అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -5
3- టిం చేయాల్సిన ముఖ్యమైన పని
నాతో డాన్స్ చేసిన అమ్మాయి మనసులో మెదిలి ,ఇక్కడే ఉ౦దామనుకొన్నాను .నా భావం గ్రహించి చిరునవ్వుతో ‘’ఆమె పేరు సిసిల్లా ‘’అన్నాడు .తర్వాత మా గమనం అంతా ఆకాశ విహారమేకనుకు చుట్టూ ఉన్నవి దీక్షగా చూసే అవకాశం లేదు .పర్వతాలు అరణ్యాలు సరస్సులు చకచకా కదిలిపోతున్నాయి .విమానప్రయాణ౦ కంటే మహా ముచ్చటగా ఉంది .హంస వాలినట్లు కింద నెమ్మదిగా వాలాం.ఇల్లులాంటి ఇంటికి చేరాం .గుండ్రంగా ఉంది పైకప్పు లేకపోవటం షరామామూలే .ఊహించరాని అన్నిరకాల పుష్పాలు కనిపించాయి .’’దీన్ని టౌన్ హాల్ ,సమావేశ మందిరం అంటాం . ఇక్కడే ప్లానింగ్ మీటింగులు జరుపుతాం. సహాయ కార్యక్రమాలు చేస్తాం .ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడి వారిని అడగాలి నువ్వు .’’అన్నాడు .లోపలి వెళ్లి చూస్తే కళ్ళు చెదిరి పోయాయి అందానికి .గోడలనిండా సహజ చిత్రాలు నేలపై తెల్ల పసుపు పుష్పాలు .ఆజానుబాహులైన వ్యక్తులు నడుస్తూ ఇక్కడ కనిపించారు .మధ్యలో ఉన్న తిరుగుడు మెట్లు ఎక్కి పైకి వెళ్లాం. అక్కడ వేలాడే ప్లాట్ ఫారం కనిపించింది .అదికదలటం లేదు. మాన్యుల్ నా చెయ్యిపట్టుకొని ఒక పెద్ద ఫ్లోటింగ్ రూమ్ లోకి తీసుకు వెళ్ళాడు .అక్కడ తొమ్మిదిమంది ఆడామగా వారున్నారు .సుఖాసీనులై ఉన్నారు .ప్రతివారిముందు గుండ్రని టేబుల్ ఉంది .నేలపై వివిధ పుష్పాలు గోడలు అల్లిన కొమ్మలు గా ఉన్నాయి .
మేము లోపలి వెళ్ళగానే రెండు కుర్చీలు తెచ్చి వేసి మా ఇద్దర్నీ కూర్చోమన్నారు .అది ఒక నుయ్యిలాగా ఉంది .నా కాళ్ళకు జెల్లీ అంటుకున్నట్లు అనిపించింది .అందులో మధ్యలో కూర్చున్నాయన నీలికళ్ళతో నావైపు చూశాడు పొడవైన తెల్లని జుట్టు గడ్డం ఉన్నాయి .ముఖం పై ముడతలు లేవు .యవ్వనోత్సాహంతో హాయిగా కనిపించాడు .చేతులతో ఆహ్వానిస్తే నేనూ బదులిచ్చాను .’’భూమిపైనుంచి వచ్చిన యువ స్నేహితుడా స్వాగతం .నేను ఆర్నియాల్ .ఈ సింపోజియం కు లీడర్ ను .నీకు ఇక్కడ సుఖంగా ఉందనుకొంటా .ఇక్కడ ఉండాలను ఉందని భావిస్తా ‘’అన్నాడు స్వచ్చమైన స్పుటమైన ఇంగ్లీష్ లో .’’ఇక్కడ నాకు కనిపించిన ప్రతిదీ మహా ఆశ్చర్యంగా ఉంది .అయినా అమ్మను చెల్లిని వదిలి ఉండలేను .ముందు నేను వెళ్లి వాళ్ళను చూడాలి .ఆతర్వాత తిరిగి వచ్చి ఇక్కడి మంచిని తెలుసుకొంటాను ‘’అన్నాను.
‘’నీ కోరిక గ్రాంట్ చేస్తున్నాం. కాని ఒక కండిషన్ .భూమిపై జనానికి మేము ఇక్కడ ఉన్నట్లు తెలియజేయాలి నువ్వు .తర్వాత తిరిగి రావచ్చు .ముందు మేమిక్కడ ఉన్న మెసేజ్ అందించాలి నువ్వు ‘’అన్నాడు ‘’నా కాకమ్మ కబుర్లు వాళ్ళు నమ్మరు ‘’అన్నాను .’’ .వాళ్ళు ఏమనుకొన్నా ధైర్యం కోల్పోకు .నీకు కష్టమొస్తే రక్షించటానికి మేము సిద్ధంగా ఉంటాం .మేమిక్కడ ఉన్నామని వాళ్ళు అక్కడ వంటరి వాళ్ళు కాదన్న సందేశం వాళ్లకి చేరాలి మిత్రమా .వాళ్ళ కాలుష్యం ,కష్టాలలో మేము పాల్గొనం .ఈ విషయం గట్టిగా చెప్పు .వాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ పొతే తమ నాశనాన్ని వాళ్ళే కోరి తెచ్చుకొంటున్నారని చెప్పు .ఉపేక్షిస్తే వాళ్ళు సర్వనాశనమౌతారని హెచ్చరించు .దానివల్ల భూమికంటే ప్రజలకే తీవ్రనష్టం .చాలా ప్రమాదకరమైన అంచుమీద ఉన్నారు .త్వరలోనే పతనం తప్పదు’’అన్నాడు .నేను భయంతో ‘’మమ్మల్ని రక్షించేవారు లేరా ??’’అన్నాను .’’ఆప్రయత్నం లోనే ఉన్నాం .లేకపోతె ఆప్రమాదం మాకూ తప్పదు .టిమోతీ మిత్రమా ఇప్పుడు నువ్వు మా మెసెంజర్ వి .’’అన్నాడు ‘’నా శాయశక్తులా కృషి చేస్తాను ‘’అన్నాను గొణుగుతూ .ఆయన నాకు ఒక విజిల్ ఇచ్చి ‘’ఇబ్బందుల్లో ఉంటె విజిల్ ఊదు.దాని శబ్దం నీకేమీ వినిపించదు.కానిమాకు మనసు వేగంతో సిగ్నల్ అందుతుంది .దీన్ని పారేసుకోకు ‘’అని జాగ్రత్త చెప్పాడు .వంగి నమస్కారం చెప్పాను .నవ్వుతూ ఆర్నెల్ ‘’డబ్బు గురించి బెంగ వద్దు .మాన్యుల్ నీకు కావలసినంత ఇచ్చి పంపిస్తాడు .నీ ఇస్టమొచ్చి నంత కాలం ఉండు అక్కడ .మౌంట్ షాస్తావరకు మాన్యుల్ నీకు తోడుగా ఉంటాడు నాయనా .’’అన్నాడు .
నా చొక్కా పట్టి మాన్యుల్ నెమ్మదిగా లాగాడు .కనుక మిగిలినవాళ్ళను చూసి తెలుసుకోలేకపోయాను . వాళ్ళంతా కొత్త వాళ్ళే.మాన్యుల్ ‘’నీకు మంచి బట్టలుకావాలి’’అని నన్ను ఆటన్నేల్ ద్వారా ఒక టైలర్ దగ్గరుకు తీసుకువెళ్ళి ‘’ఈ కుర్రాడికి భూమిపై వేసుకొనే డ్రస్సులు ఒక సంచి నిండా ఇవ్వు ‘’అన్నాడు . వెంటనే ఇచ్చేశాడు వాలెట్ లోని డబ్బు తీసి మాన్యుల్ నాకు ఇచ్చాడు ‘’సరాసరి కాలిఫోర్నియాకే వెడుతున్నానా ‘’అడిగాడు .’’అవును అక్కడినుంచి మీ సియాటిల్ కు రెగ్యులర్ ఫ్లైట్స్ ఉంటాయి .’’అన్నాడు. ‘’నేను తిరిగి రావాలంటే ?”’అన్నాను .’’ముందుగా మనకు ఒక బ్రిడ్జి కనిపిస్తుంది అది దాటాలి .ముందుగా నీకు టైలర్ తగినట్లుగా బట్టలు కుట్టాడో లేదో వెళ్లి చెక్ చేసుకోనిరా .నేను ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ‘’అన్నాడు
నేను నాగైడ్ దగ్గరకు జీన్స్, పేల్ బ్లూ పుల్ ఓవర్ నేవీ జాకెట్ తో తిరిగి వచ్చాను .అతడుమోకాళ్ళదాకా ఉన్న గౌన్ తో కనిపిస్తే ఆశ్చర్యపోయాను .ఒక వాలెట్ లో నా పాస్ పోర్ట్ కూడా పెట్టి అందించాడు .అవి అతనికి ఎలా దొరికాయో నాకు సందేహం .’’భూమి మీదకు ఇది కొత్తపాస్ పోర్ట్ .మాకు అక్కడ ఎమేమి అవసరమో తెలుసు .అక్కడి చట్టాలూ తెలుసు .తెలీదనుకున్నావా ‘’అన్నాడు నవ్వుతూ .నా బాక్ పాక్ కూడా రెడీ చేసి ఇచ్చారు ,అందమైన టెలోస్ నుంచి టన్నెల్ చేరాం .అక్కడున్న చిన్న వెహికిల్ లో నేనూ మాన్యుల్ కూర్చునగా అతడు రెండు బటన్స్ నొక్కగా అది స్టార్ట్ అయింది ‘’మీ వాళ్ళు ఎంతక్రూరంగా ప్రవర్తించినా దిగులు పడకు ఆశ వదులుకోకు .అని కస్టాలు ఎదుర్కొంటూ ఉండు అక్కడ ఒకమ్మాయి నీకు కనిపిస్తుంది .ఆమెకు మా గురించి చెప్పు. ఆమె నిన్ను నమ్మితే ఆమెను ఒక్కదాన్నే ‘’ మళ్ళీ నీతో ఇక్కడికి తీసుకురా ‘’అన్నాడు .’’నేను ఇంటి దగ్గరే ఉంటా అమ్మా చెల్లెలుతో. వాళ్ళను కనిపెట్టుకొని ఉండాలి అమ్మకు వచ్చే పెన్షన్ నామ మాత్రమె ‘’అన్నాను .’’నక్షత్రాలను మార్గదర్శనం చేయమని కోరుతాను .అవే నీకు మార్గదర్శకం చేస్తాయి ‘’అని గట్టిగా హత్తుకొన్నాడు .నక్షత్రాలు అంటాడేమిటి అనుకోని చూస్తె మినుకు మినుకు మనే రెండు లాంతరు దీపాలు మాత్రమె కనిపించాయి .మా వెహికిల్ ఒక స్టెయిర్ కేస్ ముందు ఆగింది .అవి ఎక్కి పైకి వెడితే ఒక ప్లాట్ ఫారం పైకి చేరాను .అక్కడి ఇనుపగేటు తెరుచుకొన్నది .అది పర్వతం ప్రక్కన ఉంది .గాలి వర్షం పడుతోంది .మౌంట్ షాస్తాఒక చిన్నమానవ మాత్రుడు చీకటి ని కౌగలిస్తూ తను నిజం అని నమ్మే లోకం లోకి ప్రవేశించటానికి సాక్షీ భూతంగా ఉంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-9-20-ఉయ్యూరు