డా. రామయ్య గారి పైరాసిన పుస్తకం ఇంగ్లీష్ అనువాదం-శుభవార్త
–సాహితీ బంధువులకు శుభకామనలు – ప్రముఖ అణుశాస్త్ర వేత్త ,117 వ మూలకం టెన్నిస్సిన్ ను ఆవిష్కరించిన ఆంద్ర శాస్త్రజ్ఞులు డా ఆకునూరి వెంకటరామయ్య గారి జీవితం పై నేను రాసిన పుస్తకం సరసభారతి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారు స్పాన్సర్ చేసి సరసభారతి ద్వారా ప్రచురించటం ,ఆపుస్తకం అమెరికాలో రెండుసార్లు ,ఉయ్యూరులో రామయ్యగారి బంధు మిత్రుల సమక్షం లో సరసభారతి ఉగాది వేడుకలలో మూడవ సారి , మన శాసనమండలి సభ్యులు శ్రీ వై విబి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించిన సంగతి మీకు తెలిసిన విషయమే .
డా రామయ్య గారి పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేయించామని ,దాన్ని రామయ్య గారు వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా 5గంటలు నిశితంగా పరిశీలించి సవరించి ఆమోదించగా హై క్వాలిటీ లో ప్రింటింగ్ కు హైదరాబాద్ లో ఇచ్చినట్లు ,పది రోజులలో పుస్తకాలు రెడీ అవుతాయని మైనేనిగారు సెప్టెంబర్ 25 న నాకు మెయిల్ రాశారననే శుభ వార్త మీకు తెలియ జేయటానికి సంతోషంగా ఉంది-దుర్గాప్రసాద్ -2-10-20