అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -8
6-అసాధ్య కార్యం
అమ్మమ్మకు అలౌకిక శక్తులతో ఉన్న పరిచయం కొంత ఉత్సాహం కలిగించి౦దినాకు .ఆమెకు పరిచయమైన అక్కల్ట్ శక్తులున్న వారందరికీ ఫోన్ చేసి పిలిపించి,శనివారం24మందితో మీటింగ్ పెట్టింది .హాలోఎర్త్ విశేషాలు వారందరికీ బాగున్నాయనిపించాయి .వాళ్ళ ప్రశ్నలకుసమాధానాలిచ్చాను .వెనకకూర్చున్న ఒకాయన నేను ఇక్కడే ఉంటానా ,టెలోస్ గురించి చెబుతావా అని అడిగాడు .వారందరికీ పారసైకాలజీ మీద అభి రుచి బాగా ఉన్నట్లు అర్ధమైంది .చాలామంది భూగర్భలోకం ఉందన్న విషయం నమ్మలేదు .అంతకు ముందు ఎవరూ అక్కడికి వెళ్ళలేదా అనే ప్రశ్న వేశారు .నేను’’ స్పిరిట్యువల్ కాన్మాన్ ‘’ అనే ఆధ్యాత్మిక మోసగాడిని కాను అన్నాను .నేను చెప్పింది సైన్స్ ఫిక్షన్ అనుకొన్నారు కొందరు .అమ్మమ్మ నన్ను బాగా సమర్ధించింది అన్ని రకాలుగా .నాకుఅదే ధైర్యం .తన పరిచయస్తులు నా యెడల అపనమ్మకం తో ఉన్నందుకు నేను వారి మధ్య అన్ పాప్యులర్ అయినందుకు ఆమె బాధ పడింది కూడా .
గ్రేట్ డేన్ అనే రెండేళ్ళ కుక్కటిచ్ ను పెంచుకొంటున్నాను.మేమిద్దరం మంచిస్నేహితులమయ్యాం .నేనెక్కేడికి వెళ్ళినా నా వెంట నడిచేది .అమ్మమ్మ,కయాస్ టిచ్ లకు మాత్రమె అక్కడి అనుభవాలు చెప్పేవాడిని .ఒకరోజు అమ్మమ్మ ‘’ఏరా వచ్చి మూడు నెలలయింది .ఇక్కడే ఉండాలని ఉంటె నాకు అభ్యంతరం లేదు. ఈ స్వీడేన్లు నిన్ను నమ్మరు నాయనా .నువ్వు చెప్పేదానికి సాక్ష్యం కూడా నీ దగ్గర లేదుకదా.స్వీడేన్లు ప్రూఫ్ ఉంటేనే నమ్ముతారు ‘’అన్నది నాబాధ అర్ధం చేసుకొని .’’సాక్ష్యమా ?నేను చాలనా ?’’అన్నాను .’’నీ అస్తిత్వానికి ఆధారం ఒక్క నీ పాస్ పోర్ట్ మాత్రమె కదరా .దానికి మించిన ప్రూఫ్ ఉండాలిరా అబ్బాయీ .నువ్వు ఒక ధ్యేయం అంటే మిషన్ తో కర్తవ్యమ్ తో వచ్చావు .నేను నీకు సహాయం చేయాలి. ఆపని మీదే ఉన్నాను ‘’అన్నది .
కుక్కతో లాంగ్ వాక్ లు చేస్తున్నాను .ఒకసారి ఒక అడవిలోకి వెళ్లాను .నాకు ఎవరో సాయం చేయాలి .మాన్యుల్ మాత్రమె దిక్కు అనిపించి అతడిచ్చిన విజిల్ ఊదాను .వెంటనే మాన్యుల్ వచ్చేశాడు .సమస్య ఏమిటని అడిగాడు .’’నేను ఇక్కడ ఉండాలా అగర్తాకు వెళ్ళాలా అనే సందేహం లో ఉన్నాను ‘’అన్నాను .టిచ్ తిరిగి వచ్చింది .ఈసారి నాతొ దాన్ని కూడా టెలోస్ కు తీసుకురమ్మన్నాడు .’’ఇదేనా నీ సమస్య .దీనికి పరిష్కారం నువ్వే చూసుకోవాలి నేను సలహ ఇవ్వను .నీ అంతరాత్మ ఏ నీకు సలహా ఇస్తుంది అడుగు .కామన్ సెన్స్ ఉపయోగించు కాని ఎమోషన్స్ లో కొట్టుకుపోకు’’అన్నాడు. ధాంక్స్ చెప్పాను .అంతలో అతడు వెళ్ళిపోయాడు .టిచ్ కి అతడు అదృశ్యమయ్యాడన్న ఫీలింగ్ లేదు .గబగబా ఇంటికి చేరాం .
నేను కారుకొనలేదు అమ్మమ్మ ఆడి కారునే వాడుతున్నా .నా సియాటిల్ స్వీట్ హోమ్ మీద గాలి మళ్ళింది .నాకు ఎన్నిళ్ళున్నాయి . తమాషా గా ఉంది ఈ ఆలోచన .కయాస్ ను కలవటానికి డిజూరా వెడుతున్నా అమ్మమ్మ ఆడి కారులో అతి వేగంగా .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-9-20-ఉయ్యూరు