మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-7
ఆంద్ర దేశం లో అతివాద ప్రథమ నాయకుడు బులుసు సాంబమూర్తిగారు .ఈయనే తనగురువు అన్నారు పూర్ణయ్యగారు .1921తూగోజి రాజకీయ మహా సభలో పూర్ణ స్వరాజ్యం సాధించాలని బులుసు ప్రతిపాదించారు .ప్రకాశం తొందర పడవద్దని హితవు చెప్పారు .తీర్మానం నెగ్గించుకొన్నారు సాంబమూర్తి .ఆయన తీర్పే ఆనాడు అందరికీ శిరోధార్యం .కాంగ్రెస్ సభలలో కొడుకు చనిపోయినా సభలలో పాల్గొన్న స్థిత ప్రజ్ఞుడు సాంబమూర్తిగారు .1928లో మద్దూరి వారికీ అఖిలభారత కాంగ్రెస్ సభ్యత్వం లభించింది .1927మద్రాస్ కాంగ్రెస్ సభలో నెహ్రు శ్రీనివాస అయ్యంగార్ డాక్టర్ అన్సారి మొదలైనవారు పట్టుబట్టి సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేయించారు .దీనితో స్వత౦త్ర సాధనకు బలం చేకూరి అయ్యంగార్ అధ్యక్షతన ’’ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్’’ ఏర్పడింది .నెహ్రు బోస్ లు కార్యదర్శులు .సాంబమూర్తి సర్దార్ శార్దూల్ సింగ్ ,అన్నపూర్ణయ్య గార్లు ముఖ్య కార్తకర్తలు .
లీగ్ కు ఆంధ్రాలో బులుసు అధ్యక్షులు .దువ్వూరి వారు విస్తృతంగా పర్యటించి లీగ్ కు గొప్ప మద్దతు కూడా గట్టారు .పత్రిక కూడా సంపూర్ణ స్వరాజ్యం కే మద్దతు ప్రకటించింది .1936ఫిబ్రవరి 29 నెల్లూరు జిల్లా యువజనులను ఉద్దేశించి ప్రసంగించి పూర్ణయ్యగారుకాంగ్రెస్ ను వశం చేసుకొని ‘’కార్మిక కర్షక పరిషత్ ‘’స్థాపించారు .
రాజమండ్రి అల్యూమినం వ్యాపారానికి అనువైన చోటు .కాంగ్రెస్ అభిమాని సేట్ జీవన్ లాల్ ఈ వ్యాపారం కోసం రాజమండ్రి వచ్చాడు.గ్రామీణ ప్రాంతాలలో పని చేసేవారికి తన ఆదాయం లో కొంత భాగం కేటాయిస్తానని సుబ్రహ్మణ్యం గారికి హామీ ఇచ్చాడు .సీతానగర్ ఆశ్రమ స్థాపనకూ లాల్ బాగా ఆర్ధిక సాయం చేశాడు .గ్రామోద్యోగులతో రాజీనామా చేయించి ఉద్యమం లో చేర్పించాడు .14ఎకరాలలో ఉన్న ఆశ్రమం అందరి సహకారం తో 12పక్కా ఇళ్ళుకట్టించింది .మంచినీటి వసతి ,ఖద్దరుప్రచారం ఉచిత వైద్య సేవ, పత్రిక నిర్వహణ ముఖ్యకార్యక్రమాలుగా ఆశ్రమం వర్ధిల్లింది .మద్దూరి వారి తమ్ముడు కృష్ణమూర్తి,వంగల సత్యనారాయణ కంపోజింగ్ చేసేవారు .ఆశ్రమవాసులు కుటుంబాలతో ఉండేవారు .అవసరాలను బట్టి జీతాలు అందేవి .సుబ్రహ్మణ్య౦ గారికి 50,దువ్వూరికి 49,లింగరాజుగారికి కు 35రూపాయల జీతం.ఇదొక సామ్యవాద ప్రయోగంగా ప్రశంసలు పొందింది .1933లో గాంధీ రెండవ సారి ఇక్కడికి వచ్చి 1932లో ఆశ్రమం పై జరిగిన దాడికి మనస్తాపం చెందాడు .
1932జనవరి 5న మద్రాస్ గెజిట్ లో ఆశ్రమం చట్ట విరుద్ధమైనదని ప్రకటించింది .ఆశ్రమ కృషి దేశమంతా హర్షించింది .1930లో సీతానగరం పోలీస్ కాంప్ గా మారింది .సత్యాగ్రహ శిక్షణ ఆశ్రమం లో జరిగినంతకాలం ప్రజలు తండోపతండాలుగా తీర్ధ ప్రజలా వచ్చి సందర్శించేవారు .శిక్షణకు దేశం నలుమూలలనుంచి వచ్చేవారు .అన౦తపురం నుంచి వచ్చిన హరే సముద్రం నరసింగరావు ‘’ఈ ఆశ్రమంలో నెలరోజులు గడిపాను దాదాపు 200కుటుంబాలవారు ఇందులో పని చేస్తున్నారు .పెద్ద ఖాదీ భాండారం ఉంది నెలకు రెండువేలరూపాయల ఖద్దరు తయారు చేస్తున్నారు .కాంగ్రెస్ వారపత్రిక నడుపుతున్నారు .గొప్ప ఆస్పత్రి, గ్రంథాలయంఉన్నాయి .అనాథ పిల్లలు చాలామంది పని చేస్తున్నారు .ఆశ్రమనిర్వాహకులు సుబ్రహ్మణ్యంగారు ప్రస్తుతం వెల్లూరు జైలులో ఉన్నారు .ఇక్కడ శిక్షణ పొందిన వందమంది తో మేము మహర్షి బులుసు సాంబమూర్తి గారి నాయకత్వం లో సాయంత్రం నాలుగు గంటలకు కాకినాడ బయల్దేరి ,ఒకగంటలో కాకినాడ చేరాం .ఆ దృశ్యం చూడాల్సిందే కాని రాయనలవి కానిది .అప్పటికే గాంధీజీ దండి చేరి ఉప్పు సత్యాగ్రహం చేస్తున్నారు .మేమూఆయన ఆజ్ఞా అనుసరించి కాకినాడలో చట్ట ధిక్కారం చేసి ఉప్పు తయారు చేశాం .రోజుకు 5లేక 6మణుగుల ఉప్పు నెలరోజులు తయారు చేసి బహిరంగం గా అమ్మితే వెయ్యి రూపాయలు వచ్చాయి ‘’అని రాశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-10-20-ఉయ్యూరు
—