సుంకర కోటేశ్వరరావు గారికి నమస్తే .సరసభారతి పై మీకున్న అభిమానం మాటలతో చెప్పలేనిది . సరసభారతి సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలను గమనిస్తున్న మీరు అడగకుండానే ఎన్నో సార్లుసరసభారతి కి విలువైన విరాళాలు అందజేస్తున్నారు .మీ వదాన్యత ఆదర్శప్రాయం సాహిత్య సాంస్కృతికాల వ్యాప్తికి ఉద్దీపనాలుగా ,మాకు వెన్ను దన్నుగా నిలుస్తున్నారు మీరు .
అనుకోకుండా నిన్న సరసభారతి అభివృద్ధికి బాంకు ద్వారా పంపిన 10 వేలరూపాయలు ,నా అకౌంట్ లో జమ అయినట్లు ఇవాళ చూసి ఆశ్చర్యం పొంది , ,కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను .ఉయ్యూరు దగ్గర ఉన్న మీ స్వగ్రామం గండిగుంటను వదిలి ,చాలా కాలం గా హైదరాబాద్ లో ఉంటున్నా ,ఇక్కడి విశేషాలను సరసభారతి బ్లాగు ద్వారా తెలుసుకొంటూ ,ప్రోత్సహిస్తూ ,యూనివర్సిటీ గ్రంథాలయాధికారిగా మీరు పని చేసి రిటైరయినా సాహితీ ప్రియత్వం ,వ్యాసంగం . ,సారస్వత ప్రియులందరి కి మార్గ దర్శనం సరసభారతి పై మీకున్న అభిమానానికీ .,,మీ భారీ వితరణకు మరొక్క మారు ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను -దుర్గాప్రసాద్