అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -4
2-భూగర్భ స్వర్గం -2
దీనితోనో సంబంధం లేని వాళ్ళు ,జనం గుంపులుగా చేరారు వారిలో పిల్లలు ,పెద్దలు కూడా ఉన్నారు .సంగీతం పెరుగుతోంది అందరూ డాన్స్ చేస్తున్నారు .’’ఉదయం మొదలు వీళ్ళు డాన్స్ చేస్తూనే ఉన్నారా ?’’అని అడిగితె ‘’ఔను .పనిలో కూడా ఎవరికైనా డాన్స్ చేయాలానిపిస్తే ,గంతులేస్తూ పాడే అవకాశం ఇస్తాం .అనుమానమొచ్చి ‘’పని పాడుకాదా’’?అన్నాను .’’పనిలో ఉన్నదానికంటే ఎక్కువ పనే చేస్తారు ‘’అన్నాడు .ఇదో కొత్తలోకం .ప్రతిదేశానికి దాని పధ్ధతి దానికి ఉంటుంది .ఇద్దరం నిలబడి చూస్తున్నాం .కెనెడియన్ స్వీడిష్ ఫోక్ డాన్స్ చూశానుకనుక ఇది జానపద నృత్యం అని తెలిసింది .సంగీతకారులూ డాన్స్ చేస్తున్నారు వాయిస్తూకూడా .వాళ్ళ ఫిడేల్స్ ,ఇతర వాద్యాలను బట్టి కూడా అది ఫోక్ మ్యూజిక్ అనే అనిపించింది .మా అమ్మమ్మ ఉండే దలార్మా స్వీడెన్ లలో ఇలాంటి మ్యూజిక్ విన్నాను ఈమధ్య వెళ్ళలేదు కాని స్వీడిష్ మిడ్ సమ్మర్ మహా ఆహ్లాదంగా ఉంటుంది .అలాగే ఉంది ఇక్కడ కూడా .ఇక్కడ తాగుడు పోట్లాట లేదు .
మాన్యుల్ వైపు సాభిప్రాయంగా చూడగా అతడు నన్ను డాన్సర్ల మధ్యకు తీసుకు వెళ్ళాడు ,నా చేతిని ఒక అమ్మాయి మెత్తని చెయ్యి తాకింది ,ఇంకో యువతి నాచుట్టూ తిరిగింది .డాన్స్ ఎక్కువకాలం సాగలేదు .నా అండర్ గ్రౌండ్ గైడ్ నన్ను వెంటనే లాగేశాడు .’’మనం వెళ్ళాలి ‘’అని నా అసహనాన్ని గుర్తించి అన్నాడు .అక్కడి లాండ్ స్కేప్ దాటి ఒక గ్రామాన్ని చేరాం .కొద్ది ఇళ్ళు మాత్రమె ఉన్నా తీర్చి దిద్దినట్లు తేనే తుట్టె శైలి లో ఉన్నాయి .పైకప్పులు లేవు .వర్షం తుఫాను ,మంచు లాంటివి వస్తే ?అని అనుకున్నాను . మనసు గ్రహించి మాన్యుల్ ‘’లేదు .ఇక్కడ సంపూర్ణ వాతావరణమే ఎప్పుడూ ఉంటుంది .తొలి వేసవిలాగా ఏడాది అంతా ఉంటుంది ఇక్కడ .ఎప్పుడూ ప్రకాశామానంగానే ఉంటుంది .’’అన్నాడు .’’భూమ్మీద మాకు వర్షాలు తుఫాన్లు మంచు వస్తే ఇక్కడ మీకు ఎలా ఉటుంది ?’’అన్నాను .’’అది మాదాకా రాదు ‘’అన్నాడు నవ్వుతూ ..అక్కడ ఒక బెంచి కనిపిస్తే కూర్చోమని సైగ చేస్తే కూర్చున్నా .ఇక్కడి శీతోష్ణ స్థితిని అతడు ‘’ప్రతిదీ విశ్వాసం ప్రకారం నడుస్తుంది .మాకు ఇక్కడ అంతా సురక్షితమే .మాకు భయం అసూయ ఆదుర్దా చెడు ఆలోచనలు ఉండవు .ఇక్కడ శాశ్వత శక్తి మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంది .ఇక్కడ సర్వభద్రమైన సురక్షితమైన జీవితం గడుపుతున్నామనే గొప్పనమ్మకం లో ఉంటాం .ఆ శక్తి మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుందనే నమ్మకం మాది .ఋణాత్మక ఆలోచనలు వాతావరణాన్ని , స్ట్రాటో స్ఫియర్ ను కాలుష్యం చేస్తాయి .మన ఆలోచనలను బట్టే వాతావరణ మార్పులు వస్తాయి .భూమిపై నాశనం మీటిరోలాజికల్ ఫోర్స్ లవల్ల కూడా కలుగుతుంది .అక్కడ సామరస్య౦ ఉండదు .మతకలహాలు ,అసూయ అనుమానాలే ఎక్కువ .డబ్బు, డ్రగ్స్ ప్రభావమే ఇదంతా .కనుక నిర్మాణం కంటే వినాశనం ఎక్కువ .అక్కడ మంచి ఎప్పుడూ నష్ట పోతూనే ఉంది .’’అన్నాడు .’’అంటే మన ఆలోచనలను బట్టి వాతావరణం ఉంటుందా ?వాతావరణం అనేక బయటి శక్తులపై ఆధార పడి ఉంటుందికదా ‘’?అని నా జాతీయ వాతావరణ శాఖ జ్ఞానం తో ప్రశ్నించాను .
మాన్యుల్ ‘’ఇక్కడి భూమి ఒడిలో ఉన్నఅనుభూతి ఉంటుంది .కనుక సురక్షితం .అక్కడి విపరీత విపత్కర పరిస్థితులు ఇక్కడికి చొచ్చుకు రాలేవు .భూమాతను మేము అనుక్షణం తలుస్తాము .దానికి ప్రత్యామ్నాయంగా ఆమె మాకు రక్షణ ,ప్రేమ ఇస్తుంది . నీకు ఎప్పుడైనా విచారంకలిగినా,డిప్రేషన్ వచ్చినా ఈ అగర్తా లోకం లోని ఆలోచనలు నీకు బలాన్ని శక్తినీ ప్రసాదిస్తాయి .’’మీ గురించి మాకసలు తెలీదుగా .మీరున్నారని తెలిస్తేగా మీ సహాయం కోరేదీ?అన్నాను కొంచెం అసహనం తో .’’సరే ఇప్పుడు భూమి మీద మనుషులను చూసే సమయం వచ్చింది .తిరస్కరణ ,అవిధేయతా బీజ వ్యాప్తికి మేము ప్రోత్సహించం .కనుకనే మేము ఎవరికీ కనపడకుండా ఉంటాము .అసలు మీరు ఏ దేవుడిని ఆరాధిస్తారు ?ఆయనకు రంగరంగ వైభవంగా భోగాలు సమకూర్చి ఉత్సవాలు చేస్తారు మీరు .ఆయన్ను ప్రార్ధిస్తారు ఆయన తరఫున యుద్ధాలు చేస్తారు వాదిస్తారు .మీ తప్పులన్నీ ఆయనపాదాలమీద పడేస్తారు .ఇదేలాంటి మతంబాబూ .అది చాలా హేతుబద్ధం అంటారు మీరు .మేము ఇక్కడ అలా చేయం .అందుకే భూప్రజలను ఇక్కడికి అనుమతి౦చటం మాకు కష్టమౌతుంది .మేము ఎంపిక చేసి తీసుకురావటమో లేక నీలాగా వచ్చిన వారికో ప్రవేశం ఉంటుంది ఇక్కడ ‘’అన్నాడు .’’నాకు ఇంటికి వెళ్లి ఈ విషయాలన్నీ చెప్పాలని ఉంది ‘’అన్నాను .తల ఊపాడు .ఇద్దారంలేచాం .’’భూమ్మీదలాగానే ఇక్కడా పిల్లలు హాయిగా ఆడుకొంటున్నారు ఇక్కడ ఎక్కువమందిని కలవ లేదు .ఇక్కడ ఇసుక గోతులు ,స్వింగ్స్ ఉన్నాయి పెద్దలు పర్యవేక్షిస్తూ ఉంటారు .పిల్లలు ఉత్సాహంగా ఈతకొట్టే అందమైన ఆకర్షణీయమైన జలాశయాలున్నాయి .నడిలోకిజారటానికి తేలికగా ఉండే వాలు మెట్లున్నాయి .పిల్లలు’’ ఫెయిరీ టేల్ ‘’ లోలాగా అద్భుత ప్రపంచం లో జీవిస్తున్నారిక్కడ .వాళ్ళు ఇక్కడికి ఎలావచ్చారో అడగాలను కొన్నా .నా మనోభావం పసిగట్టి పెద్దగా నవ్వి మాన్యుల్ ‘’జాగ్రత్తగా విను కుర్రాడా !సెక్స్ పాఠాలు కావాలా ?మీ లోకం లో ఉన్నట్లే అవీ ఉంటాయి .దాన్ని మేము ప్రేమ అంటాం .ఇక్కడ సెక్స్ ను అనైతికంగా చూస్తాం .అది ఇక్కడ అరుదుగా నే ఉంటుంది . ఇక్కడ ధనాత్మకం కనుక గౌరవిస్తాం .ఇక్కాడ పెళ్ళిళ్ళు ఉండవు .శారీరకమానసిక కలయిక మాత్రమె ఉంటుంది .అది కారణాత్మకమే ‘’అన్నాడు .’’తప్పులు అశ్లీలం ,విచాక్షణారాహిత్యం ,విడాకులు ఉంటాయా “’?అన్నాను .పగల బడి నవ్వి ‘’మళ్ళీ తప్పులో కాలేశావ్ కుర్రాడా .మా నిఘంటువులో అసలు ఆమాటలే లేవు .మీ భూమిమీదమీరు శారీరక జీవులుగా నే ప్రవర్తిస్తారు .ఇక్కడ మేము అంతకంటే ఉన్నతస్థాయి అయిన మనసు ,ఆత్మలతో జీవిస్తాం .మీది బాడీ పార్టనర్ షిప్ .మాది సోల్ పార్టరన్ షిప్ .మాది ఉన్నతమైన చేతన.మీలాగా మేమూ తమాషాలు చేస్తాం .కానీ జీవితాంతం కలిసే ఉంటాం అదీ తేడా మిత్రమా .’’అన్నాడు ‘’వంద లాది ఏళ్ళు అలాగే ఉంటారా ?విసుగు అనిపించదా బోర్ కొట్టదామహానుభావా .సెక్స్ లో వివిధ భంగిమలు ప్రయత్నిస్తారా’’ ??చిలిపిగా ప్రశ్నించా .’’ఎందుకో నాకు అర్ధం కాలేదు .ఇక్కడి మా ప్రేమ అలానే శాశ్వతం .టెలోస్ లో మౌంట్ షాస్తా క్రింద సింపోజియం జరుగుతుంది అక్కడికి వెళ్దాం రా .అక్కడ భూ వాసుల విషయమై చర్చలు జరుగుతాయి. అందుకే అక్కడికి నిన్ను తీసుకు వెడుతున్నా ‘’అన్నాడు .నాక్కూడా ఉత్సాహ౦ గా ఉంది అక్కడి నుంచి భూమిమీదకు వెళ్ళవచ్చు ననే ఆశ కలిగింది .మౌంట్ షాస్తా అనేది కాలిఫోర్నియాలో ఉంది .అక్కడినుంచి సియాటిల్ కు ఫ్లైట్ లో వెళ్ళచ్చు.కానీ నాదగ్గర సొమ్ములు నిల్. నా మనసు గ్రహించి మాన్యుల్ ‘’భయం వద్దు బ్రదర్ .నీకు ఇంటికి వెళ్ళాలనిపిస్తే మేమే పంపిస్తాం .డబ్బు ఏర్పాటు కూడా మేమే చేస్తాం ‘’అన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-9-20-ఉయ్యూరు