అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -7
4-సియాటిల్ లో విషాదం -2
ఆంటీ అన్నంతపనీ చేసింది .ఒక మధ్యవయసు అందమైన అమ్మాయి న్యూస్ పేపర్ రిపోర్టర్ గా వచ్చి పలకరించింది .నేను చెప్పిందంతా జాగ్రత్తగా వింటూ పాయింట్లు నోట్ చేసుకొంది.నా బాల్యం గురించి అడిగింది .నేను మాత్రం టెలోస్ గురించే ఎక్కువ చెప్పాను .కొన్ని రోజుల్లోనే పేపర్లో నాఫోటో నేను చెప్పిన విషయాలూ అన్నీ వచ్చి నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది .పేపర్ లో నేను తిరిగి వచ్చిన స౦గతి చదివినవారు ఫోన్లు చేయటం మొదలుపెట్టారు .నా ముఖ్య స్నేహితుడు ఫోన్ చేసి త్వరలో వచ్చి కలుస్తానని చెప్పాడు .అతడు డెంటిస్ట్ నన్ను డిన్నర్ కు రమ్మన్నాడు .అతడికి పెళ్లి అయి ఒకచిన్న కూతురు కూడా ఉంది .వెంటనే వెళ్లి మాట్ ను హత్తుకున్నాను ఆనందం తో .ఎర్రజుట్టు ఉ౦డేదికనుక ‘’రెడ్ మాట్’’అనే వాళ్ళం .అతని భార్య ప్రెగ్నంట్ అందంగా ఉంది .అతనిది విశాలమైన ఇల్లు గార్డెన్ .మా ఇంట్లో ఉన్నట్లే ఫీలింగ్ కలిగింది అక్కడ .ఈమూడేళ్ళూ ఏమైపోయావని అడిగాడు .భోజనాలయ్యాక తీరిగ్గా చెప్పుకొందాం, అయినా నువ్వు నమ్మకపోవచ్చు అన్నాను .అతడి కూతురు నా పక్కనకూచుని శ్రద్ధగా వింటోంది .మా పడవ మునకకు ముందే మాట్ పెళ్లి చేసుకొన్నాడు .అతడిభార్య నాన్సీ భోజన౦ రెడీ ,రమ్మని చెప్పింది .కూతురు ఎలినార్ చెయ్యి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లాను .అ చిన్నారి ‘’నీవెనక పొడవైన ఆయన నిలబడి ఉన్నాడు నీ ఫ్రెండ్ట.పేరు చెప్పన్నన్నాడు .నువ్వు స్వీడిష్ కదా ‘’అంది .’’అవును సగం స్వీడిష్ ,సగం అమెరికన్ .నాన్సీ వంట బాగా చేసింది రుచిగా ఉన్నాయన్నీ .మాట్’’మీ అమ్మమ్మ కు నువ్వు బతికి ఉన్నట్లు తెలుసా ??అన్నాడు .ఏం చెప్పాలో తోచలేదు అమ్మమ్మ అంటే నాకు మహా అభిమానం ఆమెకూ అంతే.రేపే వెళ్లి అమ్మమ్మను చూసిరమ్మన్నాడు మాట్.నా కథంతా మాట్ కు వివరంగా చెప్పాను .చివర్లో అతని భార్యకూడా వచ్చి విన్నది .నమ్ముతావా నేను చెప్పింది అంటే నిన్ను నమ్ముతాను అన్నాడు .రేపు ఆదివారం కనుక పొద్దున్న పదింటికి వస్తాను ఇద్దరం కలిసి వాకింగ్ చేస్తూ మాట్లాడుకొందాం అన్నాడు .
5-స్వీడెన్ ట్రిప్
అనుకోన్నట్లే అమ్మమ్మా వాళ్ళ ఇంటికి వెళ్లాను .అమ్మమ్మ ఆనందంగా ‘’టిం నువ్వేనా ‘’అని ఆశ్చర్యానందాలతో ఆహ్వానించింది ‘’నాన్నా ఒక్కగానొక్క మనవడివి ఇంతకాలం ఎందుకు ఫోన్ చేయలేదురా’’అనగా ‘’నేనే అమ్మమ్మా నీ టిం నే’’అన్నాను .అమ్మమ్మతో గడిపి నాలుగేళ్ళు దాటింది ఇలా ఆలోచనలు సాగాయి నాలో ..ఇంతలో మాట్ వచ్చాడు ఇద్దరం నడుస్తున్నాం ‘’నువ్వు చెప్పింది అంతా నమ్ముతున్నాను .మానవాతీతులు౦టారని నమ్మతున్నాను’’అన్నాడు .ఒక నిమ్మ చెట్టు దాటి వెడుతూ ఉంటె దానికొమ్మ నా చేతిలోకి వచ్చి ఆశ్చర్యం కలిగించింది .’’నువ్వు మంత్ర గాడివా ‘’ అన్నాడు మాట్.నాకూ ఆశ్చర్యంగా ఉందన్నాను .రేపు పొద్దునే స్వీడెన్ వెడుతున్నాను అని చెప్పాను .’’నీకు టెలిపోర్ట్ లేకపోతె నేను వచ్చి ఎయిర్ పో ర్ట్ కు నా కారులో తీసుకు వెడతాను ‘’అన్నాడు నవ్వుతూ .మర్నాడు నేను ప్లేన్ ఎక్కి స్వీడెన్ చేరి టాక్సీ లో ఫ్లోడా లోని అమ్మమ్మగారింటికి వెళ్లాను .రెండు చేతులు జాపి నన్ను ఆప్యాయంగా ఆహ్వానించి అక్కున చేర్చుకొన్నది అమ్మమ్మ .బతికి ఉన్న ఒక్కగానొక్క బంధువు అమ్మమ్మ ‘’నువ్వు బతికున్నావ్ బతికున్నావ్ నాయనా .మీ అమ్మ ఎక్కువ దుఖం తో చచ్చిపోయింది అంది చెక్కిళ్ళమీద నుంచి కన్నీరు కారుతుండగా .
‘’ఎమైయ్యావురా ఈ మూడేళ్ళూ ఫారిన్ బ్రోతల్ లో గడిపావా “”అంది నవ్వుతూ .నేను మూడేళ్ళూ భూగర్భలోకం లో ఉన్నానని వివరాలన్నీ చెప్పాను ‘’చాలా తమాషాగా ఉందిరా అబ్బాయ్ .భూమిలోపల మనుషులు ఉంటారని వినేదాన్ని .నువ్వు చూసే వచ్చావన్నమాట .నీకు గుర్తున్నవన్నీ పూసగుచ్చినట్లు చెప్పు నాయనా వింటాను ‘’అన్నది ఉత్కంఠ ఆపుకోలేక .అన్నీ చెప్పీ చెప్పీ అలసిపోయాను .అమ్మమ్మ నా రెండు చేతులు తన చేతుల్లోకితీసుకొని ఆప్యాయత చూపింది ‘’అమ్మమ్మా నువ్వు తప్పఎవరూ నమ్మలేదు ‘’అన్నాను ‘’’మనం నమ్మించేట్లు చేయాలి నాయనా ‘’అన్నది గ్రాండీ .రేపు ఆలోచించచ్చు లే అనుకోని డిన్నర్ కి కూర్చున్నాం.’’నీ బావమరిది మాత్రం నమ్మడురా .వాడు వి౦త మనిషి నీ చెల్లెలు ఎలా వాడి వలలో పడిందో తెలీడు ‘’అన్నది .భోజనాలయ్యాక ఫైర్ ప్లేస్ దగ్గర కూర్చున్నాం .అమ్మమే చెప్పటం మొదలు పెట్టింది ‘’నా గురించి ఎప్పుడూ నీకు చెప్పలేదు .నేను మధ్యతరగతి దానిని. ఐతే అందరికి సాయం చేస్తాను .అందుకే నేనంటే అందరికి గౌరవం .ఇతర ప్రపంచాలగురించి వాళ్లకు బోధిస్తూ ఉంటాను .వాళ్ళ అంతరాత్మలను శోధించుకోమని సలహాలిస్తాను .వాళ్ళ హృదయాలను వింటాను. వాళ్ళ మనసులను సరిచేస్తాను ‘’అన్నది అమ్మమ్మ .’’వాళ్ళ కార్డ్స్ అంటే జాతకాలు చూసి చెబుతావా ??’’అన్నాను .’’కాదు వాళ్ళ కళ్ళల్లోకి చూసి చెబుతా . వాళ్ళ పెదిమలు చెప్పలేనివి కళ్ళు చెబుతాయి .వాళ్ళ ఆరా అంటే చుట్టూ ఉండే కాంతి చక్రం బాగా సహాయకారిగా ఉంటుంది .లేకపోతె నాక్తుర్నల్ అంటే రాత్రి స్నేహితులు సాయం చేస్తారు .వాళ్ళు పగలుకూడా నాకు కనిపిస్తారు .ఐతే నేను ట్రాన్స్ లో ఉండాలి. ఉంటే కనిపిస్తారు .నాకుఒక స్పిరిట్ గైడ్ గా అనేక జన్మల నుంచీ ఉన్నాడు తెలుసా నీకు .అతడితో మాట్లాడుతా .అతడిమాటలు వి౦టానుకూడా ‘’అంది .జీజెసా ‘’?అన్నాను .నవ్వి ‘’కాదు .ఆయనతో చాలామది కాంటాక్ట్ లో ఉంటారు. కానీ నా గైడ్ పేరు ‘’మెల్చి జెడెక్’’అన్నది .’’మంచి గైడ్ అతడు .అతడు పైస్థాయి మాస్టర్ .బుద్ధినుంచి ఏర్పడిన వాడు ‘’అన్నాను .’’నాకు తెలుసు .తమాషా వ్యక్తీ బుద్ధిజీవి ఆల్కమిస్ట్ కూడా .అబ్రహాం కు టీచర్ .ఇప్పుడు నాకు గురువు ‘’అంది నవ్వుతూ కాన్ఫిడెంట్ గా అమ్మమ్మ ‘’’నిజమే ఆయన్ను చూస్తావా ‘’?అన్నాను. ‘’నా లోదృష్టితో చూస్తాను .నాకు చాలాబోధించాడు .నాకు కుటుంబ క్షోభ కలిగినప్పుడు నన్ను ఓదార్చాడు .అతడే నిన్నుకూడా రక్షించి ఉంటాడు .నాకు చెప్పటానికి అతడికి ధైర్యం లేకపోయింది .ఎవరి దయవల్లనైనా కానీ నువ్వు బతికి బట్టకట్టి మళ్ళీ నాకు కనిపించి, నా మనో వ్యధను తీర్చావు సంతోషం నాయనా ‘’అంది అమ్మమ్మ డగ్గుత్తికతో .అమ్మమ్మ చెప్పిన దాన్నిబట్టి ‘’హై మాస్టర్స్ ‘’ఉంటారన్న నానమ్మకమూ బలపడింది.అమ్మమ్మ నాకొక డైరీ ఇచ్చింది అది ఈ భూమిపైనాకు ఒక సాధనం గా ఉపయోగపడుతుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-9-20-ఉయ్యూరు