జీడికంటి శ్రీరామచంద్ర దేవాలయం
నల్గొండ జిల్లా జీడికంటి లేక జీడి కల్ క్షేత్రం లో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది .ఈ స్వామిపై ఆ జిల్లాలోని రామన్న పేట వాస్తవ్యులు ,వైష్ణవ భక్తులు కేశవ పట్నం నరసయ్య గారు ‘’జీడికంటి రామ శతకం ‘’రాసి ఆస్వామికే అంకిత మిచ్చారు .కవిగారు ‘’వానకొండ శతకం ‘’నిర్యోష్ఠ్య౦ గా రాశారు .జీడికొండ శతకం లో అంత్యప్రాస ‘’క’’నుంచి ప్రారంభించి ‘’ళ’’వరకు రాశారు .అందుచే దేశ ,గ్రామ్యపదాలకూ స్థానం కల్పించారు .శతకం ఆద్యంతం భక్తి రసప్రవాహంగా సాగింది .సర్వులకు అర్ధమయ్యే సరళ శైలి లో రాశారు .శతకాన్ని కొలనుపాక లోని ‘’బహిరామియా గ్రంథాలయం’’వారు 9-2-34 న ముద్రించి అందించారు .మచ్చుకి రెండు పద్యాలు-
1-శ్రీరామ రామ నిన్ సేవింతు తొల్లింటి నేటి నేరముల మన్నింపు మంటి –ఏకాకివై బ్రోతె లోకాల నన్నింటి నతి జేతుగావవేనన్ను నొంటి-అనిలో ప్రతాప మేమని జెప్పనీ వింటి తరి బాణముల విచిత్రంబు
పొంటి మును మున్నెనిను గొల్చి ఘనుడయ్యె ముక్కంటి ధర మి౦ -చె సిరి నీ పదములంటి –ఘన దయాంబుధి వంచు నిక్కముగ వింటి-గావబూనెద వేని మేల్గంటి మంట-సిరులకిరవైన జుంటిశ్రీ జీడి కంటిధామ సుగుణాభిరామ శ్రీరామ రామ ‘’
100-‘’తెలియ గోరుదు రెంతోదేరి నిన్ దేవళ్ళునినుతి౦చ రాదు నిన్వేయి నోళ్ళు –గల శేషునకునైన కాదు వింత పోకిళ్ళు ,పరమార్ధ బోధినీ పావుకోళ్లు
కడుబాడి నిను నారదుడు వైచు పి౦పిళ్ళు దనుజులపై మహోత్తరపు తళ్లు-బరిగించి సురలకు గరుణించికడు త్రుళ్ళుబొడమ బోజేసితెపూటకూళ్ళు-యెంత భావమైన నిను దల్చినంత వ్రేళ్ళుబర్వగా జేసితివి నీళ్ళపైన రాళ్ళు –సిరులకిరువైన జుంటి శ్రీ జీడిగంటి ధామ సుగుణాభిరామ శ్రీరామ రామ ‘’
మంగళం మంగళం మంగళం
కవి దారాశుద్ధిగా పద్యాలను రామబాణం లాగా శరవేగంగా పరిగెత్తించారు .అందమైన పదబంధాలు ,శ్రీరామ వీర విక్రమపరాక్రమ శౌర్య ధైర్యాలు కళ్ళకు కట్టించారు .భక్తి గోదారినే ప్రవహిప జేశారు .ఇంతటి కవి ప్రతిభ లోకం గుర్తించినట్లు ,ఎక్కడా ఎవరూ ఉదాహరించిన దాఖలాలు లేవు . ఈ భక్త కవి వరేణ్యులు శ్రీ కేశవ పట్నం నరసయ్య గారినీ , వారి శతకాన్నీ ,జీడి కంటి శ్రీరామాలయాన్నిపరిచయం చేయటం నా అదృష్టం గా భావిస్తున్నాను .
ఆలయ చరిత్ర
శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానం జనగాం సమీపంలోని జీడికల్ గ్రామంలో ఉన్న ఒక ప్రసిద్ధ శ్రీరామ ఆలయం.ఒక స్థానిక కథనం ప్రకారం, ఆలయ ఉనికి ‘తత్రేతాయుగ౦ ’ నాటిది, ఇక్కడే రాముడు ప్రవాసంలో ఉన్నప్పుడు, రాక్షస, మారిచులను బాణంతో కాల్చి చంపాడని చెబుతారు, అతడు బంగారు జింకల వేషంలో వస్తాడు. మారీచుడు రాముడి క్షమాపణ కోరినప్పుడు ఆయనను ఆరాధిస్తానని వాగ్దానం చేస్తే , కొండపై ఈ ఆలయం లో ‘స్వయంభు’గా ఉద్భవించటానికి అంగీకరిస్తాడు. శ్రీ రాముడి పాదుక లేదా బంగారు జింక మరణించిన ప్రదేశం, స్థానికంగా ప్రసిద్ధి ” లేడి బండ “,అంటారు ప్రతి భవనం, ఇది ఒక రాయి లేదా మట్టితో లేదా సహజ రాతి శిల లోపల ఉన్న చెరువుతో అయినా, శ్రీ రాముడు బంగారు జింకల కోసం తన వెంట పడేటప్పుడు ఈ స్థలాన్ని సందర్శించినట్లు ఆధారాలు విసిరాడు. స్థానిక పురాణాలప్రకారం రాముడు వనవాసులో, భరద్వాజమహర్షి సలహా మేరకు మలయావతి నదికి ఎదురుగా ఉన్న అందమైన కొండ చిత్రకూట్ వద్ద ఉన్న ప్రశాంత ప్రకృతి వైభవం చూసి బస చేశాడు. ఇది భారతదేశంలోని అనేక ఋషులకు నిలయంగా మారింది. ఒక రోజున, రామపత్ని సీతాదేవి ఒక అందమైన బంగారు జింకను తీసుకువెళ్ళి, తన గుడిసె ఇంటి తోటను అలంకరించి, తన కు ఆనందం కలిగించమని కోరింది . జింకను చనిపోయినట్లుగా లేదా సజీవంగా తీసుకురావడానికి తనను తాను సాహసించి, సీత దేవిని విడిచిపెట్టి, తను లేకపోవడంతో ఆమెను రక్షించడానికి తన సోదరుడు శ్రీ లక్ష్మణుడిని అప్పగించాడు. ప్రభువు బంగారు జింకను వెంబడించి స్వామి దాన్ని పట్టుకొని సజీవంగా తీసుకురావడానికి విసిగిపోయి, దానిపై మోకాలు బండపై ఆనించి లేడిని బాణం తో సంహరించాడు .బాణం వేసి, బాధించి, రాతిపై పడేలా చేస్తాడు . కింద పడిపోయిన తరువాత జింక తనను తాను మానవ రూపంగా మారి , స్వామిపై కోపం తో తన పేరు చిత్రరాధ అని అర్ధం మరియు కౌషిక మహా రుషి చేత శపించబడ్డాననీ , శ్రీ రామ బాణం ద్వారా విముక్తి పొందుతున్నాననీ స్వామిని ప్రశంసించాడు. శ్రీ రాముడు ఆనందించాడు .దీని ద్వారా చిత్రరాధకు ఏమైనా కోరిక ఉందా అని అడుగుతాడు రాముడు . చిత్రరాధ ప్రభువు పవిత్ర పాదాలను తాకిన నీటిని అడుగుతాడు. అక్కడ ఉన్న శ్రీరాముడు తన బొటనవేలితో దగ్గరలో ఉన్న ఒక చిన్న రాతిని నొక్కి, దాని గుండా ప్రవహించమని గంగను ప్రార్థిస్తాడు, అది అలాగే ప్రవహించగా “ఉత్తర గంగ” గా పిలిచాడు ..ఈ నీటితో రాముడు సంధ్యావందనం చేశాడు . ఈ రోజు కూడా, రంధ్రం నుండి దుమ్మును తీసేస్తే , వేళ్లు తడిసిపోవడాన్ని అనుభవించవచ్చు.ఒకప్పుడు ఇక్కడే వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉండేది .ఇప్పటికీ వాల్మీకి గుహ కనిపిస్తుంది .కొండకు నైరుతిలో శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం ఉన్నది శ్రీ రాముడి విగ్రహాన్ని తన ముందు ఉంచి గొప్ప తపస్సులో ఉన్న సమీప వీర ఋషిని కూడా రాముడు ఆశీర్వదిస్తాడు .ఆయనకోరికమేరకు భూమిపై తన జీవితాంతం “పాద సేవ” చేయటానికి అవకాశం అడుగుతాడు. శ్రీరాముడు సంతోషంగా అంగీకరించి , తాను చేసిన , విగ్రహంగా మారి అర్చి౦చినవారికి సకల కోరికలు తీరుస్తానని అభయమిస్తాడ . ఈ ప్రదేశంలో తన పాదాల గుర్తులు దుస్తులు వదిలివేసి, ఈ ప్రదేశం ‘’వీరాచలం ‘’గా ప్రసిద్ది చెందుతుందని చెబుతాడు . ఇప్పటికీ ఈ ప్రదేశంలో అడుగు పెడితే, ఒక రాతితో ఉన్న చెరువు మరియు శ్రీ రామ పాదుకా ఆరాధనలో ఉన్నట్లు గమనించవచ్చు. ఆలయ ప్రాంగణంలో నీటిని ఉపయోగిస్తున్నప్పటికీ, చరిత్రలో ఇప్పటివరకు నీటి మట్టం తగ్గలేదు , పెరగలేదు. వేసవిలో కూడా ఎండిపోని చెరువుపై ఈ ఆలయం నిర్మించబడింది..మొదట్లో పంచలోహ విగ్రహాలు ఉండేవి .ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడ మానవ , ఆవాసాలున్నట్లు రాక్షస గుడ్లు,టైటా పెంకులు , బూడిద మట్టి గుర్తులు కనిపిస్తాయి .రామ టెంకిలు ఆనవాళ్ళు కూడా కనిపించేవట .
ఇంకో ఆసక్తి కరమైన విషయం ఒకటిఉంది .పూర్వం వీరుడు ,భద్రుడు అనే సోదరులు ఉండేవారు భద్రుడు గోదావరి తీరాన వీరుడు ,గోదారి ఆవలి ఒడ్డున శ్రీ రామునికోసం ఘోర తపస్సు చేశారు .ఇద్దరికీ శ్రీ మహావిష్ణువు ఏకకాలం లో దర్శనమిచ్చాడు .భద్రుడికోరికపై భద్రాచలం లో వెలసి దక్షిణ అయోధ్యగా ,,వీరుడికోరికపై వీరాచలం లో శ్రీ రామచంద్రమూర్తిగా కొలువై ఉన్నాడు .కాలక్రమంలో వీరాచలం జీడికల్ గా మార్పు చెందింది .భద్రాచలం భక్తరామదాసు వలన ప్రసిద్ధ క్షేత్రం అయితే ,వీరాచల౦ మాత్రం నీరసాచలం గా ఎదుగూ బొదుగూ లేకుండా పోయింది .
మరో కథనం ప్రకారం పూర్వం భీమ సేనుడు చంద్ర సేనుడు అనే రాజులు యుద్ధం చేస్తే చంద్ర సేనుడు ఓడిపోయి చనిపోతాడు .అతడి కవలపిల్లలు బాలచంద్రుడు ,బాల చంద్రిక వేర్వేరు చోట్ల పెరిగి ,స్వయంవరం లో ఈ ఇద్దరూ అన్నా చెల్లీ అని తెలియక పెళ్లి చేసుకాగా శరీరాలు వెంటనే నల్లబడి పోయాయి .ఆకాశవాణి వారిని 101పుణ్య క్షేత్రాలు సందర్శించమని చెబితే ,జీడికల్ చేరి కొండపై ఉన్న జీడి గుండం ,పాలగుండం లలో స్నానం చేస్తే ,మళ్ళీ మామూలు రంగు వచ్చి ,పాపవిమోచనం జరిగిందట .ఈ గుండా ల స్నానం పాప విమోచనంగా భక్తుల విశ్వాసం .
ఈ జీడికంటి రామాలయం భద్రాచల రామాలయం కంటే పురాతనమైనది .భద్రాచల దేవాలయ పూజారులుకూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.వేల యకరాలు ఈనాము భూములున్నా పట్టించుకొనే నాథుడే లేడు.పూర్వం యాదాద్రి నరసింహ స్వామికి ఇక్కడినుంచే ధూప దీప నైవేద్యాలు వెళ్ళేవట .యాదాద్రి నారసి౦హుని కి భారీగా ధనం అప్పుగా ఈ వీర రాముడు ఇచ్చాడట కూడా .ఈ స్వామికి గుంటూరుజిల్లా వట్టిచెరువు మండలం కొర్లేపాడులో12ఎకరాలు ,జీడికల్లు లో 50ఎకరాలు ,గుమ్మడి వెల్లి గ్రామంలో 35ఎకరాలు ఉభయ ఆంధ్రరాష్ట్రాలలో ఇంకా చాలా చోట్ల ఈనాం భూములున్నాయి .శ్రీరామనవమికి సీతారామకల్యాణం కాక కార్తీకమాసం లో నెలరోజుల జాతర సమయం లోనూ మరోసారి కూడా అంటే ఏడాదికి రెండుసార్లు కల్యాణం జరుపుతున్నారు .మహారాష్ట్ర కర్నాటక లనుంచి కూడాశేష సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించి తరిస్తారు అందుకే రెండవ భద్రాద్రి అంటారు .భద్రాచల రాముడు ప్రేమకు ప్రతీక అయితే వీరాచల రాముడు వీరత్వానికి ప్రతీక సరైన రోడ్డు సౌకర్యం లేకపోవటమూ ఇబ్బందిగానే ఉంది .భద్రాచలం తో పాటు జీడికంటి రామాలయాన్ని కూడా అభి వృద్ధి చేయాలని భక్తులు ప్రజలు తెలంగాణా ప్రభుత్వాన్ని కోరుతున్నారు .మళ్ళీ పునర్వైభవం పొందాలని కోరుకొందాం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-10-20-