అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -10
8-మళ్ళీ భూగర్భ లోకం లోకి -1
మౌంట్ శాస్తా నుంచి మేము అక్కడికి చేరగానే ‘’ఇక్కడి పూలు ఎంతబాగా ఉన్నాయో చూడు ‘’అంది నాన్సీ .అన్నిరంగులపూలు కనువిందు చేశాయి .మాన్యుల్ వచ్చి పిల్లలతోకూడా వచ్చినదుకు సంతోషం స్వాగతం అన్నాడు .అమ్మమ్మ కూడా చుట్టూ చూసి పరవశించింది ‘’నాకు కలలో కనిపించిన లోకం ఇప్పుడు చూస్తున్నందుకు ఆనందంగా ఉంది ‘’అన్నది అమ్మమ్మ ఎమిలీ .టన్నెల్ లో నుంచి మా లగేజ్ అంతా ప్రత్యేక ట్రక్ లో వచ్చేసింది .అక్కడ వెహికల్స్ తేలుతూ ఉన్నాయి .ఒకదానిలో మమ్మల్ని ఎక్కమన్నాడు మాన్యుల్ .మేము ఎక్కింది కారు కాదు బోటుకాదు ఫ్లైట్ కూడా కాదు దాన్ని ‘’హోవర్ క్రాఫ్ట్ ‘’అన్నారు ..ఆ హో చూడు గోష్ ‘’అనగానే మేము మా కొత్త ఇంటి దగ్గర ఉన్నాం .అమ్మమ్మ సంతోషం తో చప్పట్లే కొట్టింది .మాన్యుల్ ను పాతస్నేహితుడిలాగా గ్రీట్ చేసింది .ఈలోకాన్ని గురించి నేను అమ్మమ్మ కు వాళ్ళింట్లో చెప్పిఅనప్పుడు ఆమె ఏమాత్రం ఆశ్చర్యపోలేదు .
అమ్మమ్మ మాంచి హుషారుగా ఇంటి తలుపు తట్టింది .పైకప్పు మామూలు గోడలు లేకపోవటం ఇక్కడి ఇళ్ళ ప్రత్యేకత అని ముందే చెప్పుకొన్నాం .మధ్యలో లివింగ్ రూమ్ ఉంది .ఇప్పుడు బెడ్ రూమ్ కావాలి .’’డిష్ వాష్ ఓవెన్ లేవే ‘’అంది నాన్సీ .నవ్వు వచ్చిందికాని నవ్వలేదు నేను .’’మహామంచిది వంట చెయ్యక్కర్లేదు ‘’అని అమ్మమ్మ .బాత్ రూమ్ కోసం చూస్తోంది ఆమె .ప్రక్కడోర్ చూపించా .అక్కడ మంచి బాత్ రూమ్ ఉంది .అక్కడి టాయ్ లెట్ ప్రత్యేకమైంది .శరీరమలం అంతా అదృశ్యమై వెంటనే కరిగిపోతుంది .కిచెన్ మెషిన్ కి ఆర్డర్ చెబితే కావాల్సిన వండిన భోజనపదార్ధాలన్నీ వచ్చేస్తాయి .దీనికి ‘’పవర్ ఆఫ్ ధాట్’’కావాలి .గార్డెన్ లో తిరుగుతుంటే ‘’ఇక్కడ పని చేసే వాళ్ళు ఉంటారా ‘’అని అడిగింది అమ్మమ్మ ‘’నువ్వు ఎక్కడ ఉంటావురా ‘’అన్నది అమ్మమ్మ .’’ఇక్కడికి దగ్గరలో నాకు ప్రత్యేక ఇల్లు ఉంది .ఇక్కడ అందరూ పని చేస్తారు అమ్మమ్మా ‘’అన్నాను .నువ్వు ఏంచేస్తావిక్కడ ‘’అమ్మమ్మ ‘’నేను హీలర్ గా ఉన్నాను .ప్రజలకు సాయ పడతాను .ఇక్కడ హాస్పిటల్ ఉంది .ఐతే మనకున్నలాంటిదికాదు.పరస్పరసాయం ఎలా చేసుకోవాలో నేర్పిస్తాం ‘’అన్నాను .’’అమ్మమ్మ కాలు విరిగితే ‘’అంది నాన్సీ .’’నిమిషాల్లో నేను నయం చేస్తాను .ప్రతిదాన్నీ మా పద్ధతిలో మేము నయం చేస్తాం ‘’అన్నాను ‘’అక్కడికీ ఇక్కడికీ అంత తేడా ఎలా వచ్చిందో .అక్కడి మట్టీ ఇక్కడి మట్టీ ఒకటేగా ‘’‘’అంది నాన్సీ . ‘’ఒకటేకాని కాలం లో తేడా ఉంది .ఇక్కడి వారు చాలా ప్రాచీనులు అఫ్ కోర్స్ మనలో కొందరు కూడా. ఇక్కడ ప్రాచీన విజ్ఞానం స్థాపించబడింది .’’అన్నాను అమ్మమ్మ బయటికి వెళ్లి కంగారూ జంతువూ ను చూసి ఆశ్చర్యపడి ముచ్చట పడింది . ‘’ఇక్కడ అడవి జంతువులన్నీ ఫ్రీగా తిరుగుతాయి. అపాయం చేయవు .మనుషులు జ౦తువులు స్నేహంగా ఉంటారిక్కడ.క్రూర జంతువులను తలమీద తట్టరాదు.మెడమీద తట్టాలి ఆప్యాయంగా .అవి చాలా ప్రశాంతంగా ఉంటాయి మనమూ అలానే ఉండాలి ‘’అన్నాను .మా కుక్క టిచ్ జాగ్రత్తగా కాపలా కాస్తోంది .అందరం లోపలి వెళ్లాం అమ్మమ్మ కూర్చుని ఉంది .అక్కడ మూల సీటు దొరుకుతుందా అని అడిగింది .’’లేదు నీకు ప్రత్యేకంగా ప్రక్కిల్లు ఏర్పాటు చేశారు దానిలో ఉంటుంది ‘’అనగానే పట్టరాని సంతోష పడింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-9-20-ఉయ్యూరు