- సరస భారతి శ్రీ ప్లవ ఉగాది పుస్తక ఆవిష్కరణ
సాహితీ బంధువులకు శుభ కామానలు –
శ్రీ ప్లవ నామసంవత్సర ఉగాది వేడుకలలో నేను అంతర్జాలం లో సుమారు నాలుగేళ్ళక్రితం రాసిన ”వ్యాఖ్యానచక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి మనీష ”ను సరస భారతిఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి దంపతుల (అమెరికా )స్పాన్సర్ షిప్ తో సరస భారతి తరఫున ముద్రించి ,ఆవిష్కరింప చేయాలని భావిస్తున్నామని తెలియ జేయటానికి సంతోషం గా ఉంది .-దీనికి ముందు మాటలు రాసి, విలువ పెంచమని డా పుట్టపర్తి నాగ పద్మిని గారిని కోరాం .అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాం మీ-దుర్గాప్రసాద్ -2-12-20 -ఉయ్యూరు