మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-10
అన్నపూర్ణయ్యగారు నాలుగు అంకాల అసంపూర్ణ నాటకం రాసి పేరు పెట్టలేదు .అనాధ విద్యా వంతుడికి బ్రాహ్మణ కన్యకు పెళ్లి జరిగి ,ఇద్దరూ స్వతంత్ర సమరంలో జైలుకు వెళ్ళటం ఇందులో కధ.స్వాతంత్ర్య పోరాటగాధను ‘’అక్క ‘’నవలగా రాశారు కాని అలభ్యం .భార్యమరణం పై ‘’వీరపత్ని ‘’గేయం రాశారు .అది గొప్ప ఎలిజీగా నిలబడింది .
శ్రీమతి వెంకట రమణమ్మ –అన్నపూర్ణయ్యగారి భార్య వెంకట రమణమ్మ .2-3-1906న పెద్దాపురం లో పుట్టారు7-6-1919న అన్నపూర్నయ్యగారితో పెద్దాపురం లో పెళ్లి జరిగింది .ఆమెకు 14,ఆయనకు 20 వయసు .కట్నకానుకల విషయం లో తేడావచ్చి వేరొక సంబంధం చేయాలని తండ్రి భావిస్తే ఆమె ఈయన్నే పెళ్లి చేసుకొంటానని భీష్మించి పెళ్ళాడింది .ఉద్యమం కోసం చదువు మానవద్దని ఆమె ఆయనకు ఉత్తరం రాసింది .కానీ ఆయన వినలేదు. కానీ ఆమె సాహచర్యంతో ఆయనలో గొప్ప మార్పు వచ్చింది .1925లో ఈ దంపతులు గౌతమీ ఆశ్రమం లో చేరారు .1927లో పుట్టిన కూతురికి రాజేశ్వరి పేరు పెట్టారు .1932లో సీతానగర ఆశ్రమ౦ చట్ట విరుద్ధమని ప్రభుత్వం ప్రకటిస్తే ,ముందుగా ఆడవారిని బయటికి పంపిస్తుంటే రమణమ్మ గారు మాత్రం ‘’మగవారితో పాటే మేము ‘’అని అక్కడే ఉన్నారు .తర్వాత పెద్దలు నచ్చ చెప్పి పంపించారు .
రాజమండ్రిలో విదేశీ వస్త్రాల దుకాణాలవద్ద పికెటింగ్ చేయగా రమణమ్మ గారిని గారిని అరెస్ట్ చేసి ఆరు నెలలు జైలులో ఉంచారు .1934 అక్టోబర్2 గాంధీ జయంతి నాడు ఆమె రాజమండ్రిలో ఖద్దరు వస్త్రాలు అమ్మారు.7-7-1935న దంపతులు గౌతమీ ఆశ్రమ౦ వదలి రాజమండ్రి చేరారు .1937లో వీరికిపుట్టిన కొడుకు తాతగారిపేరు జయరాం అనిపెట్టారు .1935లో ఆమెకు తీవ్రంగా జబ్బు చేసింది .కాంగ్రెస్ స్వర్ణోత్సవాల బాధ్యత దువ్వూరిపై పడింది .తన ఆరోగ్యం గురించి బాధ పడవద్దనియధా ప్రకారం కార్యక్రమాలు చేయమని కోరిన ఉత్తమా ఇల్లాలు .6-4-1940న అన్నపూర్ణయ్యగారిని ఖైదు చేసే నాటికి కుమార్తెకు 13,కొడుక్కి 3ఏళ్ళు .స్థిరాస్థి శూన్యం .1945జూన్ లో ఆయన విడుదల అవటానికి రెండేళ్ళ ముందే ఆమె చనిపోయారు .1940-43మధ్యకాలం ఆమెకు గడ్డుకాలం .పిల్లల్ని ఎలాపోషించిందో ఊహకు అందని విషయం .పుట్టి౦టి కొల్లూరి వారే కొంత అండగా నిలిచారు .
దువ్వూరి ఎక్కువకాలం వెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు .ఆయననుంచి భార్యకు ఉత్తరాలు వచ్చేవికావు .ఎప్పుడైనా ఈమె కార్డు రాసేది .1942లో భర్తను బేషరతుగా విడుదల చేయమని లేకపోతే కుటుంబ పోషణకు డబ్బు మంజూరు చేయమని రమణమ్మగారు ప్రభుత్వానికి అర్జీపెట్టారు .ప్రభుత్వం నెలకు 15రూపాయలు మంజూరు చేసింది .తర్వాత అది చాలదనిపెంచమని , కూతురి పెళ్లి చేయటానికి ధనం సాయం చేయమని ప్రభుత్వాన్ని కోరారు .1942జులై నుంచి జీవన భ్రుతి 25రూపాయలు చేశారు .పుట్టింటి అండకోసం కాపురం ఏలూరు కు మార్చారు .1942ఆగస్ట్ లో కూతురుపెళ్లి అనీ 200రూపాయలు మంజూరు చేయమని లేకపోతె 13రోజులు పెరోల్ పై విడుదల చేయమని పూర్ణయ్యగారు ప్రభుత్వాన్ని కోరితే నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది .తనతమ్ముడు సూర్యనారాయణ శాస్త్రికి కూతురు రాజేశ్వరి నిచ్చి వెంకటరమణమ్మగారు 1942ఆగస్ట్ 28న తండ్రి జైలులో ఉండగానే వివాహం జరిపించారు .పెళ్లి ఖర్చులు 512రూపాయలు అందులో 200రూపాయలు రమణమ్మగారు అప్పుగా తెచ్చినవే .
6-12-1943 వెంకటరమణమ్మగారు37వ ఏటనే తుదిశ్వాస విడిచారు .చివరిరోజులలో భర్తను చూడాలని ఆరాట పడిన ఆమె తపన అర్ధం చేసుకుని ,దువ్వూరి పెరోల్ కోసం అప్ప్లై చేశారు. ఆర్డర్ వచ్చేలోపే ఆమె మరణ వార్త టెలిగ్రాం చేరింది .ముందుగా లింగరాజుగారు చూసి ఎలా చెప్పాలో అర్ధంకాక దిగాలుగా ఉంటే ,దువ్వూరి ‘’ఏమిటీ రమణమ్మ పోయిందా ?””అని అడిగారట .టెలిగ్రాం చేతికివ్వగా చదివి మౌనంగా ఒక మూల కెళ్ళి కూర్చున్నారు .1947స్వాతంత్ర్య దినోత్సవం నాడు కొవ్వూరులోని వీర స్మరణ మందిరం లో రమణమ్మ గారి చిత్రపటాన్ని శ్రీమతి చుండూరు వెంకటరత్నమ్మగారు ఆవిష్కరించి అంజలి ఘటించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-10-20-ఉయ్యూరు