మనకు తెలియని మహాయోగులు—19
46-ఎల్లారెడ్డి పేట హజ్రత్ ఇమామలీ బాబా -1825-1934
కరీమ్ నగర్ జిల్లా ఎల్లారెడ్డి పేట కు చెందిన హజ్రత్ ఇమామలీ బాబా గంభీరావు పేట లో 1825 లో జన్మించినట్లు తెలుస్తోంది .110 ఏళ్ళు జీవించి 1934లో మరణించారు .కొంతకాలం బడి పంతులు గా చేశారు .1908లో మూసీ నదికి వరదలు వచ్చి దానిదగ్గరున్న మానేరు నది ఒడ్డునున్న నామాపురం గట్టు చరియపై గుహ లో తపస్సు చేస్తుంటే ,తపోనిష్టలో ఉండి చరియ లో కూరుకు పోయారు .వరద తగ్గాక ,ఇసుక తీయగా బయటపడి ఆశ్చర్యం కలిగించారు .గ్రామ పటేలు పాపా రెడ్డి భక్తుడై రెండు అంతస్తుల మేడ కట్టించి అందులో బాబాను ఉంచాడు .ఆశ్రితులు ,భక్తులు వస్తే వారు రాగానే వారి వివరాలన్నీ తానె చెప్పి సాయం చేసేవారు .4-7-1934భావ జ్యేష్ట బహుళ పంచమి గురువారం110ఏళ్ళ వయసులో బాబా తనుఉ చాలించారు .ఆయన సమాధి నేటికీ యాత్రాస్థలం గా వర్ధిల్లుతోంది .
47-యల్లం పల్లె పుల్లయ్య అవధూత -1920-1983
కడపజిల్లా దిగువ నేలటూరు భట్రాజదంపతులు వెంకటరాజు లక్ష్మమ్మ దంపతులకు 1920లో వెంకట రాజరాజు పుట్టాడు .రాజయ్య అని పిలిచేవారు .ఊరిలోనే చదువు ప్రారంభించి తండ్రి దగ్గర భారత రామాయణాలు ప్రబంథాలు నేర్చాడు .సుస్వరంగా త్యాగారాజకృతులు పోతనభాగవత పద్యాలు పాడేవాడు .బడిపంతులుగా కూడా పని చేశాడు .1932లో మర్రి పుల్లయ్య యోగి గురి౦చి విని వెళ్లి శిష్యుడై ,ఉపదేశం పొంది ‘’పుల్లయ్య స్వామి ‘’అయ్యాడు .పెళ్లి వద్దని కొండల్లో గుహల్లోఅడవుల్లో తిరుగుతూ సమాధి పొందేవాడు .అందరూ ఆతిధ్యమిచ్చి ఆదరించేవారు యల్లం పల్లె ,మిట్టమాని పల్లె ప్రజలకు ఆరాద్యదైవమయ్యాడు .మహిమలులీలలు చూపేవాడు .11-7-1983రుధిరోద్గారి ఆషాఢ శుద్ధ పాడ్యమి సోమవారం 63వ ఏట పుల్లయ్యస్వామి దేహం చాలించాడు .ఆయన సమాదినిర్మించి ఏటా ఆరాధనోత్సవాలు చేస్తున్నారు
48-నెల్లూరు నిత్యానంద స్వామి -1864-1936
డెహ్రాడూన్ సీస్మానదీ తీరం లో శాలికోటలో దయా౦బా ,గాలూరాం దంపతులకు 7-8-1864రక్తాక్షి శ్రావణ శుద్ధ పంచమి ఆదివారం పూర్ణ రాముడు పుట్టాడు.రెండేళ్లకే తండ్రి చనిపోతే ఆధ్యాత్మిక ప్రసంగలు వింటూ ,12వ ఏట 1876లో వైరాగ్యం తో ఇల్లువదిలి తీర్ధ క్షేత్ర దర్శనం చేస్తూ వశిష్టాశ్రమం చేరాడు .హిమాలయ గుహలలో ఏడేళ్ళు తుంగ ముస్తెలు మాత్రమె తింటూ కఠోర తపస్సు చేశాడు .ఒకరోజు గంగాతీరం లో కృష్ణానంద సరస్వతి యతీంద్రుల దర్శనం లభించింది .ఆయన ప్రణవ మంత్రోపాసన చేసి ‘’నిత్యానంద స్వామి ‘’దీక్షానామ౦ , సన్యాస౦ ఇచ్చారు .
గురువు అనుమతితో హిమాలయ గుహలలో తపస్సు చేస్తూ ఆత్మ సాక్షాత్కారం పొంది దేశ సంచారం చేస్తూ ,రోజుకు 30మైళ్ళు నడిచి 1894లో నెల్లూరు చేరి స్థిరపడ్డారు .నవాబు పేటలో పెన్నా తీరం లోని వేమూరి వారి మామిడితోటలో ఆశ్రమ౦ ఏర్పాటు చేసుకొని ఉన్నారు అందులో ఒక పెద్ద చచక్కపెట్టే ,కలప తో ఉన్న కుటీరం .శిష్యబృందం ఏర్పడింది అన్ని సిద్ధులూ సాధించినా ప్రదర్శించలేదు .లీలలు మహిమలు చూపారు .యువనామ సంవత్సర పుష్య బహుళ అమావాస్య శుక్రవారం 24-1-1936 న 72వ ఏట శిష్యుడు హరిహరానంద స్వామి ఈశావాస్యోపనిషత్ పఠించటం పూర్తికాగానే పద్మాసనం వేసుకొని మూడుసార్లు ఓంకారం బిగ్గరగా ఉచ్చరించి దేహత్యాగం చేశారు .వెంకటగిరిలో కైవల్య నదీ తూర్పు తీరాన సమాధి చేశారు .ఆరాధనోత్సవాలు ఘనంగా జరుపుతారు .
49-రాజయోగి పగిడ్యాల కృష్ణ బ్రహ్మేంద్రస్వామి -1850-1947
రంగారెడ్డి జిల్లా పరిగి తాలూకా గండ్వీడు మండలం పగిడ్యాల లో భాగమ్మ రామప్ప దంపతులకు 1850లో కృష్ణయ్య పుట్టాడు .నాలువతరగతి లోనే చదువు ఆపేసి,తండ్రి కుల వృత్తి కమ్మరం లో సాయం చేసేవాడు .12వ ఏట తల్లీ తండ్రీ చనిపోయారు .అన్నగారు చిన్నయ్య అతడిపెళ్లి నరసమ్మతో జరిపించాడు .
జన్మ రాహిత్యం పై కోరిక కలిగి యాలాలలో దొడ్డప్రభువును ఆశ్రయించి,మంత్రోపదేశం యోగ సాధన నేర్చి ,సన్యాసం స్వీకరించి కృష్ణ బ్రహ్మేంద్ర స్వామి దీక్షానామం పొందాడు .గురువు ఆజ్ఞతో మునుల గుట్ట , చన్నరాయని గుట్ట ,దోనగుట్ట ,యానగొ౦ది గుట్ట ,కోసగి కాళికాలయాలలో తపస్సు చేశాడు .12ఏళ్ళు దేశ సంచారం చేసి యోగులవద్ద యోగ రహస్యాలు గ్రహిస్తూ అష్ట సిద్ధులు వశం చేసుకొన్నాడు .హిందూ ముస్లిములు ఆయన్ను సేవించేవారు .దౌలతాబాద్ వేంకటేశ్వరాలయం లో ప్రతి ఏడూ ,మాల,మాదిగ కులాలకు చెందిన పేద లకు వివాహాలు ఉచితంగా జరిపించేవారు కృష్ణ బ్రహ్మేంద్రస్వామి .97సంవత్సరాల సార్ధక జీవితం గడిపి 31=8-1947సర్వజిత్ నిజ శ్రావణ పౌర్ణమి ఆదివారం బ్రహ్మ రంధ్రం భేది౦చు కొని దేహత్యాగం చేశారు.మాఘ శుద్ధపంచమినాడు ఆరాధనోత్సవాలు జరుగుతాయి
50-పలుగు రాళ్ళపల్లి గోవిందస్వామి -1650-1750
కడపజిల్లా బద్వేలు –పోరుమామిళ్ళపల్లి దారిలో పలుగు రాళ్ళపల్లి లో 17-18శతాబ్దిలో వైదిక బ్రాహ్మణ కుటుంబం లో గోవిందస్వామి పుట్టాడు .యాదాటి రామచంద్రభట్టు పార్వతమ్మ తలిదండ్రులు .శిశువుగా ఉంటూనే మహత్తులు చూపేవాడు .ఉయ్యాలలో పడుకొని ఉంటె ఘటసర్పం పడగ గొడుగులాగా పట్టింది .ఊరి చెరువు దగ్గర బంకమట్టితో పళ్ళెం చేసి ,పంచరంగుల గులకరాళ్ళు శివ పంచాయతనం గా అమర్చి ,సుద్ద పొడి విభూతిగా ,కావిరాళ్ళ పొడి కు౦కుమగా ,గడ్డి వెన్నులు అక్షతలుగా ,అల్లిపూలు పుష్పాలుగా చెరువు నీరు అభిషేక జలంగా ,పిచ్చుక గూడు కొబ్బరికాయగా ,తుంగ గడ్డలు నైవేద్యంగా అర్పించి తీర్ధ ప్రసాదాలు భక్తులకు పంఛి బాధలు పోగొట్టేవాడు.
పెద్దవాడై తండ్రి వద్ద స్మార్తం ,గరుడాద్రి యాదయ్య వద్ద మంత్రోపదేశం పొంది ముచుకుందా గుహలో సాధన చేశాడు .లక్ష్మమ్మను పెళ్ళాడి సంసారం చేస్తూ ,తపస్సు చేస్తూ రుతంభరం మొదలైన విద్యలు నేర్చాడు .కాశీ రామేశ్వర యాత్రకు వెళ్ళే వారికి ఇంట్లోఆతిధ్య మిస్తూ,పది మందికివండినపదార్దాలు వదమందికి సరిపోయేలా చేస్తూ మహిమలు చూపేవాడు .1750లో సుమారు శతమానం జీవించి మాఘశుద్ధ పౌర్ణమి నాడు గోవిందస్వామి జీవసమాధి చెందారు .ముందే కాశీ నుంచి ఒక లింగాన్ని తెచ్చుకొని ఉంచగా, మునిమనవాడు యాదాటి నరసయ్య గోవిందస్వామిమఠం ఆవరణలో ముత్తాత తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్టించి ,ఆలయం నిర్మించాడు .శివలింగం పేరు నర్మదేశ్వరుడు. అమ్మవారు మీనాక్షీ దేవి .మాఘ శుద్ధ త్రయోదశించి అమ్మవారికి అయ్యవారికి వైభవంగా కల్యాణోత్సవం ,మాఘ పూర్ణిమ నుండి పాడ్యమిమివరకు గోవిందస్వామి ఆరాధనోత్సవం ఘనంగా చేస్తారు .
51-ఆచలయోగి రామడుగు శివరామ దీక్షితులు -1690-1791
నల్గొండ జిల్లా నారాయణ పేట సంస్థానం లో రామడుగు విశ్వనాధ శాస్త్రి నిర్మలాంబ , వైదిక బ్రాహ్మణ దంపతులకు 1690లో శివరామ దీక్షితులు పుట్టాడు .వేదాలు య జ్ఞ,యాగాలు బోధలు మోక్షాన్ని ఇవ్వవు అని గ్రహించి ,ఆత్మజ్ఞానం కోసం దేశ సంచారం చేస్తూ ,ఒక దొమ్మరి గడసాని లక్ష్య శుద్ధికి అబ్బురపడి ,ఆమె గురువైన శ్రీధరులను దబ్బాకుపల్లిలో వటవృక్షం క్రింద తపస్సులో ఉండగా దర్శించాడు .ఇతనికోసమే అయన దేహత్యాగం చేయకుండా ఉన్నాడు .మూడురకాల తీర్దాలు ప్రసాదాలు ఇచ్చి తారకం అమనస్కత బోధించాడు .మూడు దీక్షలిచ్చాడు .నాలుగు మహావాక్యాలు ,వాటి శబ్దార్ధాలు బోధించి ద్వాదశి పంచదశి షోడశి మంత్రాలు అర్ధాలు బోధించి వాటిని ప్రచారం చేయమని ఆదేశించి పాదుకలు అనుగ్రహించారు .21వ రోజు గురువు దేహం చాలించాక ఉత్తరక్రియలు జరిపి స్వగ్రామం చేరి అమనస్కత ప్రచారం చేశాడు దీక్షితులు .’’శివరామ దీక్షితీయం ‘’అనే బృహత్ గ్రంథం అచల సిద్ధాంతం వివరిస్తూ రాశారు 101ఎ ఏళ్ళు జీవించి 23-11-1791విరోధి కార్తీక శుద్ధ శనివారం దేహం చాలించారు .
52-యోగానంద నరసింహస్వామి -1798-1899
కర్నూలు జిల్లా మార్కాపురం తాలూకా గుట్టల ముమ్మిడివరం లో అప్పయ్య లక్ష్మమ్మ అనే మధ్యతరగతి దంపతులకు మూడవ సంతానంగా 1799లో లక్ష్మీ నరసింహ మూర్తిపుట్టాడు .తీర్ధయాత్రలు చేస్తూ దత్తాత్రేయ సంప్రదాయానికి చెందిన రామావదూతను దర్శించి ,ఆయన పెట్టిన పరీక్షలకు తట్టుకొని రాజ వశీకరణ ,యజ్ఞసిద్ధి అష్టాక్షరీ పంచాక్షరీ మంత్రాలు నేర్పుతాను అంటే తనకు ముక్తిమార్గం తప్ప ఏదీ వద్దు అని చెప్పాడు .సరే అని అచలం బోధించి రామతారకమంత్రం రామాయణ సారం బోధించి ‘’యోగానందుడు ‘’పేరు పెట్టి ,ఇంటికి వెళ్లి సాధన చేయమని పంపాడు .వెళ్ళకుండా అక్కడే ఉంటూ ,గురువు ఆదేశం మేరకు 27మండలాలు అష్టాంగయోగ సాధన చేశాడు .చండాముని అనే తాపసి మరికొన్ని మంత్రాలు ఉపదేశించాడు .వీటితో అద్భుతాలు ప్రదర్శించేవాడు .కలలో గురువు ఇచ్చిన ఆదేశాను సారం ‘’ముక్తికాంత ‘’గ్రంథంతోపాటు 15 గ్రంధాలు రాశాడు .సోనీ పురం చేరి తపస్సు చేస్తూ జ్ఞానబోధ చేస్తూ గడిపాడు .
దివ్యవాణి ఆదేశం తో మన్నెం కొండలలో స్థిరపడి తపస్సు చేస్తూ ,1-5-1899 వికారి చైత్రబహుళ షష్టి సోమవారం ఉదయం 101వ ఏట దేహం చాలించారు.చైత్ర మాసంలో ఆరాధనలు జరుగుతాయి .
53-తాండూరు సూఫీయోగి అబ్దుల్ కరీం షా వలీ -1870-1947
ఆఫ్ఘనిస్తాన్ లో షాజీ గ్రామం లో 19వశతాబ్ది మధ్యలో పుట్టిన అబ్దుల్ కరీం షావలీ ,బాల్యం నుంచే చదువు ఆటపాటలపై విముఖత చూపిస్తూ గ్రామం బయట ధ్యానం తో ,రాత్రిళ్ళు అడవుల్లో తపస్సు చేసేవాడు .12వ ఏట పినతండ్రి సయ్యద్ వలీ మహమ్మద్ దత్తత తీసుకొని ,నిజాం లోని తా౦డూరుకు తీసుకు వెళ్లి 14వ ఏట పెళ్లి చేశాడు .
కొంతకాలానికి సయ్యద్ సుల్తాన్ ఆలీషా అనే మహాత్ముడు దేశ సంచారం చేస్తూ ఎఖేలి గ్రామం వచ్చాడు .ఈయన వద్ద ఉపదేశం పొందాలని షా వలీ భావించాడు .ఆయన ఆడంబరాలు చూసి అనుమానించి ఆయన సర్వజ్ఞత్వం అర్ధం చేసుకొని భక్తుడు గా మారాడు .ఆయన ఏకాంతం లోకి తీసుకు వెళ్లి శిరసుపై చేతులుంచి.ఆలింగనం చేసుకొని నిండుగా ఆశీర్వదించాడు .ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గి పరమాత్మ నిష్ఠ పెరిగింది .ఒకసారి గురువు ఆయన గురువు ఆరాధనోత్సవాలకు హైదరాబాద్ వెడితే శిష్యుడూ అక్కడికి వెళ్లి ,ఆయన ఆదేశం మేరకు గుల్బర్గా షరీఫ్ కు వెళ్లి అక్కడ సుప్రసిద్ధ ముస్లిం యోగి ఖాజాబండ నమాజు దర్గా లో రెండేళ్ళు సేవ చేయాగా ఒకరోజు ఆయన ప్రత్యక్షమై ఆశీర్వదించి గురువు దగ్గరకు వెళ్ళమని చెప్పాడు .అలాగే చేసి ఆయన ఆజ్ఞ తో లాలె చారు ,పాకూ పఠాన్ వెళ్లి అక్కడ షేక్ ఫరీద్ షక్కర్ గంజ్ అనే మహాత్ముడిసమాధి దర్శించిఅక్కడ రోగుల ఆర్తులకు సేవ చేయగా షక్కర్ గంజ్ ప్రత్యక్షమై దీవించి ఇంటికి పంపాడు .మళ్ళీ హైదరాబాద్ లో గురువు ను దర్శించి ,ఎఖేలీ చేరాడు .గురువు సిద్ధిపొందాడు .శిష్యులకోరికపై వలీ షా పీఠాధిపతిఅయ్యాడు .తాండూరు బయట స్థలం కొని విశాలమైన ఇళ్ళు వసతులు కల్పించిగురువు ఆరాధన వైభవంగా జరిపించాడు .నలుగురు భార్యలతో సంసారం చేస్తూ రాజయోగిగా ఉంటూ పదిమందికొడుకులు ఇద్దరు కూతుళ్ళకు జన్మ ఇచ్చాడు .
1946లో తీవ్రంగా జబ్బుపడి అయిదు నెలలు బాధపడి 26-12-1947సర్వజిత్ మార్గశిర శుద్ధ పాడ్యమి శుక్రవారం 77వ ఏట ఆ రోజునే చనిపోతున్నట్లు ముందే ప్రకటించి దేహం చాలించారు .తాండూరు సమాధి హిందూ ముస్లిం లందరికీ యాత్రాస్తలమే .
54-చాయాపురుష యోగి దీపాల దిన్నె పాలెం పాటిబండ్ల వీరయ్య -1867-1922
గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా దీపాల దిన్నె పాలెం లో వ్యవసాయం చేసే పాటి బండ్ల బాపయ్య బాపమ్మదాంపతులకు 1867ప్రభవ నామ సంవత్సరం లో మూడవ సంతానంగా వీరయ్య పుట్టాడు. బాల్యం లోనే వేదాంతం జ్ఞాన తృష్ణ అలవాటయ్యాయి .వీధిబడిలో చదివి స్వయం కృషి తో తెలుగు సంస్కృతం లలో పాండిత్యం సాధించాడు .రెండుభాషల్లోనూ గ్రంథాలు రాశాడు .
సత్తెనపల్లిలో ఫీరోజి మహర్షి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు విని శిష్యుడై ,మంత్రోపదేశం పొంది సాధన చేసి సిద్దుడయ్యాడు .సాత్విక లక్షణాలు అలవడి ,ఆత్మ శక్తి పెరిగింది .మళ్ళీ గురువును చేరి ఆధ్యాత్మిక రహస్యాలు గ్రహిస్తూ కవితా సాధన చేశాడు .గురువు గొప్పతనాన్ని వర్ణిస్తూ కీర్తనలు రాసి పాడుతూ ఆయన భావాలను వ్యాప్తి చేస్తూ విరాళాలు స్వీకరించి గురువుగారి మఠానికిఅంతరాలయం ముఖమండపం విమాన గోపురాలు కట్టించాడు .నిత్యపూజకోసం భక్తులనుంచి అయిదు ఎకరాలు సంపాదించాడు .ఒకసత్రం బావి ఏర్పాటు చేశాడు .ఆయుర్వేదమూ నేర్చి వైద్య సేవ చేశాడు .చాయాపురుష లక్షణం లో నిష్ణాతుడయ్యాడు 9-11-1922సాయంత్రం దుందుభి కార్తీక బహుళ పంచమి గురువారం 55వ ఏట భగవన్నామం చేస్తూ ,సంపూర్ణ వివేకం తో బ్రహ్మైక్యం చెందారు .ఫిరోజీ మహర్షి సమాధికి ఎదురుగా స్వామి సమాధి నిర్మించారు
55-మిట్టపాలెం నారాయణ స్వామి -1750
నెల్లూరు జిల్లా కనిగిరి తాలూకా కోవలం పాటి మిట్టపాలెం లో కొమ్మినేని వెంకటరామయ్య మహాలక్ష్మమ దంపతులకు కొండయ్య పుట్టాడు .చిన్ననాటి భక్తీ క్రమంగా పెరిగి ,తండ్రి చనిపోయాక తల్లితో తీర్ధయాత్రలు చేస్తూ ,పురాణకాలక్షేపాలు చేస్తూజీవనం సాగించాడు .తల్లి చనిపోగా తమ్ముడి బాధ్యత పెద్దక్కకు వదిలేసి ,నారుకొండలో ఉంటూ పిచ్చివాడు అనుకొన్నవారికి బుద్ధులు బోధిస్తూ తిరుగుతూ ,మహిమలు అద్భుతాలు చూపిస్తూ ఉండగా ఒక మహనీయుడు వచ్చి నాలుకపై విభూతి చల్లి మంత్రోపదేశం చేయగా ,నారాయణ మంత్రం జపిస్తూ నారాయణ స్వామిగా ప్రసిద్ధి చెంది బ్రహ్మంగారి మాటలు ఫలిస్తాయని ప్రకటించి తానూ త్వరలో జీవసమాధి చెందుతాననని చెప్పాడు .
10వ రోజున నాగ ప్రతిష్ట ,పోలేరమ్మ ప్రతిష్ట జరుగుతుందని చెప్పి ,శిష్యులను పిలిచి భజనలు కీర్తనలు పాడమని చెప్పి పాదుకలు బెత్తం ధరించి సమాధి ప్రవేశం చేసి ,బండరాయితో మూసేయించారు .సమాదినుంచే భక్తులకోర్కెలు తీరుస్తారనే నమ్మకం సమాధి వద్ద దీపాఆధనలు జరుగుతాయి .అక్కడ అయిదువారాలు నిద్రిస్తే దీర్ఘ రోగాలు పోతాయని నమ్మకం .భద్రాయపాలెం లోని ఈ సమాధి గొప్ప యాత్రాస్థలమైంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-9-20-ఉయ్యూరు