ప్రపంచ దేశాల సారస్వతం
203-అమెరికాదేశ సాహిత్యం -19
20వ శతాబ్ది సాహిత్యం -11
దక్షిణ దేశ ఫిక్షన్
రెండవ ప్రపంచ యుద్ధానంతరం దక్షిణాది రచయితలు ఫాక్నర్ వారసత్వాన్ని ప్రేరణగా పొందారు .ముగ్గురు మహిళలు ఇడోరావెల్టి , ఫ్లానరి ఓకాన్నోర్ ,కార్సన్ మెకల్లస్ లు అసహజ వికృత అంటే గ్రోటోస్క్ విధానం లో దక్షిణాదిసాహిత్యాన్ని సుసంపన్నం చేశారు .కానర్ మాత్రం దక్షిణాది ప్రొటెస్టెంట్ లో రోమన్ కేధలిక్ గా గొప్ప కామెడీని నైతికసంబద్ధత (మోరల్ ఇ౦కా గ్రుటి)శైలిలో చిన్న కథలను ప్రతిభా వంతంగా రాసింది .గోప్పస్టైలిస్ట్ అయిన వెల్టి తన మొట్ట మొదటి కథాసంపుటులు ‘’ఎ కర్టెన్ ఆఫ్ గ్రీన్ -1941,ది వైడ్ నెట్ అండ్ ది స్టోరీస్ -1943 లతో మహా కీర్తి పొందింది .లూజింగ్ బాటిల్ అనే నవల 1970,పులిట్జర్ ప్రైజ్ పొందిన నావేల్లా –దిఆప్టిమిస్ట్ స్ డాటర్ 1972,కూడా రాసింది .మెక్ కల్లర్ ‘’ది హార్ట్ ఈజ్ ఎ లోన్లీ హంటర్ ‘’-1940 నవల సుదూర సౌత్ లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారం గారాసి చదువరుల హృదయాలు కొల్లగొట్టింది .రిఫ్లెక్షన్స్ ఇన్ ది గోల్డెన్ ఐ -1941,ది మెంబర్ ఆఫ్ ది వెడ్డింగ్ -1946,ది బాలడ్ఆఫ్ ది శాడ్ కేఫ్-1951,నవలలు రాసింది .ఈమూడూ సినిమాలుగా వచ్చాయి .ఎలిజబెత్ స్పెన్సర్ –దిసదరన్ వుమన్ -2001.రేనాల్డ్స్ ప్రైస్-ఎలాంగ్ అండ్ హాపీ లైఫ్-1961 కైటే వైడేన్ నవల -1986కూడా ఈకాలపు రచయితలే .దక్షిణాది గొంతుకు ప్రాధాన్యం పొందిన ట్రూమన్ కపోటే-అదర్ వాయిసెస్ అండ్ అదర్ రూమ్స్ -1948,లో దికోల్డ్ బ్లడ్1965లో నూ రాసి పబ్లిష్ చేసింది .టాం ఉల్ఫ్ ,నార్మన్ మైలర్ లు డాక్యుమెంటరి రియలిజం అనే కొత్త జర్నలిజం సృష్టించారు .ఫిక్షన్ లో వాడే టెక్నిక్ లన్నీ దీనిలో వాడటం ప్రత్యేకత .
విలియం స్టిరాన్-మొదటి నవల లై డౌన్ ఇన్ డార్క్ నెస్-1951లో ఫాక్నర్ ప్రభావం బాగా పండి పోయినట్లు కనిపిస్తుంది .తర్వాత రాసిన రెండు వివాదాస్పద నవలలు సమాజం లో చీకటి కోణాలను చిత్రించాయి-అవే- ది కన్ఫెషన్స్ ఆఫ్ నాట్ టర్నర్ – 1967,లో పూర్తిగా బానిసల తిరుగుబాటు ఉంది ,సోఫీస్ చాయిస్ నవల -1979లో హాలోలోకాస్ట్ హారర్ చిత్రీకరణ ఉంటుంది .ఫాక్నర్, మార్క్ ట్వేన్ ల ప్రభావం తో విలియం హంఫ్రి రెండు శక్తివంతమైన నవలలు టెక్సాస్ ఆధారంగా రాశాడు-అవే-హోం ఫ్రం ది హిల్స్-1958,ది ఆర్డ్ వేస్-1965.వాకర్ పెర్సి –దిమూవీ గోయర్-1961,దిలాస్ట్ జెంటిల్మన్-1966 లతోసదర్న్ ఫిక్షన్ కు గొప్ప ఊపు తెచ్చాడు .వీటిలోని మ్యూజింగ్ ఫిలసాఫికల్ స్టైల్ గోధిక్ శైలికి భిన్నంగా తర్వాత రచయితలను ప్రభావితం చేసింది .ఈ ప్రభావం తో రిచర్డ్ ఫోర్డ్ –దిస్పోర్ట్స్ రైటర్ 1986లో ,సీక్వెల్ గా ఇండి పెండేన్స్ డే-1995లో కదిలించేట్లు రాశాడు .అదే ధోరణిలో పీటర్ టైలర్అనే సోషల్ రియలిస్ట్ గొప్ప కథా కథన విధానం లో అభివృద్ధికి దోహదపడేట్లు గతకాల వైభవ ప్రస్తుతిగా –ది ఓల్డ్ ఫారెస్ట్-1985 ఎ సమాన్స్ టు మెంఫిస్-1986లో రాశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-9-20-ఉయ్యూరు ,