలితం గా 2018జూన్ లో సౌదీ ప్రభుత్వం స్త్రీలు కార్లు నడిపే హక్కు కల్పించింది .కానీ లౌ జైన్ ను విడుదల చేయలేదు .అంతర్జాతీయ మానవ హక్కుల సమాఖ్య ,ALQST సంస్థ ఈమెనూ, ఈమెతో పాటు నిర్బంధించిన స్త్రీహక్కు పోరాట మహిళలను విపరీతంగా హింసించి, వేధించారని ప్రకటించాయి .కాళ్ళ మీద కొట్టటం ,ఎలెక్ట్రిక్ షాకులు ఇవ్వటం ,కొరడాలతోకొట్టటం మొదలైన ధర్డ్ డిగ్రీ టార్చర్ విధానాలను వారిపై టార్చర్ లొకేషన్ అయిన హోటల్ లేక ఆఫీసర్ల గెస్ట్ హౌస్ లో ప్రయోగించి తీవ్రంగా బాధించారు .బెల్జియం లోని బ్రసెల్స్ లో ఉన్న ఆమె సోదరి ‘’అలియా ‘’తన అక్కపై విపరీత ద్వేషంతో ప్రత్యేకంగా కరెంట్ షాకులు ,వాటర్ బోర్డింగ్ అంటే ముఖం దాకా నీళ్ళలో ముంచుతూ తేలుస్తూ ముఖం పై వేగంగా నీళ్ళు చిమ్మటం, కొట్టటం వంటి టార్చర్ ను 2018మే నుంచి ఆగస్ట్ దాకా కొనసాగించారని చెప్పి ఏడ్చింది .ఆమె తలిదండ్రులు ‘’మా అమ్మాయి తొడలు దెబ్బలకు ,పుళ్ళ కు కమిలి నల్లగా మారిపోయాయి ఆమె చేతులు విపరీతంగా వణుకు తున్నాయి చేతులు పట్టు ఇవ్వటం లేదు ,కూచోలేక, ను౦చోలేక అవస్థ పడుతోంది ‘’అని జైలులో ఆమెను చూసి దుఃఖిస్తూ చెప్పుకొన్నారు .సావుద్ అల్ క్వహ్తాని అనే వాడు వచ్చి ఆమెను చూసి వికృతంగా నవ్వుతూ ‘’నిన్ను రేప్ చేస్తా , నిన్ను చంపుతా ,నీ శరీరాన్ని మురుగు కాల్వలోకి విసిరేస్తా’’అంటూ రంజాన్ మాసం నెలరోజులూ రాత్రిళ్ళు వాడు ఆమెను బెదిరించి హింసించేవాడు అని ఆమె సోదరి ఆమెను జైల్లో చూడటానికి వెళ్ళినప్పుడు కళ్ళారా చూసి గోడుగోడున విలపించింది తన సోదరి దుస్థితికి .సౌదీలో ఉన్న న్యాయ సూత్రాలు , చట్టాల ప్రకారం మహిళలను ఈ విదంగా అమానుషంగా టార్చర్ పెట్ట కూదదనీ, అయినా అవేవీ లెక్క చేయకుండా తన సోదరి లౌ జైన్ అల్ హత్ లౌల్ ను అమానుషంగా టార్చర్ పెట్టారని ఆమె సోదరి అలియా అల్ హతౌల్ వాపోయింది .
2018డిసెంబర్ వరకు లౌ జైన్ ఆమె తోపాటు ఉద్యమకారిణులు డాభాన్ సెంట్రల్ జైలు లోనే టార్చర్ భరిస్తూ ఉన్నారు .కెనడాలోని ఒంటారియా లో ఉంటున్న ఆమె సోదరుడు వాలిద్ అల్ అతౌల్ చెప్పినదాని ప్రకారం ఆమె 2019 ఫిబ్రవరి దాకా ‘’అల్ హైర్స్ ప్రిజన్ ‘’లో ఉంది .2019మార్చి 1 న సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీస్ ఒక ప్రకటన విడుదల చేస్తూ వారిపై ప్రాధమిక విచారణ జరపటం పూర్తి అయిందని,ఆమెను ఇతర యాక్టివిస్ట్ లను దేశభద్రతను లక్ష్యం చేయనందుకు కోర్టు లో ప్రవేశపెట్టి విచారించటానికి సిద్ధమవుతున్నట్లు తెలియ బర్చారు .అన్నట్లుగానే 2019మార్చిలో ఆమెపై ఏయే అభియోగాలున్నాయో ప్రత్యేకం గా చెప్పకుండానే కోర్టులో విచారణ మొదలైంది .కోర్టుకు రిపోర్టర్లను ,దౌత్య వేత్తలను అనుమతించలేదు.2019ఏప్రిల్ లో ఏ కారణం చెప్పకుండానే విచారణ వాయిదా వేసింది కోర్టు . మేనెలలో ఆమె కేసు విచారణ ను కరోనా వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు కోర్టు మళ్ళీ ప్రకటించింది .ఆమె ఆరోగ్యానికి సౌదీ జైలులో పెద్ద ప్రమాదమేర్పడిందని లోకం భావించింది .
2020 ఆగస్ట్ 11 న లౌజైన్ అల్ హత్ లౌల్ సోదరి నోబెల్ ప్రైజ్ నామినేటెడ్ కామ్పైనర్ లీనా అల్ హతౌల్ తనసోదరి గురించి రెండు నెలలుగా ఏ విషయమూ తెలియటం లేదని ఆమెను ,తోటి ఉద్యమకారిణులను మళ్ళీ సౌదీ జైలులో విడవకుండా టార్చర్ చేస్తుండే అవకాశాలు ఉన్నట్లు భయపడింది . స్త్రీ హక్కు ఉద్యమ కారిణి’’ లౌజౌన్ అల్ హత్ లౌల్’’ కరోనా బారి పడకుండా పూర్తి ఆరోగ్యం తో జైలు నుంచి త్వరలో విడుదల కావాలని కోరుకొందాం .
ban~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Like this:
Like Loading...
Related
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D