అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -9
7-టిం కొత్త సంసారం
సియాటిల్ వెళ్లాలని నిర్ణయించాను.నామనసులో చలా ప్లాన్లున్నాయి .టెలోస్ గురించి వివరంగా ఒక ఆర్టికల్ రాయాలని ఉంది దాన్ని కేయాస్ ప్రింట్ చేస్తానని హామీ ఇచ్చాడు కూడా .అమ్మమ్మని వదిలి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది . స్వీడన్ స్పిరిట్యు యాలిటితో ఆమెవిసిగిపోయింది .నాతో టెలోస్ వస్తుందేమో అడగాలి .టిచ్ ను వదలాలంటే కూడా ఇబ్బందిగా ఉంది .దాన్ని క్వారంటైన్ లో ,లేక పంజరం లోనో పెట్టాల్సివస్తుంది .అయినా మాన్యుల్ సాయం చేస్తాడులే .ఎమైనా టెలోస్ కు త్వరగా వెళ్ళాలి .మాన్యుల్ రావటం టిచ్ ను తీసుకువెళ్లటం ఇద్దరూ అదృశ్యమవటం క్షణాల్లో జరిగిపోయి నాకు రిలీఫ్ గా ఉంది .
సియాటిల్ చేరి టాక్సి లోకి జంప్ చేసి కూర్చున్నాను .సరాసరి టెలోస్ వెళ్ళకూడదు .ముందు మాట్ కుటుంబాన్ని కలవాలి .ఈ పాటికినాన్సీ డెలివరి అయిఉంటుంది.మాఇంట్లో ఒక నెలఉండి,తర్వాత భూగర్భలోకం వెళ్ళాలి . టెలోస్ లోని విజ్ఞానం ఇక్కడ అందటం లేదు .స్వీడిష్ కెనెడియన్ చదువు చాలదనిపించింది నేను కెనడియన్ నే అని చిన్నప్పటి నుంచీ నా భావం .
ఇంటికి వెళ్ళే ముందే మాట్ ని కలిసి స్వీడన్ కబుర్లు అర్జెంట్ గా చెప్పాలని తొందరగా ఉంది .మాట్ ఇంటికి వెళ్లి బెల్ కొట్టాను .ఆలస్యంగా వచ్చి నాన్సీ తలుపు తీసింది .ఆమె కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి. చిన్నారి ఎలినార్ కనిపించలేదు. నాన్సీ చిక్కింది కనుక ప్రసవం జరిగి ఉంటుంది .మాథ్యూ చనిపోయాడన్న దుర్వార్త విన్నాను. కార్ యాక్సిడెంట్ లో పోయాడు .పని నుంచి ఇంటికి తిరిగివస్తుంటే తాగిఉన్న కారు డ్రైవర్ గుద్దటంవల్ల చనిపోయాడు మాట్.వెంటనే హాస్పిటల్ లో చేర్చినా లాభంలేకపోయిందట .నాన్సీ నన్ను పట్టుకొని విపరీతంగా రోదించింది .ఆమెను ఓదార్చాను నాకు వచ్చినమాటలతో .ఎలినార్ గబుక్కునవచ్చి నా ఒళ్లో చేరి ‘’నాన్న చచ్చిపోయాడు .నాకు డాడీ కావాలి .నువ్వు డాడీగా ఉంటావా ప్లీజ్ ‘’అంది అమాయకం గా .నాన్సీ పిల్లను ఓదార్చింది ఎలినార్ ను ఎత్తుకు తీసుకొని పరుపు మీద పడుకోబెట్టాను .నాన్సీ కి నెలలు నిండకుండా డెలివరిజరిగి మాట్ చనిపోయిన కొద్ది రోజుల్లోనే శిశువు చనిపోయిందట .నాన్సీ కిందకు వెళ్ళింది .ఎలినార్ నా చెవుల్లో ‘’నాన్న చనిపోతాడని, నువ్వు అమ్మ ,పువ్వులు బాగా ఉండే చోటుకు వెడతారని నాకు కనిపించింది ‘’అని రహస్యంగా చెప్పింది . ఆమాటలకు అవాక్కయ్యాను .మాట్ ఫామిలీని టెలోస్ కు తీసుకు వెళ్ళచ్చా’’అని సందేహం .
అమ్మమ్మ కు ఫోన్ చేసి త్వరలో భూగర్భ లోకానికి వెడుతున్నానని చెప్పాను .ఆమె కుంగి పోయినట్లు అనిపించింది .ఆమె పారాసైకాలజి ఫ్రెండ్స్ ఆమెకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారట ,వార్నింగ్ ఇస్తూ ఉత్తరాలు వస్తున్నాయట .చంపుతామని బెదిరింపులు కూడా ట.పోలీస్ కంప్లైంట్ చేయచ్చుకాని దానికి చాలాసమయం పడుతుంది. మాతోపాటు అమ్మమ్మకూడా టెలోస్ కు తీసుకు వెడితే ?అన్న ఆలోచన వచ్చింది .మాన్యుల్ ను సలహా అడిగా .అమ్మమ్మ రావటం అతడికి ఇష్టమే .ఆమెకు ఫోన్ చేసి వెంటనే అందుబాటు లో ఉన్న ఫ్లైట్ లో రమ్మనటం ,ఆమె అంతే స్పీడ్ గా సామాను తో రావటం జరి గింది .శాస్తా కు వెళ్ళటం ఇబ్బందే కాని మాన్యుల్ మాకుసహాయం చేస్తాడన్నా ధీమా నాది .మాన్యుల్ నా కుక్కతో సహా కనిపించాడు .నా ఆనందం చెప్పనలవి కానిది .టిచ్ తో నాన్సీ కి దోస్తీ కుదిరింది క్షణాలమీద .ఆమె ప్రయాణానికి తగిన ఏర్పాట్లుకూడా నిమిషాలలో చేసేసింది .ఇక నేను రాసేదంతా అగర్తా గురించే .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-9-20-ఉయ్యూరు