మిత్రులారా,
నమస్కారం.
ఈ అక్టోబర్ 10-11, 2020 లో అంతర్జాలం లో 32 గంటలు, నిర్విరామంగా న్యూ జీలండ్ నుంచి అమెరికా దాకా జరిగిన 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ప్రపంచవ్యాప్తం గా ఉన్న తెలుగు భాషా, సాహిత్యాభిమానుల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. యూ ట్యూబ్, ఫేస్ బుక్ మాధ్యమాల ద్వారా సుమారు 25 వేల మంది 200 కి పైగా సాహితీ ప్రసంగాలు విని ఆనందించారు. ఆ సదస్సుని విజయవంతం చేసిన ఐదు ఖండాల వక్తలకు, వేదిక నిర్వాహకులకు, సాంకేతిక నిపుణులకూ, వీక్షించి, ఆనందించి మాకు అభినందన సందేశాలను అందజేస్తున్న తెలుగు భాషా, సాహిత్యాభిమానులకు మా అభివాదాలు.
ఆ సదస్సు సాధించిన విజయాలకి పరాకాష్టగా అక్టోబర్ 31, 2020 (శనివారం) నాడు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా “విజయోత్సవాలు” నిర్వహించాలని 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వావర్గం నిర్ణయించారు. భారత కాలమానం ప్రకారం ఆ నాడు మధ్యాహ్నం 1:00 pm కి ప్రారంభం అయి సుమారు ఐదు గంటలు సాగే ఆ విజయోత్సవాలలో ప్రముఖ సినీ నటులు, సాహితీవేత్త శ్రీ కె. బ్రహ్మానందం గారు ప్రారంభోపన్యాసం చేస్తారు. 30 మందికి పైగా వక్తలు సాహిత్య ప్రసంగాలు చేస్తారు.
ఈ విజయోత్సవాల సమగ్ర ప్రకటన ఇందుతో జతపరిచాం. అన్ని ప్రసంగాలూ ప్రపంచవ్యాప్తంగా యూ ట్యూబ్ లోనూ , ఫేస్ బుక్ లోనూ ప్రత్యక్ష ప్రసారం లో ఈ క్రింది లింక్ లలో చూసి ఆనందించమని కోరుతున్నాం.
You Tube Link:
Face Book Link:
https://www.facebook.com/permalink.php?story_fbid=132931561907857&id=100332915167722
Hope to meet you on October 31, 2020 from 1:00 pm- 6:00 Pm (India Time) on the internet.
భవదీయులు,
7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం
వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ (హ్యూస్టన్, టెక్సస్), కవుటూరు రత్న కుమార్ (సింగపూర్);
రావు కొంచాడ (మెల్ బోర్న్, ఆస్ట్రేలియా), డా. జొన్నలగెడ్డ మూర్తి (లివర్ పూల్, ఇంగ్లండ్);
రాపోలు సీతారామ రాజు (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా), వంశీ రామరాజు (భారత దేశం),