ప్రపంచ దేశాల సారస్వతం
203-అమెరికాదేశ సాహిత్యం -20
20వ శతాబ్ది సాహిత్యం -12
ఆఫ్రో అమెరికన్ సాహిత్యం
నల్లజాతి రచయితలు రిచార్డ్ రైట్ సాంఘిక నిరసన కోప మార్గానికి భిన్నమైన దాన్ని అనుసరించారు. జేమ్స్ బాల్డ్విన్ ,రాల్ఫ్ ఎల్లిసన్ లురైట్ ప్రభావితులు .నల్లవారి జీవితాల సంక్లిష్టత పై వివాదాత్మక వ్యాసాలూ రాశారు .బాల్ద్ద్విన్ ‘’గో టెల్ ఇట్ ఆన్ ది మౌంటేన్ ‘’-1953 అనే గొప్ప నవల రాశాడు .హీర్లాం ప్రపంచం అందులో బ్లాక్ చర్చి లతో తన అనుభ వాలకు అద్దం పట్టాడు .అబ్సర్దిక్ హ్యూమర్, జానపద మిశ్రమం తో రియలిజం దట్టించి రాల్ఫ్ ఎల్లిసన్ ,పూర్తిగా నల్లవారి జీవితం వలసలు ,ఘెట్టో సంఘటనలు వర్ణిస్తూ జాతీయత కమ్యూనిజం బోధిస్తూ నవలలు రాశాడు .1952లోఇతడు రాసిన ‘’ఇన్విజిబుల్ మాన్ ‘’నవల పోస్ట్ వార్ సాహిత్యం లో ఉ త్కృష్టమైనదని చాలా మంది భావిస్తారు .
తర్వాత ఇద్దరు ఆఫ్రికన్ అమెరికన్ మహిళలు గొప్ప సాహిత్యం పండించారు .అందులో టోరి మారిసన్ –ది బ్లుయేస్ట్ ఐ -1970,సులా -1973,సాంగ్ ఆఫ్ సాల్మన్ -1977,బిలవ్డ్-1987,జాజ్ -1992,పారడైజ్ -1998నవలలలో సృజనాత్మక ఫిక్షన్ ,మాజిక్ రియలిజం తో పద్యానుభూతి కలిగించింది .వైవిధ్య జానపద శైలులను ప్రయోగించి ప్రభావితం చేసింది .చాలా పదబంధాలు సృష్టించింది బ్లాక్ హిస్టరిలో .1933లో నోబెల్ ప్రైజ్ పొందింది కూడా .ఆలీస్ వాకర్ చాలా కవిత్వం రాసి ,సివిల్ రైట్స్ ఉద్యమం పై 1976లో మెరిడియన్ నవలరాసి ,బ్లాక్ ఫెమినిస్ట్ నవల ‘’ది కలర్ పర్పుల్ ‘’-1982లో రాసి పులిట్జర్ బహుమతి అందుకొన్నది .
ఈ కాలపు పురుష ఆఫ్రికన్ అమెరికన్ రచయితలలో ఇస్మాయిల్ రీడ్ కామిక్ టెక్నిక్ లతో ,జేమ్స్ అల్లాన్ మెక్ ఫెర్సన్ కథలు ,చార్లెస్ జాన్సన్ –ఆక్స్ హీర్దింగ్ టేల్స్-1982 ది మిడిల్ పాసేజ్ -1990నవలల లో చారిత్రాత్మక ఊహాత్మక ఎల్లిసన్ బాల్డ్విన్ శైలిలో రాసి పేరుపొందారు .కాల్సన్ వైట్ హెడ్ –ప్రయోగాత్మక టెక్నిక్, జానపద రీతిలను ‘’ఇంట్యూషనిస్ట్’’-1999,జాన్ హెన్రి డేస్-2001లో ప్రయోగించాడు .
కొత్త ఫిక్షన్ విధానాలు
రెండవ ప్రపంచయుద్ధ దురాగతాలు ,అమెరికన్ కోల్డ్ వార్,అటామిక్ బాంబ్ భీభత్సం ,విలక్షణమైన వినియోగ సంస్కృతీ ,1960లో జాతులమధ్య గొడవలు చూసి రచయితలు వాస్తవికత ఫిక్షన్ కు ఉన్న సాంఘిక బాధ్యత నుండి తప్పించుకోరాదు అని గ్రహించారు .కనుక రొటీన్ కు భిన్నంగానవల కథ ఫిక్షన్ ఉండాలని భావించారు .అందుకే పోస్ట్ మోడరన్ నవలలను విలియం గాడిస్,జాన్ బార్త్,జాన్ హాక్స్ ,డోనాల్డ్ బార్తేల్మి ,ధామస్ పించాన్ ,,రాబర్ట్ కూవర్ ,పాల్ఆస్టర్,జాన్ డెలిలో లు రియాలిటీ కే పెద్ద పీట వేసి చాలా శక్తివంతంగా ఫిక్షన్ రాశారు .దగా ,మానసిక అపసవ్యాలను వాడుకున్నారు .తమ నవలలనువాళ్ళు కళాకృతులుగా,ఐరానిక్ రియలిస్టిక్ టెక్నిక్ లుగా భావిచారు .దీనితో హింస పెంచారు .డాక్యుమెంటేషన్ లేక ఫాంటసి పెరిగింది .నార్మన్ మైలర్ ,జాయిస్ కరోల్ ఓట్స్ లు ఈ కొత్త దృక్పధాలకు పెర్ఫెక్ట్ ఉదాహరణలు .
‘’ది నెకేడ్ అండ్ ది డెడ్’’-1948 నవలలో మైలర్ డాస్ పాధోస్ సోషల్ ప్రొటెస్ట్ శైలిని అనుసరించాడు .రియలిజనికి ఉన్న పరిమితులను దాటి సర్రియలిజం ఫాంటసి ని ‘’ఆన్ అమెరికన్ డ్రీం -1965,వై ఆర్ వుయ్ ఇన్ వియత్నాం -1967లో దట్టించాడు .’’ నాన్ ఫిక్షన్ ఫిక్షన్ ‘’లేక ఫిక్షన్ ఆజ్ హిస్టరీ విధానం ‘’ది ఆర్మీస్ ఆఫ్ దినైట్ ,దిమయామి అండ్ ది సీజ్ ఆఫ్ చికాగో -1968నవలలలో మైలర్ తన కొత్త గొంతును ఆవిష్కరించాడు కామిక్ గాఉన్నా పూర్తి బౌద్ధికమైనవి .ట్రూ లైఫ్ నవల పులిట్జర్ బహుమతి పొందిన ‘’ది ఎక్సి క్యూషనర్స్ సాంగ్’’-1979, అతడు ఫిక్షన్ లోకి మళ్ళాక చాలాప్రతిభావంత౦ గా ‘’హార్లోట్స్ ఘోస్ట్ ‘’-1991,నవల సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ పై రాశాడు ..ఇతని చివరి నవలలు –జీసెస్ క్రైస్ట్ –ది గాస్పెల్ అకార్డి౦గ్ టుసన్,-1997,అడాల్ఫ్ హిట్లర్—ది కాజిల్ ఇన్ ది ఫారెస్ట్ -2007లలో పైవిషయమే వర్ణితం .
జాయిస్ కరోల్ ఓట్స్ –ఎ గార్డెన్ ఆఫ్ ఎర్త్లి డిలైట్స్1967,దెం-1969లలో సహజసిద్ధంగా హింసాత్మక నగర విషయాలు –అంటే డెట్రాయిట్ రయట్స్,లో ప్రతిబింబింప జేసింది .వీటిని పండించి ,సర్రియలిజం లోకి వెళ్లి ‘’వండర్ లాండ్ ‘’1971లో ,గోధిక్ ఫాంటసి ని –బెల్లీ ఫ్లూయర్ 1980 రాసింది .న్యూయార్క్ లో తన యవ్వన జీవితాన్ని అంతకు ముందే 1986లో ‘’మార్యా ‘’లో రాసింది .ఆమె తర్వాత రచనలలో -బ్లాండే నవల -2000,లో మేరిలిన్ మన్రో ఫిక్షనల్ బయోగ్రఫీ రాసింది .మైలర్ ,ఓట్స్ మాత్రం రియాలిటి ప్రతిఫలమైన నవలకు లొంగక .శక్తి వంతమైన కొత్త ఫిక్షన్ విధానాల వేటలో పడక తప్పలేదు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-10-20-ఉయ్యూరు