పెద వేగి దేవాలయం -2చివరి భాగం )
4-ఏకాదశ రుద్రులు –ఛాతి మధ్యలో దండలకూర్పు గా చేసిన ఆభరణం తాబేలు లేక సాలీడు ను పోలిఉండటం జుగుప్సాకరం .రుద్రునికి ఇష్టమైంది మర్కటం .శివుడిని కచ్ఛ పేశ్వరుడు అనీ అంటారు.జందెం ఉదరబంధంపూర్ణ ఘట ఖచిత మణులతో పొదగబడిఉన్నాయి .ఆకర్నా౦తాలై కుడి ఎడమ మకర వ్యాఘ్ర కుండలాలు భుజ స్కంధాలై పడి ఉంటాయి .పైన వస్త్రం లేదు. కుడి చేయి పైకెత్తి విపత్కర స్థితిలో రుద్రాక్షమాల పట్టుకొని ఉంటాడు .ఎడమ చేయి కంటికి పైన ,చేతుల నాగ భుజ కీర్తులు ,వలయ కంకణాలు ఉన్నాయి .పాదాల సర్ప నూపురాలు కింద గజ్జల పట్టెడ గొలుసులు ,ధోవతి బదులు చర్మాలు౦ టాయి.పట్టికలు రెండూ పైకి లాగి ముక్త ,రత్న మేఖల హారాలతో బంధి౦ బడి ఉంటాయి .మొలత్రాడు అంటే మేఖలానికి చిరుగంటలున్నాయి .పూర్తిగా నిలుచున్నరుద్రప్పురుషుని మనోహర రూపం ఇది .శతరుద్రీయం ,రుగ్వేదాలలో వర్ణించిన అగ్ని రుద్రరూపుడుగా కనిపిస్తాడు.పది శిరసులపై ఉన్న జటలన్నీ మధ్యపురుష శిరోజాలతో కలుపబడి ,పైన ఒకే చోట ముడి వేయబడింది .ప్రతి ముఖం విలక్షణం .మూడవ నేత్రంలేదు .ఈశానుడు గాభావించవచ్చు .
మధ్య పురుషుని రెండు చేతులు కాక, ఇరువైపులా 11భుజాలవంతున మొత్తం 22భుజాలు ముంజేతి నుండి ఉద్భవించాయి .భుజతరు అంటే చేతుల వృక్షం అన్నమాట .ముంజేతులకు గుండ్రని కంకణాలున్నాయి .అన్ని చేతులలో ఆయుధాలు ఉండటం మరో విశేషం .కనుక ఇది రుద్ర రూపం .అదో వస్త్రం చర్మ౦మోకాళ్ళ వరకే ఉంది .పట్టికలతో బంధింపబడి మేఖలతో ముడి వేయబడింది .రెండుకాళ్ళ ఆమధ్య వ్రేలాడేది రుద్రుని మేఢ్రం.అధో రేతం స్ఖలన రుద్రుని సూచిస్తోంది .ఇతడు శశ్ని దేవుడు .గుడిమల్లం లో నూ ఇలాగే ఉంటాడు .మొత్తం మీద మధ్య పురుషుడు మహా దేవుడుగా ,తక్కిన రూపాలు శివ,శంకర నీలలోహిత ఈశాన విజయ ,భీమ దేవదేవ, భవోద్భవ, రుద్ర రుద్రా కపాలీ గా చెప్పబడుతున్నాడు .మధురలో 4వ శతాబ్ది ఏకాదశ రుద్ర శిల్పం శ్రీ శ్రీరామమూర్తిగారు కనిపెట్టారు . మధుర రుద్రమూర్తులు వరుసగా ఒకదాని ప్రక్క ఒకటి నాభి వరకు విడివిడిగా అర్ధ శిల్పం లో కనిపిస్తాయి. కాని పెదవేగి రుద్రరూపం లో ఒకే మూర్తిలో కుదించి వేర్వేరు శీర్షాలు భుజాలు ద్వారా వేర్వేరు రుద్ర రూపులు కనిపిస్తారు .ఈ శిల్పం క్రీశ 6-7శతాబ్దికి చెందింది కావచ్చు .శాలంకాయనులు ,పూర్వ చాళుక్యులు వైదికాకాచారాలను పాటిస్తూ బ్రాహ్మణులను గౌరవించినట్లు శాసనాలు చెబుతున్నాయి .పెదవేగి రుద్ర రూపం లాంటి శిల్పం దేశంలో ఇంకెక్కడా లేదు అనేది నిర్వివాదం .
5-కాల భైరవుడు –పెదవేగి చుట్టూ కిలో మీటరు పరిధిలో కోట గోడలు ఉండేవి .వేంగీనగర స్థాపన శాలంకాయనరాజులు లు చేశారు .నగరాధి దేవత దుర్గ లేక అంబ .కోటరక్షకురాలు .క్షేత్ర నాయకుడు కాలభైరవుడు .కోట ఈశాన్యాన ఒకటి ,పశ్చిమ ద్వారం వద్ద రెండోది కాలభైరవ విగ్రహాలున్నాయి .నాలుగు చేతులు .విరబోసిన జట,కుడి చేతిలో త్రిశూలం ,కింది చేయి నడుముపై ,ఎడమ చేత కపాలం ,చురిక ఉన్న విగ్రహమూర్తి కాలభైరవుడు .ఒకమీటరు ఎత్తు,,70 సెంటీమీటర్ల వెడల్పు ,18 సెంటీ మీటర్ల మ౦ద౦ ఉన్న విగ్రహం .శంకరాచార్యులవారు కాశీ కాలభైరవుని ఈశ్వరునిగా భావించి అష్టకం రాశారు .
విజయదశమి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-10-20-ఉయ్యూరు