అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -11
8-మళ్ళీ భూగర్భ లోకం లోకి -2
టెలోస్ లో స్నేహవతావరణం ఉన్నా ,సాహసాలు కూడా ఎక్కువే .టౌన్ బయట అడవి అందులో అడవి జంతువులూ ఉంటాయి .ఇక్కడ చాలా జాతులవారున్నారు ,ఎవరి తరహాజీవితం వారిదే .వాళ్ళ ఆచార వ్యవహారాలూ వేరే అర్ధం చేసుకోవటం కష్టం కూడా .ఐతే మిగిలినవాళ్ళు పట్టించుకోరు .ఇక్కడ మానవ స్వాతంత్ర్యం ఉంటుంది .ఇదే అన్నిటికన్నాముఖ్యం అన్నాను అమ్మమ్మతో ..’స్వేచ్చ మంచిదే కాని ,ఇతరులు కూడా ఉన్నప్పుడు పూర్తి స్వేచ్చ ఇబ్బందికరం .నాయనా అనేక రకాల స్వేచ్చలున్నాయి టిం.ఇక్కడ మీకు కొన్ని నిబంధనలు ఉండి ఉంటాయి అవేమిటోతెలుసా నీకు ?’’అమ్మమ్మ ప్రశ్నించింది .’’అవి తరువాత తెలుస్తాయిలే .వాటి గురించి ఇప్పుడు చర్చ అనవసరం .భూమిపై ఉన్న లైబ్రరీలకంటే, ఇక్కడ మనకు ఊహించవీలుకాని అద్భుతమైన లైబ్రరీలున్నాయి.అవి ఒక ఆటగా అనిపిస్తాయి .వివరించి చెప్పటం కష్టం అమ్మమ్మా చూస్తేనే కాని నీకు తెలీదు .అవి నీకు బోర్ కొట్టి౦చవని నాదీ హామీ .టాక్సీలో లైబ్రరీకి వెళ్ళటానికి డబ్బు ఖర్చుకాదు తేలికకూడా ‘’ అన్నాను ,
‘’అద్భుతంరా కన్నా .రేపు మనం టూర్ ప్లాన్ చేద్దాం .అప్పుడు నాకు ఇక్కడి విషయాలెన్నో తెలుస్తాయి .ముందు నా ఇంటికి వెళ్లి అక్కడ గార్డెన్ చూడాలి ‘’ అన్నది .’’అబ్బో పెద్ద టూర్ ప్లాన్ లోనే ఉన్నావ్ ‘’అని నవ్వి ముందు నా ఇంటికి వెడదాం .అక్కడ ఇళ్ళు దగ్గర దగ్గరగా ఉంటే ,ఇక్కడ ప్లాన్ ప్రకారం దూర దూరంగా పెద్దగా,విశాలంగా ఉంటాయి.గార్డెన్ ఉంటుంది నీకు కావాల్సింది నువ్వు పండించుకో వచ్చు చేతకాకపోతే సహాయం చేస్తారు .నాన్సీ కి వంట ఎలా చేయాలో చెప్పాను .మన ఇంటికి వెళ్లి లంచ్ ,రాత్రికి డిన్నర్ కూడా చేద్దాం ‘’అన్నాను .ఇంటికి చేరి ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకొన్నాం ..
9-టెలోస్ ,పరిసరాల టూరు
‘’అమ్మా టైమెంత’’అంటూ ఆవలిస్తూ నాన్సీ బెడ్ మీద నుంచి కూతురు మాట వినిపించింది ..’’మన వాచ్ లు ఇక్కడ పని చేయటం లేదు .రాత్రి మనం నిద్ర పోయే సరికి ఇంకా చీకటి పడలేదు .చాలాసేపు నిద్ర పోయి ఉంటాం .లేచే టైం అయింది .బయట చూసి తెలుసుకో వాల్సినవి చాలా ఉన్నాయి .నీ స్కూలు ఎక్కడో ఎప్పుడు మొదలు పెడతారో తెలియాలి .నీకు ఇక్కడ మంచి కిన్దర్ గార్టెన్ స్కూల్ ఉంటె బాగుంటుంది .అసలిక్కడ పగలు రాత్రికి తేడా తెలీటం లేదు .అందుకని ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు లేవాలో అర్ధం కావటం లేదు ‘’అంది నాన్సీ .’’అమ్మా బ్రేక్ ఫాస్ట్ విసుగ్గా ఉంది నాకు మామూలుపాలు సీరియల్ కావాలి .నువ్వు కాఫీ కాచి తాగావా ??’అన్నది పిల్ల .’’ఇక్కడ స్టవ్ లేదు .కాని లేచేసరికే లోకల్ ఫుడ్ ప్లేట్ లో రెడీ గా ఉంది .టిం చేశాడేమో .చూడటానికి బాగానే ఉంది .బ్రెడ్ కూడా ఉంది ‘’అన్నది .’’నాకు చీజ్ ఇష్టం కదా ఉందా ?’’’’అక్కడ ఉన్నది తినమ్మా ముందు .తర్వాత పూల్ లో స్నానం చేద్దాం ‘’అన్నది .
నాన్సీ కాస్త నిట్టూర్చింది .అమెరికాలాగా లేదిక్కడ .సియాటిల్ కు ఇక్కడికి ఉన్న విప్లవాత్మకమైన తేడా ఎల్లిస్ కు ఎప్పుడు తెలుస్తుందో ఏమో పిచ్చిపిల్ల .ముందు దానికి పాలు చీజ్ సీరియల్ చాకలేట్ డ్రింక్ కావాలి సియాటిల్ లో లాగా .నాన్సీకి రోజూ తాగే కాఫీ లేదు బ్రేక్ ఫాస్ట్ కూడా లేదు .నిన్న సాయంత్రం అమ్మమ్మ తనతో స్వీడెన్ నుంచిన తెచ్చుకున్నదాన్నే అందరు తిన్నాం. భలేగా ఉందది .’’మీరు భూమిపై చూసినవాటికంటే ఇక్కడి విషయాలు చాలా తేడా గాఉంటాయి ‘’అంటూ నవ్వుతూ సంచీనిండా లోకల్ ఫుడ్ తో లోపలి వచ్చాను .’’సముద్రం లో షిప్ రెక్ అయితే ,మనదగ్గరున్నది తిని ఎలా ఉంటామో ఇక్కడా అంతే.అలవాటు పడాలి .ఇక్కడివి తింటే మీకు అక్కడివి ఇక గుర్తుకు రానే రావు .నా విషయం లో కూడా అలాగే జరిగింది .అక్కడ మనం తిన్న అన్నీ మర్చే పోయాను ఇక్కడ.’’తమరు నోరు మూస్తారా ? నేను అలవాటు పడతా .పిల్లా అలవాటు పడుతుంది .కానీ ఇక్కడికి వచ్చి తప్పు చేశానేమో అని నిన్ను కడిగి పారేస్తూనే ఉంటా. మన ఇష్టానిస్టాలు పిల్లమీద రుద్దు తున్నామేమో ఆలోచించావా ?అంది నాన్సీ .
నాకు ఎక్కడో మండి,కోపం తన్నుకొచ్చి ‘’ఇది స్వర్గం నాన్సీ .ఇక్కడ ఏం తిన్నామనికాదు,నీలోపల ఏముందో అన్నది ముఖ్యం .అంటే నా ఉద్దేశ్యం ప్రేమ సంతోషం అందం స్నేహం ,జాలికరుణ దయ ఇక్కడ ముఖ్యం .ఇవన్నీ నా కంటే బాగా తెలియ చెప్పటానికి ఇక్కడ మనుసులున్నారు .అమ్మమ్మ బయట కూర్చుని ఉంది మనం ఇప్పుడు త్వరగా టూర్ కి వెళ్ళాలి ‘’అన్నాను .
నాన్సీ గొణుగుకున్నా,తయారై నేను ఏర్పాటు చేసిన హోవర్ క్రాఫ్ట్ ‘’లోకి ఎక్కింది .అందరం ఎక్కగానే అది కొద్దిఎత్తుకు యెగిరి, గాల్లో తేలిపోయింది .కింద ఇళ్ళువిశాలం గా పెద్దగా అందంగా తీర్చి దిద్దినట్లు కనిపిస్తున్నాయి .ఎక్కడా రోడ్లు లేనేలేవు ,గడ్డిలో జాడలు మాత్రమున్నాయి .’’భూమ్మీద,ఎక్కడో ఎప్పుడో తయారు చేయబడిన పదార్ధాలు ప్రాసెస్ చేసినవిచాలా దూర తీరాలనుంచి వచ్చినవి తినటం అలవాటయింది మనకు.వాటిని మనకు తెలియని వాళ్ళు తయారు చేస్తారు .అవి శక్తినిచ్చేవికావు వాళ్ళ ఇష్టప్రకారం వండినవి .తాజాతనం రుచి స్వచ్చత ఉండవు .కానీ ఇక్కడ మనకు దగ్గరగా పండినవేతినే మనం వండుకొని తింటాం .అక్కడ ఫ్రిజ్ లో దాచినవి మైక్రో వేవ్ లలో పెట్టి వేడి చేస్తాం అందువల్ల వాటి పోషక విలువలు నాశనమైపోతాయి .ఇక్కడ బీన్స్ లాంటివాటిని మనకు కావలసిన స్పైసేస్ కలిపి హాయిగా తాజాగా వండుకొని తింటాం .’’అని దాదాపు క్లాస్ పీకినట్లు చెప్పాను .అమ్మమ్మ ‘’అవి ఎక్కడ దొరుకుతాయిరా అబ్బీ సెంట్రల్ ఫుడ్ స్టోర్స్ ఉందా ఇక్కడ ?’’అనగా ,హోవర్ క్రాఫ్ట్ లో వెళ్ళచ్చనీ దూరం కాదనీ చెప్పాను .’’ఒరే అబ్బాయీ !ఇక్కడ ఎవడూ పని చేస్తూ కనిపించటం లేదే .అజ్ఞాత బానిసలు ఇక్కడ పని చేస్తారా ?”’అని జోకింది అమ్మమ్మ ‘’కాదమ్మమ్మా ! ఇక్కడ అందరూ రోజుకు నాలుగు గంటలే పని చేస్తారు .నాలుగుగంటలూ అ౦కిత భావంగా నాన్ స్టాప్ గా పని చేస్తారు .ఇక్కడ అంతాపెర్ఫెక్ట్ గా పధ్ధతి ప్రకారం జరుగుతుంది .ఇక్కడ బానిస వ్యవస్థ లేనే లేదు .పని అవగానే వెళ్లిపోవటమే .ఎవరి అనుమతీ అక్కర్లేదు .ప్రతివాడికీ జాబ్ శాటిస్ఫాక్షన్ ,ఆనందం ఉంటుంది సమస్యలుండవు’’అన్నాను .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-10-20-ఉయ్యూరు