మనకు తెలియని మహాయోగులు—8
15-చీరాల అవధూత -1912-1972
కడప జిల్లాలో వైశ్య కుటుంబంలో పుట్టిన చీరాల అవధూత ,1943లో చీరాల ఆస్పత్రి దగ్గర గు౦పెన చెట్ల నీడలో కాషాయబట్ట లతో గురువు వెంట మొదట కనిపించాడు 1912లో పుట్టినట్లు నిర్ధారించారు .. అగరు వత్తులు వెలిగించి ఇసుకలో పెట్టి బియ్యం చల్లేవాడు .ఎడమకాలు బోదకాలు అవటం తో బోదకాలు స్వామిగా ప్రసిద్ధుడు .ఆహారం లేకపోయినా బలంగానే ఉండేవాడు .1959లో చిలకలూరి పేటకు వెళ్లి 1963 వరకు ఉన్నాడు. పగలే కనిపించేవాడు రాత్రిళ్ళు కనిపించే వాడు కాదు .ఒకేసారి నెల్లూరు హైదరాబాద్ గుంటూరు,శ్రీశైలం లలో కనిపించేవాడు.రోగులరోగాలు నయం చేస్తూ శక్తులు ప్రదర్శించేవాడు .దేహం నిలవటానికి కొద్దిగా తినేవాడు .నిరీహి .అఖందయోగం చూపేవాడు అంటే కాళ్ళు చేతులు మొండెం వేర్వేరు గా ఉండేట్లు చేసి మళ్ళీ కలిపేవాడు .3-9-1972 60 వ ఏట పరీధావి సంవత్సర శ్రావణ బహుళ ఏకాదశి ఆదివారం తెల్ల వారు ఝామున అవధూత హంస పరమహంసలో లీనమైంది .
16-పరమహంస -ధాభా కొండ యార్య -1834-1939
మహారాష్ట్ర చా౦దా జిల్లా ధాభా గ్రామంలో అంబేద మల్లయ్య ,సుగంధమ్మ అనే జంగం దంపతులకు 10-2-1934 విజయ సంవత్సర మాఘ శుద్ధ తదియ సోమవారం కొండయ్య పుట్టాడు .పుట్టగానే ‘’నమో బసవ లింగాయనమః ‘’అని ఉచ్చరించి అందర్నీ ఆశ్చర్య పరచాడు .జ్యితిష్యులు ఆబాలుడు నూరేళ్ళకు పైగా బతికి .జీన జనోద్దరణ చేస్తాడని చెప్పారు .పుట్టిన 12వ రోజు నుంచే మహిమలు ప్రదర్శించాడు .ఏడాదికే విద్యలన్నీ గడించాడు
పెళ్లి అయినా ఇల్లు వాకిలీ వదిలేసి కొండా కోనలు తిరుగుతూ ,శ్రీశైలం అడవులకు చేరి క్రూర జంతువులను మచ్చిక చేసుకొని వేటగాళ్ళ నుండి వాటిని రక్షిస్తూ ,నిత్యం పాతాళగంగాస్నానం మల్లికార్జున భ్రమరాంబా దర్శనం తో పులకి౦చేవాడు .ఒక రొజుఆలయ సింహద్వారం వద్ద సహస్ర సూర్య కాంతులతో’’ సర్వేశ్వర తేజం ‘’దర్శనమిచ్చింది .సర్వసంగ పరిత్యాగి కొండయ్యకు సద్గురు కటాక్షం లభించి౦ది అష్టాంగ యోగం ,రాజయోగం సిద్ధిస్తాయని ఆశరీరవాణి తెలిపింది .అన్నట్లుగానే చెల్పూరులో పరమారాధ్యుల రాజయ్య ఆశీర్వాద లభించి ఇద్దరూకలిసి శ్రీశైల గుహలలో తీవ్ర తపస్సు చేశారు .కొండయ్యకు మంత్రోపదేశం చేసి సకల శక్తులు ధారపోసి’’ పరమహంస ‘’బిరుదునిచ్చి లోక కాల్యాణ౦ కోసం దేశాటన చేయమని గురువు ఆశీర్వదించి పంపాడు
12ఏళ్ళు తపస్సు చేసి ఈశ్వరతత్వాన్ని సాధించి అక్కడి నుండి నంది మేడారం చేరి మహిమలు చూపి ,దేశ సంచారం చేస్తూ అద్భుతాలు ప్రదర్శిస్తూ బాధితుల రోగ నివృత్తి చేస్తూ జ్ఞానబోధ చేస్తూ 14-11-1939కార్తీక శుద్ధ చవితి మంగళవారం 105 వయేట ముందుగానే కట్టించుకొన్న సమాధిలో జీవ సమాధి అయ్యాడు పరమహంస కొండయార్యులు. మాధినుండి సూక్ష్మరూపంలో భక్తులకు కొంగుబంగారంగా వెలుగుతున్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-9-20-ఉయ్యూరు .