అమెరికాలోనే అతి
‘’సీతా !ఇవాళ పండగరోజు ఏ చీర కడుతున్నావు ?ప్రసాదం ఏం చేస్తున్నావ్ ?ఫోన్ లో అవతలి నుంచి
సీత ‘’నువ్వేం చేస్తున్నావో చెప్పు .?’
అవతలి ‘’ఏ చానల్ లో ఎంకయ్యసామి ఇవాళ ఎరుపు చీరకట్టాలని ,ఎర్రన్నం నైవేద్యం పెట్టాలని చెప్పారు ‘’.మరి నువ్వో ?’’
సీత ‘’నీతర్వాత డజను మంది వెయిటింగ్ లో ఉన్నారు ఫోన్లో అందరి మాటలు విన్నాక చివరికి చెబుతాలే వెయిట్ చెయ్యి
‘’అక్కా !బి చానల్ లో బొజ్జా శర్మ గారు ఇవాళ బెండకాయ రంగు చీరకట్టాలనీ ,బెండకాయ పులుసు నైవేద్యం పెట్టాలనీ చెప్పారు .’’
వదినా !సి చానల్ లో చాదస్తం శీను గారు చల్లపులుసు రంగు చీరకట్టి చల్లన్నం నైవేద్యం చెప్పారు
పిన్నీ !డి చానల్ దానయ్య గారు దేవగంధారం రంగు చీర కట్టి ,సెనగలు వండి పెట్టాలన్నారు
సీతా !ఇ చానల్ లో ఇంగువ మల్లయ్య శాస్త్రి గారు ఇటుక రంగు శారీ కట్టి ,ఇప్పపువ్వు పులిహోర నైవేద్యం పెట్టమన్నారు
ఏమే అమ్మాయ్ !ఎఫ్ చానల్ లో ఉఫ్ఫు ఊళయ్య గారు ఉప్పులా మెరిసే చీరకట్టి ఉప్పుడు బియ్యం అన్నం వండి పెట్టాన్నారు
ఒసే పిల్లా !జడ్ చానల్ లో జిడ్డు జానయ్య గారు జింక కలర్ శారీ కట్టి చిత్రాన్నం నైవేద్యం చెప్పారే
కోడలుపిల్లా !హెచ్ చానల్ లో హయగ్రీవమూర్తి హయ కలర్ చీర కట్టి గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టమన్నారే ‘ఇంతకీ హయం అంటే ఏమిటే తెలీక బుర్ర బద్దలౌతోంది
మరదలా !జె చానల్ లో జంబులింగం గారు జాంపండు రంగు చీర కట్టి ,జాంపండు పాయసం వండి పెట్టమన్నారే
సిస్టర్ !కె చానల్ లో కంపు కొండయ్య కనకాంబరం చీర కట్టి ,కాకరకాయ పుల్సు లేకపోతె కీర పాయసం పెట్టమన్నారు
అత్తా !ఎల్ చానల్ ఎల్లయ్య గారు ఎల్లో శారీ కట్టి ,ఏలక్కాయ పప్పులేకపోతె రవ్వకేసరి పెట్టమన్నారు
పిన్నీ !ఎం చానల్ ఏబ్రాసి పంతులు ఎలగపండు చీర కట్టి ఎలక్కాయ పులిహోరలేకపోతె చక్రపొంగలి శ్రేష్టం అన్నారు
మొదట ఫోన్ చేసినావిడ ‘’సీతా ! బలేగా కాన్ఫరెన్స్ కాల్ లో అందర్నీ కలిపి ,అందరూ అంతా వినేట్లు చేశావ్ ధాంక్స్ .ఇంతకీ నువ్వేం చేస్తావో చెప్పనే లేదు
సీత ‘’ఏమీ కట్టనే ‘’
అవతలి ‘’యు మీన్ నూడ్?
సీతా –నూడూ లేదు పాడూ లేదు నైటీ కట్టి బెల్లం నైవేద్యం పెడతా సింపుల్ గా .
ఆధారం –మాఅమ్మాయి విజ్జి ఇచ్చిన ‘’చిన్న హింటు ‘’తో అల్లిన అల్లరి వల్లరి ఇది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-10-20-ఉయ్యూరు