మనకు తెలియని మహాయోగులు—9

మనకు తెలియని మహాయోగులు—9

17-సూక్ష్మ మూర్తెమ్మ యోగిని -1807-1928

పాతికేళ్ళ కే  భవబందాలన్నీ తెంచుకొని నూరేళ్ళు తపస్సులో తరించిన మూర్తెమ్మ 1807కడపజిల్లా జమ్మలమడుగు తాలూకా కుందూ నదీతీరంలో పెద్దముడియం గ్రామంలో యనమదల గురవాచారి ,అచ్చమ్మ అనే విశ్వబ్రాహ్మణ దంపతులకు పుట్టింది .బాల్యం లోనేతల్లిని కోల్పోయి ఒంటరిగా నదీ తీరంలో గుంటలు తవ్వుతుంటే శివలింగం దొరికితే ఇంటికి తెచ్చి నిత్యపూజా చేసేది .పెళ్ళైనా తీరు మారలేదు .మహిమలు చూపేది. ‘ .యోగిని అన్నారు.

  ఇరవై ఏళ్ళ వయసులో ఆమెను మేనత్త దంపతులు 1827లో గంగాయపల్లె కు తీసుకు వెళ్ళారు .అక్కడ అంతర్ముఖత్వం ఏర్పడింది .పిచ్చయ్య అనే గురువు మంత్రోపదేశం చేసి ,ఆమెతో ఉన్న  శివలింగాన్నే పూజించమని చెప్పాడు .ఆమె సూక్ష్మ దృష్టి  మంత్రాను స్టానం నుంచి యోగం వైపు మళ్ళింది .అప్పటినుంచిగంగాయపల్లె  ‘’సూక్ష్మ మూర్తెమ్మ ‘’గా ప్రసిద్ధి చెందింది ,కమలాపురం మండలం అప్పాయ పల్లెకు చెందిన సుబ్బయ్య గురువు వద్ద బ్రహ్మోపదేశం పొంది ,యోగసాధన తీవ్రం చేసింది .సంయమయోగం సాధించి కీర్తనలు క౦దా ర్ధాలు ,సహస్రార ప్రదర్శన ,యక్షగానాలు,ద్విపదలు  రాసింది .ఒక శిష్యుడు బెంగుళూరు దగ్గర యలహంక లో  ఒక ఆశ్రమ౦ ఏర్పాటు చేస్తే, ఉంటూ యోగశాక్తులు ,చమత్కారాలు ప్రదర్శించింది .జానపదులు దేవతలా కొలిచారు .కడప –మద్రాస్ రైలు మార్గం లో ఉన్న ఇక్కడ అన్ని రైళ్ళు ఆగే ఏర్పాటు చేశారు .31-10-1928విభవ సంవత్సర ఆశ్వయుజ బహుళ తదియ బుధవారం మధ్యాహ్నం 12గంటలకు121 ఏట  కుండలినీ యోగం తో కపాలం చేదించుకొని సూక్ష్మ మార్తెమ్మ యోగిని  సూక్ష్మ  పరబ్రహ్మం లో ఐక్యమైంది .ఆమె పేర ఆరు ఆశ్రమాలలో సాధకులున్నారు .ఆశ్వయుజ శుద్ధ తదియ ,చవితి నాడు ఆరాధనోత్సవాలు ఘనంగా జరుపుతారు

18-ఆంజనేయ పరమహంస -1892-1941

కృష్ణాజిల్లా గుడివాడలో భైరవభట్ల సీతమ్మ ,జోగీశ్వర శర్మ రామభక్త బ్రాహ్మణ దంపతులకు ఆంజనేయ శర్మ 13-11-1892 న నందన వత్సర కార్తీక బహుళ ఆదివారం పుట్టాడు .రామనామం పాడితేనే నిద్రపోయేవాడు.ఆ నామం వినిపిస్తే ఏడుపు ఆపేవాడు .అయిదవ ఏట అక్షరాభ్యాసం, 8వ ఏట ఉపనయనం చేశారు .సీతారామా౦జ నేయ గ్రంథాన్ని  ఒంటపట్టించుకొని  పరమాత్మ తత్వ రహస్యం అవగాహన చేసుకొన్నాడు .13వ ఏట తండ్రి చనిపోయాడు. 16వ ఏట లక్ష్మీకాంతమ్మ తో పెళ్లి జరిగింది .

  నూజివీడులో ఉద్యోగం లో చేరాడు .మనసు మాత్రం  రామ నామాంకితం గానే   ఉండేది. ఒక రోజు భద్రాచల ఓంకార ఆశ్రమ మండలికి చెందిన సచ్చిదానంద జోగీశ్వరావదూత వచ్చి మంత్రోప దేశం చేశారు .దీనితో రెండేళ్లలో బ్రహ్మవిద్యారహస్యాలు తెలిశాయి .కష్టాలలో ఉన్నవారికి రామకథలు చెప్పి బాధా నివారణ చేసేవాడు .బ్రహ్మ భావన లేకపోతె వేదోపనిషత్తుల జ్ఞానానికి పూర్ణత్వం సిద్ధించదు అని ప్రవచి౦చేవాడు .25వ ఏట నే వాన ప్రస్థాశ్రమం  తీసుకొని,గుడివాడ తాలూకా పామర్రు దగ్గరున్న కొండిపర్రులో  ఒక మామిడి తోటలో శ్రీ ఆంజనేయ విగ్రహం ప్రతిష్టించి ,పూజిస్తూ సద్బోధ చేసేవాడు .భార్య కూడా బాగా సహకరించేది .ఏకాగ్ర చిత్తమే సమాధి అనీ ,సమాధిలో ధ్యేయ వస్తువు తప్ప ఏదీ కనిపించదని అనుభవ పూర్వకంగా చెప్పేవాడు .క్రమంగా  భక్త గణం పెరిగింది .గుడివాడ ఆంజనేయ పరమహంస గా ప్రసిద్ధి పొందాడు .

  గుంటూరు జిల్లా బాపట్లలో శ్రీ మారుతి ప్రణవాశ్రమ౦ నిర్మించి జ్ఞాన బోధ చేసేవారు .11-10-1941వృష నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ షష్టి శనివారంరాత్రి 9 గంటలకు ఆంజనేయ పరమహంస  49 వ ఏట  ఆంజనేయ సన్నిధి చేరారు .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-9-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.