కచేరి వైరల్
సీన్ సితారా-1
‘’ఒరే భడవాకానా !పెళ్ళయి ఏడాదిన్నర అయింది .మీ ఆవిడ కడుపులో కాయ ఏమైనా కాయి౦చేది ఉందా లేదా .మునిమనవణ్ణి చూసిహరీ అందామని ఆగాను ‘’మనవడికి బామ్మ ఫోన్
‘’నసపెట్ట కే బామ్మా .చూస్తావులే .’’మనవడు రిప్లై
‘’నీకూ మీతాతలాగే బద్ధకం ఎక్కువ .కచేరీ చేస్తున్నావా క్రమం తప్పకుండా .ఏమో నాకు డౌటే.ఆయనా అంతే నేను కచేరీకి పిలిచేదాకా తొందరే ఉండేదికాదు .అందుకే పెళ్ళైన కొత్తలోనే మీనాన్న నా కడుపులో పడ్డాడు ‘’బామ్మ
‘’కచేరీ ఏమిటే ?’’అది నీదాకా పాకిందా?’’
‘’నా దాకా ఏమిట్రా ప్రపంచమంతా పాకి ప్రతి ఇంట్లోనూ కచేరీయే.సరే మాటలేనా త్వరలో శుభవార్త చెవిన వేస్తావా లేదా?లేకపోతె నేనే వచ్చి దగ్గిరుంది కచేరీ చేయించాల్సి వస్తుంది ఆతర్వాత నీ ఇష్టం ‘’
ఓసి బామ్మో !మాకు రెండు తరాల వెనకున్నా నీ స్పీడ్ అందుకోటం కష్టమే .నీ మనవరాలితో ఒక సారి మాట్లాడు ఇస్తాను ఫోను ‘’
ఏమే!మా వాడు లైన్ లోనే ఉన్నాడట .నువ్వు సహకరిస్తున్నావా .అమ్మా ఇదే కచేరీకి తగినకాలం .కచేరీఎచేస్తారో కష్టమే పడతారో ,రెండునెలల్లో నాకు శుభవార్త చెప్పాలి .మా వాడు కాస్త మందం వాళ్ళ తాత లాగా .నా లాగా నువ్వే విజ్రు౦భి౦చు .వాడు ఇంట్లో నుంచేగా పని చేస్తా .సిస్టం ఆఫ్ చేసినప్పుడల్లా నీ సిస్టం స్టార్ట్ చేయించు .మొహమాట పడితే కష్టమే తల్లీ .రెండునెలలోపు నాకు శుభవార్త రాకపోతే క్షణాలమీద వచ్చి వాలి నేనే దగ్గరుండి సాపాసాలతో కచేరీ చేయిస్తాను .అంత శ్రమ నాకివ్వవని నాకు తెలుసు .ఏమిటి మాట్లాడవు ?’’
‘’సరే అమ్మమ్మగారూ .డెఫినిట్ గా కచేరీ ఫలం చెవినేస్తా౦ త్వరలో ఫికర్ మత్ కేజియే .అయినా ఇంత కచేరీ పాండిత్యం మీ పల్లెటూరిలో ఎలా వ్యాపించిందో .మిమ్మల్ని చూసి గర్వంగా ఉంది ‘’అంది ముసిముసి నవ్వులతో మనవరాలు .
సీన్ సితారా-2
నేను ‘’ఏరా బ్రాహ్మీ !ఈమధ్య కనిపించటమేకాదు , వినిపించటం కూడా లేదే ?’’
బామ్మర్ది బ్రాహ్మి ‘’ఏం చెప్ప మంటావ్ బావా ‘’అంటూ ఏడ్పు లంకించుకొన్నాడు
నేను ‘’ఏడుపు ఆపి సంగతి అఘోరించు ‘’
బ్రాహ్మీ –‘’-సరే బా ! .పగలూ లేదు రాత్రీ లేదు కచేరీ చేయమంటుంది అరగంటకో సారి మా ఆవిడ .’’
నేను –‘’నీకూ మీ ఆవిడకూ సంగీత౦ రాదు కదరా .ఎట్లా చేస్తారు ?’’
బ్రాహ్మీ –‘’నువ్వో ఇక్ష్వాకుల కాలం వాడివి .టివి ఉన్నా ఏదీ చూడరు మీ ఇద్దరూ. గంతకుతగ్గ బొంత మాఅక్క .అదేదో సుబ్బు సీరియల్ ట మా ఆవిడ చూసి కచేరీ పాట లంకి౦చు కొంది బా. ఇంట్లోనుంచే పని అయినా అరగ౦టకోసారి కచేరీ అనిపిలవటం నేను వెళ్ళటం నా ఒళ్ళు హూనం అవటం పులుసు కారిపోవటం జరుగుతోంది .’’
నేను –‘’మరీ అంత అర్జెంట్ ఏమిట్రా ?’’
బ్రాహ్మీ –‘’మా అమ్మ వార్నింగ్ ఇచ్చిందిట నాలుగు నెలలలోపు కడుపు తెచ్చుకోకపోతే నాకు రెండో పెళ్లి చేస్తానని బెదిరించిందట .అందుకే నా పులుసు కార్పిస్తోంది .చెప్పుకోటానికి సిగ్గుగా ఉంది బా .
నేను –‘’అది మీ ఫామిలీమాటర్ .నన్ను ఇన్వాల్వ్ చేయకు .మీ తంటా లేవో మీరు పడి మీఅమ్మ మనసుకు శాంతి చేకూర్చండి .’’
సీన్ సితారా-3
‘’ఒరే అల్లుడూ !బయట కచేరీలుబాగా చేసే వాడివని పేరు .ఇంట్లో కూడా చేస్తున్నావా ?లేక అలసిపోయి మూడంకె వేసి ముసుగు తన్ని పడుకు౦టు న్నావా ?’’
మేనల్లుడు ‘’ఇంట్లో కచేరీ ఏమిటి మామయ్యా !నాకేం అర్ధం కావటం లేదు ‘’
మామ ‘’ఓరి సత్తెకాలపు సత్తయ్యా! నీ వల్లకాదు కాని అమ్మాయినిపిలు ‘’
‘’అమ్మాయ్! అమ్మా మామేనల్లుడేమైనా కచేరీలు చేస్తున్నాడా ఇంట్లో ?బయటి మోతేనా?’’
‘’బాబాయి గారూ !అదో ముద్దపప్పు వ్యవహారం .అంతా నేనే కలగ జేసుకోవాల్సి వస్తోంది .మీరే ఒక సారి చెప్పండి .
‘’ఇప్పటి దాకా వాయి౦చానమ్మా.మాకున్నది మీరే .శీఘ్రంగా మమ్మల్ని ఉద్ధరించండి .అమ్మా కచేరీ బాధ్యతా మొత్తం నువ్వే తీసుకొని రిజల్ట్ త్వరలో చెప్పాలి చెవులకు. దానికోసం ఎదురు చూస్తుంటాం నేనూ మీ పిన్నీ ‘’
‘’సరే బాబాయ్ !ఇక చూడండి. తడాకా చూపి కచేరీపై కచేరీ చేయించి బయటికి వెళ్ళకుండా శుభవార్త మీ చెవిన వేస్తాం .నాకొదిలేయ్యండి బాబాయ్ ‘’
సీన్ సితారా-4
‘’ఏమే పిల్లా !ఎంతో సేపు నుంచి ఫోన్ చేస్తుంటే ఎత్తటం లేదు అప్పుడే నిద్రా ?ఇంకా మీకు రాత్రి ఎనిమిది కూడా అయి ఉండదు .ఇక్కడ మాకు ఉదయం పదిన్నర .
‘’నిద్రా లేదు పాడూ లేదు అత్తా !ఆయన ఆ గదిలో కంపుకోట్టుడు .ఈ గదిలో నేను సీరియల్స్ తో కాలక్షేపం .
‘’అదేంటే !వర్క్ ఫ్రం హోం కదా .నీ వర్క్ వదిలి వేరే వర్క్ ఏంటే వాడి బొంద .అసలు కచేరీ చేసుకొంటున్నారా ?
‘ఈ మధ్య కచేరీ అంటే ఆమడ దూరం జరుగు తున్నాడు అత్తా .నాకు ఏదో ఇదిగా ఉంది .నువ్వు చెప్పిచూడు ఘాటుగా .
‘’ఒరే ఏబ్రాసీ ! పిచ్చ వేషాలెయ్యమాక .అది చెప్పినట్లు అడిగినప్పుడల్లా కచేరీ చేసి కడుపు నో కాయకాయించు .లేకపోతే మా ఆస్తి అంతా మీకు దక్కదు .కచేరీ చేస్తారో కిందా మీదా పడతారో నాకు తెలీదు .రెండు నెలలలే గడువు నాకు శుభవార్త అందించాలి .విన్నావా ?’’
‘’సరే పిన్నీ .అయినా అమెరికాలో ఉంటూ ఈ కచేరీ సాహిత్యం నీ చెవిన ఎలా పడిందీ ?’’
‘’ఒరే !ప్రపంచం కుగ్రామంఅయి ,కరోనాలో ఒక ఇల్లే అయిపొయింది .వైరస్ లా వార్తలు క్షణాలమీద పాకుతున్నాయి .అమెరికాలోనేకాదు ఈమధ్య ఆఫ్రికా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా మొదలైన అన్ని దేశాలవాళ్ళ నోళ్ళలో కచేరీ పద౦ నానుతోంది .నువ్వు ఇండియాలోఉన్నా నీ చెవికి సోకలేదా ఆశ్చర్యం గా ఉందే.అమ్మాయికివ్వు ‘’
‘’అమ్మాయ్ !మా వాడి చెవుల తుప్పు వదిలించా .ఇక నీదే భారం .కచేరీ సామ్రాజ్యం లో విహరించి మాంచి రిజల్ట్ ఇవ్వండి త్వరగా ‘’
‘’సరే పిన్నీ !ఫికర్ వద్దు నేనే దున్నేస్తా .దారికి తెచ్చి కచేరీలో కచేరీలనిపిస్తా మీ వాడితో .నువ్వన్నట్లు ఆన్ లైన్ రిజల్ట్ అందిస్తా అత్య౦త త్వరగా .అయినా పిన్నీ’’ కచేరీ’’ కాయిన్ చేసి ‘’వైరల్’’ లా వ్యాపింపజేసి కర్తవ్య బోధ చేసిన సుబ్బు అభినందనీయుడు పిన్నీ .ఉంటా కచేరీ టైమయింది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-10-20-ఉయ్యూరు