మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-5
‘’కాంగ్రెస్ ‘’మొదటి పత్రిక ఒక ఫుల్ స్కేప్ కాగితం పై సైక్లో స్టైల్ లో వెలువడింది తర్వాత 14పేజీలలో రాయల్ సైజ్ లో వచ్చేది .’’విదేశీ వస్తువులు బ్రిటిష్ వస్తువులు ,మత్తు పదార్ధాల ప్రకటనలు పత్రిక ముద్రించదు.ఆధిని వేశ ప్రతిపత్తికి అనుకూలం గా సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ప్రతిపాదిస్తుంది ‘’అని పత్రిక నివేదికలో పేర్కొన్నారు.తెలుగు అక్షరాలతో హిందీ పాఠాలుప్రచురించేవారు .ప్రముఖ పాత్రికేయుడు కోటం రాజు రామారావు వచ్చి చూసి సిబ్బంది అందరూ అన్ని పనులుఅచ్చు కూర్పుతో సహా చేస్తున్నారు అని మెచ్చాడు .రామచంద్రుని వెంకటప్ప రాసిన ‘’చిచ్చల పిడుగు ‘’ఏకాంకిక ను 1929మే7పత్రికలో ముద్రించిన౦దుకు దేశ ద్రోహం కింద అన్నపూర్ణయ్య గారికి రెండున్నరఏళ్ళ జైలు శిక్ష పడింది .మే 13న అరెస్ట్ కాగా క్రోవ్విడి లింగరాజు సంపాదకు డైనాడు .1930మార్చి పత్రిక లో భగత్ సింగ్ ఉరితీతను ఖండిస్తూ ‘’వీరబలి ‘’వ్యాసం ప్రచురించినందుకు లింగరాజుకు రెండేళ్ళ ఖైదు శిక్ష విధించారు .అన్నపూర్ణయ్య గారి అరెస్ట్ తర్వాత హిందూ పత్రిక లో ఒక అన్నపూర్ణయ్య ఒక ప్రకటన ఇచ్చారు .’’మా నాయకుడు సాంబమూర్తి అరెస్ట్ అయ్యాక ,నా అరెస్ట్ ఆశ్చర్యం కలిగించలేదు .ఈ ఏడు దేశమంతా జరిగిన యువజనుల అరెస్టులు చూస్తె స్వాతంత్ర్య ఉద్యమాన్ని అణచి వేయటమే అధికారుల లక్ష్యం అనిపిస్తోంది .ఇది మా పత్రికపై దురాక్రమణ గా భావిస్తాము .మేము భయపడలేదు .ఇద్దరు సంపాదకులను జైలులో పెట్టినప్పుడేమేము బతికి బట్టకట్టాం .నా నిర్బంధం తర్వాతకూడా బావుటా ఎగురుతూనే ఉంటుంది .ఈ కస్ట సమయం లో ప్రజలు మాకు అండగా నిలబడుతారనటం లో సందేహం లేదు ‘’.మద్దూరి అరెస్ట్ ను ఖండిస్తూ కలావెంకటరావు స్టేట్ మెంట్ రాసిస్తే టెలిగ్రాఫ్ వాళ్ళు తీసుకోలేదు .
లింగరాజు అరెస్ట్ తర్వాత వెంకటప్ప ఎడిటర్ అయ్యాడు .1931సెప్టెంబర్ లో జైలు నుంచి విడుదలై మద్దూరి మళ్ళీ సంపాదక బాధ్యతలు చేబట్టారు .1932జనవరిలో పోలీసు దాడి వరకు ఆయనే సంపాదకుడు .1922లో ప్రారంభమై పదేళ్ళలో చరిత్ర సృష్టించింది .కాంగ్రెస్ పత్రిక తో సంబంధమున్న వెంకటప్పయ్య ,కాండ్రేగుల రామ చంద్రరావు ,చుండ్రు పట్ల హనుమంతరావు లుకూడా జైలు కెళ్ళారు .
1929మే 21న స్వాతంత్ర్య సంచికగా వెలువడిన కాంగ్రెస్ పత్రిక ను ఆంధ్రపత్రిక సమీక్షిస్తూ ‘’10వ తేదీ 8వ సంపుటి16వ సంచిక లో 16పేజీలున్నాయి .స్వాతంత్ర్యయుద్ధ నాయకుడు నానా డూండీ పంత్ సాహెబ్ ,జగదీశ పురాధీశుడు 80ఏళ్ళ వృద్దురాణాకుమార్ సింహ ల ముఖ చిత్రాలతో ఆద్యంతం గంభీరంగా ఉన్నది .చిచ్చలపిడుగు ఏకాంకిక ,రాణాకుమార సింహుడు ,,1857ఝాన్సీ లక్ష్మీ బాయ్ అగ్ని ప్రవేశం ,తాంతియా తోపీ వ్యాసాలూ ,కవికుమారుల కుసుమాంజలి మొదలైనవి ఉన్నాయి ‘’అని మెచ్చింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-10-20-ఉయ్యూరు