అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -6
4-సియాటిల్ లో విషాదం
మౌంట్ శాస్తా దిగటం గుర్తులేదుకాని అక్కడ మోటేల్స్, షాపులు కనిపించాయి .అక్కడనుంచి బస్ లో బయల్దేరి దగ్గరున్న ఎయిర్ పోర్ట్ చేరి సియాటిల్ కు వెళ్ళే ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాను .అమ్మా చెల్లీ జ్ఞాపకం వచ్చి కన్నీళ్లు చెంపలపై జారాయి .నేను ఇల్లువదిలేనాటికి మా చెల్లి కి17ఏళ్ళు .అమ్మ రూపం మనసులో కనిపిస్తూనే ఉంది .నా కుటుంబమే నా సర్వస్వం దాన్ని వదిలి చాలాకాలం ఉండిపోవాల్సి వచ్చింది .ఇంటికి చేరుతున్నానన్న ఆనందం .ఫ్లైట్ లో ఇచ్చిన ఆహారం తిన్నాను .సియాటిల్ నాకు బాగా తెలుసు .ఎయిర్ పోర్ట్ కోస్ట్ కు దగ్గరలోనే ఉంటుంది .ఫ్లైట్ దిగి ఈల వేసుకొంటూ టాక్సీ ఎక్కి ఇంటికి బయల్దేరాను .
ఇంటికి చేరి బెల్ కొట్టి తలుపు హాండిల్ ముద్దుపెట్టుకొన్నాను .ఇలా నేనూ మా చెల్లెలే చేస్తాం .మళ్ళీ బెల్ కొట్టాను .ఎవరినుంచీ సమాధానం లేదుఇంట్లో .అమ్మా చెల్లీ బయటికి వెళ్లి ఉంటారు .నాదగ్గర తాళం చెవి లేదు .అప్పుడొక స్త్రీ గొంతు వినిపించింది గుర్తుపట్టాను .అది ప్రక్కింటి బిగ్ టిల్లీఆంటీ గొంతు .వెనక్కితిరిగి చూస్తే ఆమె కనిపించింది ..’’టిమొతీ బ్రూకేనా ? నువ్వు మునిగిపోలేదా ?దెయ్యానివా ?’’అంది ఆశ్చర్యంగా . ‘’నేను బతికే ఉన్నా. అందరూ మునిగి చనిపోయారు .మా వాళ్లకు కబురు అందించే అవకాశం కుదరలేదు .మా అమ్మావాళ్ళు ఎక్కడున్నారో తెలుసానీకు ఆంటీ ‘’అన్నాను .ఆమె అమాంతంగా వచ్చి నన్ను దగ్గరకు తీసుకొని కన్నీరు కార్చింది .’’నాయనా నువ్వు వెళ్లి మూడేళ్ళయింది .మీ అమ్మా చెల్లీ చనిపోయారు .మీ చెల్లి రహస్యం గా పెళ్లి చేసుకొని ,ఈ వార్తకు ముందు ,ఆరునెలల్లో పిల్లను కని చనిపోయింది .షిప్ రెక్ వార్తవిని మీ అమ్మ దిగులుతో జబ్బుపడి కొన్ని నెలలకే చనిపోయింది .కుటుంబాన్ని అ౦తటినీ పోగొట్టుకొన్న దుఖంతోనే ఆమె చనిపోయింది ఇల్లు బేరం పెట్టారు .కాని అమ్మలేదు .కనుక ఇల్లు నీదే .మీ బావ బెర్టీ వాంకోవర్ లో ఉంటున్నాడు .బహుశా మళ్ళీ పెళ్లి చేసుకొని ఉంటాడు ‘’అన్నది .’’మీ అమ్మ లాయర్ అడ్రస్ నా దగ్గర ఉంది .ఆయనదగ్గర మీ అమ్మ విల్లు ఉండి ఉంటుంది .నేను టీ తెస్తాను .ఇక్కడే ఉండి నీ పనులన్నీ చూసుకో ‘’అని లాలనగాచేప్పింది .టిల్లీ ఆంటీ ఎంతో దయగా మాట్లాడి నాకు ఊరట కలిగించింది .ప్రపంచం లో ఇప్పుడు నాకు ఎవ్వరూ లేరు .ఒంటరి వాడిని అనిపించింది .
ఆంటీ ఫోన్ చేసి లాయర్ కు చెప్పింది .నేను కీస్ కోసం టాక్సీ చేసుకొని ఆయన ఇంటికి వెళ్ళాను .ఆయన వారసుల సంగతి తేలేదాకా ఇల్లు అమ్మకం కుదరదని ఆపేశానని చెప్పాడు .సాక్ష్యాలు వగైరాలకోసం ఆయన ఇబ్బందిపెట్టలేదు .ఆంటీ మాట పై నమ్మకం తో నేనే వారసుడినిఅని గ్రహించాడు .అమ్మయ్యా నాకు నిలవ నీడ దొరికింది అని అనుకొన్నాను .కీస్ తీసుకొని ఇంటికి వచ్చాను .నా బెడ్ రూమ్ అంటా దుమ్మూదూళీతో ఉంది .ఆంటీ హారీ దంపతులు ఎంతో ప్రేమ చూపారు .మా కుటుంబం పొందిన విషాదాన్ని మరచి పోయే ప్రయత్నంచేశారు .నన్ను వ౦ట చేయనివ్వలేదు. మంచి ఆహారపదార్ధాలు వాళ్ళే వండి తెచ్చి తినిపించేవారు .టెలోస్ లో శాకాహారం అలవాటయింది కనుక ఇక్కడ మాంసం తినబుద్ధికాలేదు .వాళ్ళు తెచ్చింది ఫోర్క్ లేక బీఫ్ అయితే బయటపారేసేవాడిని .అమ్మా వాళ్ళ సమాధులు చూడాలని పించి చూశాను .ఆంటీనా బట్టలుకూడా ఉతుకుతోంది .సడన్ గా వచ్చి ‘’నీ స్నేహితులున్నారుగా .ఉండు నేను లోకల్ పేపర్ వాడిని అడిగి వాళ్లకు ఫోన్ చేసి నువ్వు వచ్చావని చెబుతాను ‘’అన్నది .బానే ఉందికాని వాళ్ళను చూడాలని నాకు లేదు .నేను టెలోస్ విషయాలు ఆంటీ అంకుల్ కు చెప్పాను అ౦కుల్ పగలబడి నవ్వాడు .ఆ౦ టీనుంచి రియాక్షన్ లేదు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-9-20-ఉయ్యూరు