అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -12
9-టెలోస్ ,పరిసరాల టూరు -2
‘’ఫాక్టరీలు ఉండి ఉంటాయి .అక్కడ పని విసుగ్గా ఉంటుంది ‘’అంది నాన్సి .ఇంతలో ఎల్లి ‘’నేను ఇసుక, నీళ్ళతో తో పేపర్ చేయగలను ‘’అంది .’’మేము హెంప్ వాడుతాం దానితో మంచి పేపర్ తయారౌతుంది ‘’అన్నాను నేను .’’సూర్యకాంతి నామొహం పై పడి బలే హాయిగా ఉంది కానీ చర్మం నల్లబడుతుందేమో ‘’అంది అమ్మమ్మ .అలా జరగదని చెప్పాను .ఇక్కడి సూర్యుడు ఎలెక్ట్రో మాగ్నెటిక్ ఆధారం గాఉంటాడు అందులోనుంచి ప్రమాదకర కిరణాలు వెలువడవు ‘’అన్నాను .’’టెలోస్ ఇంతపెద్దదా ??’’అని చేతులు రెండూ బారుగా చాచింది ఎల్లీ .సరిగ్గా కూర్చోమనిచేప్పి ‘’టెలోస్ యెంత పెద్దదో చెబుతా విను .టెలోస్ ఒక దేశం కాదుఅగర్తా రాజ్యంలో ఒక ముఖ్యనగరం.భూమికింద అంతటా వ్యాపించి ఉంటుంది .ఇక్కడా అనేక దేశాలు ,రాష్ట్రాలు భూమిపైన ఉన్నట్లే ఉంటాయి .’’అద్భుతం ‘’అని అమ్మమ్మ .ఒక క్షణం యంత్రం గాలిలో ఆగి భూమికి దగ్గరలో దిగింది .మావాళ్ళు అనుసరించారు .మేము ఆగిన చోట నీరు మిలమిల మెరుస్తోంది .తీరాన పచ్చగడ్డి భూమి నుంచి ఉన్న చిన్న బ్రిడ్జి ఒక ఐలాండ్ కు కలిపింది .అది ఆకాశ ,సరస్సులను కలిపినట్లున్నది .పైన నీలిరంగు నుంచి ఎమరాల్డ్ గ్రీన్ షేడ్ లోకిమారి౦ది . అది అరుదైన వజ్రంలా తరంగాలపై భాసించింది .నిజంగా అంతే.కాళ్ళకు చెప్పులులేకుండా బ్రిడ్జిపై20అడుగులు నడిచాను .పచ్చగడ్డి మరోవైపుకూడా మెరుస్తోంది .ఇకడికి ఇదివరకు చాలాసార్లువచ్చాను కనుక అద్భుత పాలెస్ కు దారి నాకు తెలుసు .చిన్న పెవిలియన్ అంతా పూల సముద్రంగా ఉంది .పైన ఒక ఆర్చి ఉంది .దానిపై ‘’పోర్ధో లోగస్ ‘’అని పేరుంది .ఇది లైబ్రరీకి వెళ్ళే అతిపెద్ద దారుల్లో ఒకటి .పెవిలియన్ బహు సుందరంగా ఉంది .గోడలు విలువైన రాళ్ళతో అల౦క రింపబడ్డాయి .లోపలున్న స్టెయిర్ కేస్ కింద ఇంటికి దారి చూపిస్తుంది . లోపల చర్చి లాగా ఉంది .అమ్మమ్మా, ఎమిలీ ఆగి చప్పట్లు కొట్టారు .నాన్సీ మాత్రం టూరిస్ట్ లా నిశ్చేస్టు రాలై’’కింద హేడ్స్ కు దారా ?’’అంది నవ్వుతూవ్యంగ్యంగా . నేను ఆనవ్వును ఒప్పుకోలేదు .హేడ్స్ అంటే ఎమిలీకి తెలీదు .అక్కడి జెం స్టోన్ ను తాకుతూ ఆనందం అనుభవిస్తోంది .నాతోపాటే టేక్ కూడా దిగింది కిందికి నా కంటే ముందుగా .దానికి నెమ్మదిగా నడవటం ఇష్టం ఉండదు .అమ్మమ్మ చేయిపట్టుకున్నా కాని ఆవిడా 20ఏళ్ళ పిల్లలాగా ఉత్సాహంగా ఉంది .ఎల్లీ నిపట్టుకొని నాన్సీ నెమ్మదిగా వస్తోంది . పిల్లభయపడుతు౦దనుకొందికాని ఆమే భయపడుతోంది .
కింద మంచి వెలుతుఋ నులి వెచ్చగా ఉంది .అందమైన ద్వారం దగ్గర మాన్యుల్ స్వాగతం చెప్పటానికి సిద్ధంగా ఉన్నాడు .అందర్నీ ఆప్యాయంగా ఆహ్వానించాడు .ఎల్లీని గట్టిగా హత్తుకొని గాల్లోకి ఎగరేసి పట్టుకొని గుండ్రంగా తిరుగుతూ డాన్స్ చేశాడు ఆప్యాయంగా .కిందికి దింపే టప్పుడు ఆపిల్ల అతని మెడను గట్టిగా కావలించి,’’నువ్వూ ,టిక్ నాకుమంచి స్నేహితులు బాగా ఇష్టం ‘’అంది .మాన్యుల్ ‘’ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ లో ఉన్నాం మనం ఇప్పుడు’’అన్నాడు ఇంగ్లీష్ లో .అమ్మమ్మకూ ఇంగ్లీష్ పై అభిమానం ఎక్కువే స్పానిష్ అయినా ,’’ఇక్కడ విశ్వం లోని అన్ని కాలాల అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి .పుస్తకాల బదులు యాక్టర్స్ మన ప్రశ్నలకు జవాబు చెబుతారిక్కడ .దృశ్యాలు ప్రదర్శించి సమాధానాలు చెబుతారు మనం అడిగిన వాటికి .కాస్త ఆగండి ‘’అన్నాడు నాన్సీకి కోపం వచ్చి ‘’అసలు పుస్తకాలే ఉండవా .ఐతే లైబ్రరీ పేరు ఎందుకట’’?అంది .’’పుస్తకాలూ ఉంటాయి కాని ఇక్కడ నటన ముఖ్యం .ఏదైనా అడుగు ?’’అన్నాడు .’’మెర్లిన్ అనే వాడున్నాడా అసలు “?లేక పుక్కిటి పురాణమా ?’’అని వెంటనే ప్రశ్నించింది .’’నాతో రండి ‘’అన్నాడు మాన్యుల్ .పైకి కొన్ని మెట్లు ఎక్కించి రెండువైపులా ద్వారాలున్న విశాల కారిడార్ లోకి తీసుకు వెళ్ళాడు .అదొక ప్రత్యేక లైబ్రరి. ఒకప్పుడు నిజమైన గుహ.. అక్కడ చాలా చిన్నచిన్న స్టేజెస్,వాస్తవాన్నీ ఫిలిం లను కలుపుతూ అంతులేని జ్ఞాన ఖనిలా అనిపించింది .దారులు నెట్ వర్క్ ,గదులు ఉన్నాయి .ఇవన్నీ చెప్పటానికి గైడ్ అవసరం .ఇక్కడ చాలా మంది గైడ్ లున్నారు కొందరు మౌలికంగా ,కొందరు హోలోగ్రామ్స్ గా ఉంటారు .
‘’మా వాళ్ళు ఏదో తెలుసుకోవాలని తహతహపడుతారు. మా వాళ్ళు సింబాలిక్ బాంధవ్యం కోరుతారు .సామూహిక జ్ఞానం పొందాలని భావిస్తారు .దీనికి ప్రశ్నలు అవసరమే .అదేఇక్కడ లైబ్రరీ అంటే ‘’అని వాళ్లకు తెలియ జెప్పాను ముఖ్యంగా నాన్సీకి .కిందికి దిగి ఒక దియేటర్ లాంటి దానిలోకి వెళ్లి సీట్లలో కూర్చున్నాం .స్టేజి పైనుంచి మెర్లిన్ మాకు అభివాదం చేశాడు .మెర్లిన్ తాను నిజంగా మనిషినే ననీ ,చాలా ముఖ్యమైన వాడిననీ ,అందరి గౌరవం పొందిన వాడిననీ ,మంత్రగాడ౦టే అసూయ అనీ చెప్పాడు .కొన్ని ట్రిక్కులు ప్రదర్శించాడు .ఎల్లీ మురిసిపోయింది .క్షణం లో ఆమె ఒళ్లోఅకస్మాత్తుగా ఒక తెల్ల కుందేలు పిల్ల వచ్చి కూర్చుని వెంటనే వెళ్ళిపోయింది .
మెర్లిన్ నాన్సీకి తనజీవిత కధ వివరించి చెప్పాడు.ఆశ్చర్యపోయింది ఆమె. కొన్ని సీన్లు నటించి చూపాడు ,కొన్ని ఫిలిం బిట్లు ప్రదర్శింఛి తన ప్రదర్శన పూర్తి చేశాడు ప్రపంచ ప్రసిద్ధ మెజీషియన్ మెర్లిన్ .’’నేను ఇన్వెన్షన్ కాని ,ఇ౦పోస్టర్ ని కాని కాను .భూలోకవాసులు తెలిసో తెలీకో జనాన్ని పక్కదారి పట్టిస్తున్నారు .కాని కొత్త శకం వస్తోంది .కనుక భూలోకం శుద్ధి చేయబడాలి శుద్ధి చెందాలి .ప్రేమ ,సత్యం తో అక్కడ పునర్నిర్మాణ౦ జరగాలి తప్పదు.అది కాంతివంతమైన భూమిగా మారాలి చీకటి పారద్రోలాలి .మెర్లిన్ అనే నేను శాశ్వత భూమి పై ప్రతిజ్ఞ చేసి ఈ మాట చెబుతున్నాను ‘’అనగానే స్టేజ్ పై చీకటి ఆవరించి ప్రదర్శన పూర్తయింది .మేమ౦దరం ఆశ్చర్య చకితులమయ్యాం .నాన్సీ లేచిను౦చొని’’ఇది నాటకంలాగా ఉంది కానీ వాస్తవంగా లేదు.ఇక్కదేమైనా పుస్తకాలున్నాయా ’’అని గట్టిగా అరచింది .నేనూ అమ్మమ్మా ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపడ్డాం.అమ్మమ్మ నా చేయిపట్టి లాగి షాకైంది. ఎల్లీ ఏడుపు లంకి౦చుకొంది. ‘’అంతా నిజమే అమ్మా .నువ్వే చెప్పు నిజ౦ కాదా ?’’అన్నదిపాపం .మాన్యుల్ వచ్చి ఆపైల్లనుపైకెత్తుకొని చెవిలో ఏదో చెప్పాడు .ఆపిల్ల ఏడుపు ఆపి నవ్వింది .ఆపిల్లకు ఏం చెప్పాడో తెలీదుకాని,ఏడ్చేపిల్ల హాయిగా నవ్వింది .
లైబ్రరీలో కొంత భాగం చూశాం .కొన్ని చోట్ల విశాలమైన గాలరీలు పెయింటింగ్ లతో హాయిగా కూర్చునే కుర్చీలు టేబుళ్లు ,కౌచేస్ అంటే మంచాలతో ముచ్చటగా ఉన్నాయి .ఆకలేస్తే ఒక చోట ఆగాం .వెంటనే తాగటానికి డ్రింక్స్ వచ్చాయి .సర్వర్లు ఎవరూలేరు .తానే ఏర్పాటు చేశానన్నాడు మాన్యుల్ .అక్కడ ఉన్నవేవో తిని ఆకలి తీర్చుకొన్నది పేచీపెట్ట కుండా ఎల్లీ .వాటిల్లో విషం ఉ౦దేమోననే భయంతో నాన్సీ ఏదో తిన్నట్లు నటించింది .ఆమెను చూసి జాలేచి ‘అనుమానముంటే మనకుక్కకు పెట్టి టెస్ట్ చేయి ‘’అన్నాను .అమ్మమ్మ నావైపు వార్నింగ్ ఇస్తున్నట్లు చూసింది .ఒక బ్రెడ్ ముక్క తీసి టెక్ కు పెట్టింది నాన్సీ .ఒక్కసారిగా మింగేసి ఇంకాకావాలన్నట్లు చూసి౦ది కుక్క .అలసిన ఎల్లీ విశ్రాంతి తీసుకోవాలని అంది అక్కడ ఆగటానికి వీలుందా అని మాన్యుల్ ను అడిగాను .ఒక లిఫ్ట్ లోనుంచి మమ్మల్ని బయటికి తీసుకు వెళ్ళాడు .అక్కడ పట్టపగలు గా ఉంది .ఇక్కడ ఉండటం లో ఇబ్బంది ఏమిటి అంటే పగలుకు రాత్రికి తేడా తెలుసుకోవటం కష్టం .ఇక్కడి ‘’ఫ్రెండ్లీ సన్షైన్’’అంతమనోహరంగా ఉంటుంది .మొదట్లో ఇబ్బందిగా ఉన్నా, క్రమేపీ అన్నీ తెలుస్తాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-10-20-ఉయ్యూరు