మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-11
1945జూన్ లో జైలు నుండి విడుదలయ్యాక మద్దూరి అన్న పూర్ణయ్యగారు ఏకాకి అయ్యారు .రెండేళ్లక్రితమే భార్య చనిపోవటం కూతురు అత్తారింట్లో ఉండటం కొడుకు విద్యాబుద్ధులను మేనమామలే చూస్తూండటం వలన ఆయన దగ్గర ఎవరూ లేరు .రాజమండ్రిలో బావమరది ఇంట భోజనం చేస్తూ మళ్ళీ ప్రజాసేవలో నిమగ్నమయ్యారు .అప్పటికే ఫార్వార్డ్ బ్లాక్ తో సంబంధాలు వదిలేశారు .కాంగ్రెస్ తో సంబంధం కొనసాగించారు .1945కి కాంగ్రెస్ లో గ్రూపులు ముఠాలు ఎక్కువయ్యాయి .ఈయన వాటికి అతీతులు .రాజమండ్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పూర్ణయ్య గారు నామినేషన్ వేశారు .కా౦గ్రెస్ లో బలమైన వర్గామున్న డా ఎబి నాగేశ్వరరావు ప్రత్యర్ధి .అందులోని ఇద్దరు మద్దతు ఇవ్వటం తో దువ్వూరి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికై ,,1948జనవరి 25వరకు ఉండి,ప్రత్యేక సోషలిస్ట్ పార్టీ ఏర్పడటం తో కాంగ్రెస్ కు రాజీనామా చేశారు .1946శాసన సభ స్థానం నుంచి మద్రాస్ శాసన సభకు కాంగ్రెస్ అభ్యర్ధిగా రాష్ట్ర కాంగ్రెస్ సంఘం ప్రతిపాదించినా ,కొందరు హైకమాండ్ తో అన్నపూర్ణయ్య నేతాజీ అనుచరుడనీ ,ఆయనకు టికెట్ ఇవ్వద్దని ఒత్తిడి చేశారు .క్రొవ్విడి లింగరాజుకు టికెట్ వచ్చింది .ప్రజలు సహించలేక లి౦గరాజుకు ప్రచారం చేయమని నిరశన తెలిపారు .వారికి నచ్చ చెప్పి లింగరాజు పక్షాన నిలిచి గెలిపించారు పూర్ణయ్య .
తన తొలి ప్రేయసి పత్రికా రచన అని దువ్వూరి ఎప్పుడూ చెప్పేవారు .రాజమండ్రిలో మొదటి స్వాతంత్ర్య దినోత్సవం 1947ఆగస్ట్ 15న పట్టణం లో 60చోట్ల గొప్పగా వేడుకలు జరిగాయి .మొదట పంజా రోడ్డులోని పార్కు వద్ద దువ్వూరి గాంధీ విగ్రహం ఆవిష్కరించారు అప్పటినుంచి ఆ పార్కు మద్దూరి వారి పేరుమీదుగా పిలువబడింది.1997లో శ్రీ భాట్టం శ్రీరామ మూర్తి అన్న పూర్ణయ్యగారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించారు .లాంచీ రేవులో నేతాజీ విగ్రహాన్నీ , ఈయనే ఆవిష్కరించారు .గౌతమీ వ్యాయామ శాల ,ప్రభుత్వ బాలికా విద్యాలయం సభల్లో ప్రసంగించారు .సాయంత్రం 50 వేలమంది ఉన్న సభలో దువ్వూరి గంభీరోపన్యాసం చేశారు .
శ్రీ పివిజి రాజు ఆర్ధిక సాయంతో దువ్వూరి ‘’జయ భారత్ ‘’పత్రిక స్థాపించారు .యర్రమిల్లి నరసింహారావు, భాట్టం సహాయ సంపాదకులు 1947నవంబర్ 1న మొదటి సంచిక వెలువరించి ‘’సోషలిస్ట్ వారపత్రిక ‘’అన్నారు .సంపాదకీయం తోపాటు అమృతారావు కలం పేరుతొ ‘’కలం చిందులు ‘’రాసేవారు మద్దూరి .చిన్న కదా కవిత జనవాక్యం శీర్షికలు ఉండేవి .ఒక్కోసారి ప్రముఖ దేశభక్తుని ముఖ చిత్రం వేసేవారు .1947ఆగస్ట్ 27సంచిక ప్రకాశంగారి చిత్రం తో వచ్చింది .ఆయన గురించి రాస్తూ ‘’ఆంధ్రులకు ఏ సమస్యమీదా ఏకాభిప్రాయం లేదు కానీ ,ప్రకాశంగారిని పూజించటం లో మాత్రం ఏకీ భావం ఉంది కారణం ఆయన ధైర్య సాహసాలు త్యాగం .ఈ సుగుణాలున్న వారు చాలామంది ఉన్నా ఆపద ఎక్కడ ఉంటె ప్రకాశం అక్కడ ప్రత్యక్షమౌతాడు .వరదలు తుఫాన్లు వచ్చి ప్రజలు నిలువ నీడ లేక అల్లాడుతుంటే ఆంధ్ర కేసరి వాలిపోవాల్సిందే.’’
సోషలిస్ట్ నాయకులు అచ్యుత్ పట్వర్ధన్ ,లోహియా ,కమలాదేవి ,అశోక్ మెహతా ,పివిజి రాజుగార్లను పత్రికలో ఘనంగా పరిచయం చేశారు దువ్వూరి .
1-అచ్యుత్ పట్వర్ధన్ –విఖ్యాత సోషలిస్ట్ నాయకుడు.కాశే విశ్వవిద్యాలయంలోప్రోఫేసర్ పదవికి రాజీనామా చేసి రాజకీయాలలో చేరి లక్నో ఫైజా పూర్ ఎఐసి సి సభ్యుడై ,తర్వాత నిరాకరించి 1942ఆగస్ట్ విప్లవం లో 3ఏళ్ళు అజ్ఞాతం లో ఉంటూ అరుణా ఆసఫాలీ సహాయంతో ఆగస్ట్ విప్లవం నడిపాడు సతారాలో బ్రిటిష్ ప్రభుత్వం బదులు స్వదేశీ ప్రభుత్వం నడిపిన ఘనుడు .అన్న రావుసాహెబ్ కూడా దీటైనవాడు .వారి కుటుంబం మహారాష్ట్రలో చాలా ప్రభావమైనది .అచ్యుత్ అనర్గళవాగ్ధాటికి ముగ్ధులు కావాల్సిందే .
రామ మనోహర్ లోహియా-విజ్ఞాని.ఎఐసిసి విదేశాంగ శాఖ కార్యదర్శి గా పేరు పొందాడు సోషలిస్ట్ పార్టీ జాతీయకార్యవర్గ ప్రముఖుడు ఆగస్ట్ విప్లవాన్ని తేజో వంతంగా నడిపిన ధీరుడు .ఎర్రకోటలో జయప్రకాష్ తో పాటు జైలు జీవితం గడిపిన యోధుడు .
శ్రీమతి కమలాదేవి-అఖిలభారత మహిళామండలి అధ్యక్షురాలు .భారత నారీరత్నం .ఏఐసిసిసి సభ్యురాలు .సామ్యవాద భారత్ కోసం తీవ్ర కృషి చేసిన నారీమణి
శ్రీ అశోక్ మెహతా –సోషలిస్ట్ పార్టీ నిర్మాతలలో ఒకడు .హింద్ మజ్దూర్ సభ నిర్మాత కూడా మేధావి వక్త విద్యా సంపన్నుడు అరుదైన వ్యక్తిత్వమున్నవాడు ప్రజలను నడిపించే అమోఘ శక్తి ఉన్నవాడు. ప్రజాసోషలిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి .మధ్యప్రదేశ్ నున్చిపార్లమేంట్ కు నిలబడ్డాడు ఆయన్ను గెలిపించిన గౌరవం పొందాలి .చిన్నవయస్సు దేశభక్తుడు .కార్మిక కర్షకనాయకుడు .బహుళ గ్రంధకర్త మహా మేధావి .నిర్మాణ శక్తి సంపన్నుడు నిష్కళంక సేవామూర్తి.
శ్రీ పివిజి రాజు –‘’భూమి నంతటినీ జాతీయం చేసే బిల్లు రావాలి దీనితో పాతపద్ధతులు ఆచారాలు తొలగిపోయి భూమి అంతాప్రభుత్వ పరమౌతుంది .సామ్రాజ్యవాదుల అడుగులకు మడుగులోత్తే జమీందారీ వ్యవస్థ రద్దు త్వరగా జరగాలి .జయప్రకాష్ అడిగిన వెంటనే సోషలిస్ట్ పార్టీకి 10వేల రూపాయల విరాలమందించిన వదాన్యుడు పివిజ్ రాజు ‘’
ఇంతటి మహత్తర వారపత్రిక కొన్ని సంవత్సరాలే నడిచి మూలపడింది .
కేంద్ర సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు ఆచార్య నరేంద్రదేవ్ .ప్రధానకార్యదర్శి జయప్రకాష నారాయణ్ ఆంధ్రలో సోషలిస్ట్ పార్టీ ఆడ హాక్ కమిటీ ఏం బాలకృష్ణ కార్యదర్శిగా ,మద్దూరి చక్రధర్ వగైరా సభ్యులతో 1950మే నెలలో ఏర్పడింది .జయప్రకాష్ ఆంధ్రలో పర్యటించినప్పుడు మద్దూరి ఆయన వెంట ఉంటూ ప్రసంగాలకు తెలుగులో అనువాదం చేసేవారు .బహిరంగ సభలకు జనం బాగా వచ్చేవారు .తనపర్యటన లో వసూలైన లక్షరూపాయలు ఆంద్ర రాష్ట్ర పార్టీకి ఇచ్చాడు జెపి .
1952 జనరల్ ఎన్నికలలో మద్రాస్ శాసనసభకు ఆంధ్రనుంచి ఆరుగురు సభ్యులు సోషలిస్ట్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు .ఈ పార్టీకి విశాఖజిల్లా బలమైన కేంద్రం .మద్దూరిని శాసన సభ్యుడిగా చూడాలని పివిజి రాజు ఆశపడ్డాడు .ఏదోఒక నియోజకవర్గం నుంచి పోటీచేయమని వొత్తిడి చేశాడు .రాజమండ్రి నుంచే పోటీ చేస్తానని మృదువుగా తిరస్కరించారు మద్దూరి .1952లో ఆంధ్రరాజకీయం డోలాయమానంగా ఉంది .ప్రకాశం కాంగ్రెస్ ను వదిలి ప్రజాపార్టీ పెట్టటం అండర్ గ్రౌండ్లో అప్పటిదాకా ఉన్న కమ్యూనిస్ట్ లు బయటికొచ్చి ఎన్నికలలో నిలబడటం తో రాజమండ్రి స్థానానికి నాలుగుపార్టీలు పోటీ పడ్డాయి .కాంగ్రెస్ తరఫున డా కే ఎల్ నరసింహారావు ,ప్రజాపార్టీ నుంచి క్రొవ్విడి లింగరాజు ,సోషలిస్ట్ పార్టీ నుంచి అన్నపూర్ణయ్యగారు కమ్యూనిస్ట్ అభ్యర్ధిగా చిత్తూరి ప్రభాకర చౌదరి పోటీ చేశారు .ఆంధ్రాయూని వర్సిటి సోషలిస్ట్ విద్యార్దినాయకుడు ఎవికే చైతన్య రాజమండ్రి లో ఉండి మద్దూరికి తీవ్ర ప్రచారం చేశాడు .మైకుకట్టిన కారులో మద్దూరి ప్రచారం చేస్తూ తన రాజకీయం వివరిస్తూ ,14ఏళ్ళు జైలులో ఉన్నానని తెలియజేస్తూ ,గెలిచినా ఓడినా రాజమండ్రిలోనే ఉంటూ ప్రజాసేవ చేస్తానని వాగ్దానం చేస్తూ ప్రచారం చేశారు .ప్రచారం ఉధృతంగా ఉన్న సమయం లో కాంగ్రెస్ ను దుయ్యబడుతూ ప్రచారం చేసి ఒకరోజు అర్ధరాత్రి 12గంటలకు కాంగ్రెస్ అభ్యర్ధి నరసింహారావు ఇంటి తలుపుతట్టారు మద్దూరి .ఆయనకొడుకు తలుపు తీసి ఆశ్చర్యపోగా ‘’మీ నాన్న ఉన్నాడా ??’’అంటూ లోపలి వెళ్ళగా ఆయన దువ్వూరి వారిని భోజనం చేసి వెళ్ళమని బలవంతం చేసి దగ్గరుండి తినిపించాక గంటసేపు ప్రత్యర్దులిద్దరూ కులాసా కబుర్లు చెప్పుకొన్నాక పూర్ణయ్యగారిని రిక్షా ఎక్కించి గౌరవంగా పంపారు రావుగారు .కానీ విజయం కమ్యూనిస్ట్ లదేఅయింది .ఓడినా విచారపడ లేదు మద్దూరి ‘’స్వాతంత్ర్యం నాగురించికాదు. భావి తరాలకోసం .కాంగ్రెస్ కు రిజైన్ చేసిన నరేంద్ర దేవ్ వంటినాయకులు బై ఎలెక్షన్ లో ఓడిపోలేదా? గెలుపు వోటములు ముఖ్యం కాదు .ఇక భవిష్యత్తు అంతామనదే ‘’అని కార్య కర్తలను ఊరడించిన స్థిత ప్రజ్ఞుడు మద్దూరి అన్నపూర్ణయ్యగారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-10-20-ఉయ్యూరు