కిరాతార్జునీయం-.20 పదకొండవ సర్గ -3.
అర్జునుడు ఇంద్రుడితో’’ఇలాంటి ప్రియవచానాలు ఎవరు చెబుతారు .నీలాంటి బుద్ధి మంతులకు తప్ప మరొకరికి సాధ్యం కాదు ‘’-‘’వ్యాకుర్యాత్కః ప్రియం వాక్యం యో వక్తా నేదృగాశయః .నేను ఎందుకు తపస్సు చేస్తున్నానో దాని నేపధ్యం మీకు తెలియదు .సాధారణ ముని అనుకొని,మోక్ష ధర్మం ఉపదేశించావు .-‘’శాసితం యేన మాం ధర్మం మునిభి స్తుల్య మిచ్ఛసి’’.పూర్వాపరాలు తెలీకుండా చేసే ఉపదేశం బృహస్పతి చెప్పినా వృధా అవుతుంది .నీతివిరుద్ధ ప్రయత్నం విఫలమైనట్లే ఇదీ నిష్ఫలమౌతుంది –వాచస్పతే రపి -‘’అవిజ్ఞాత ప్రబంధస్య ‘’వ్రజత్యఫలతామేవ నయద్రుహ ఇవే హితం ‘’ .నక్షత్రాలు ప్రకాశించే ఆకాశానికి పగలు పనికి రానట్లు ,మీ ఉపదేశానికినేను పాత్రుడిని కాను -.’’శ్రేయసో ప్యస్య తే తాత వచసోనాస్మి భాజనం –నభసః స్ఫుట తారస్య రాత్రే రివవిపర్యయఃనేను పాండు రాజ కుంతీ దేవి దంపతుల కుమారుడిని .ఆర్జునుడిని . దాయాది కౌరవులు రాజ్య బహిష్కారం చేయగా అరణ్యవాసం చేస్తున్నఅన్నగారు ధర్మరాజు ఆజ్ఞతో ఇక్కడ తపస్సు చేయటానికి వచ్చాను .-‘’క్షత్రియస్తనయః పా౦డో రహం పార్థోధనంజయః –స్థితః.ప్రాంతస్య దాయాదైర్భ్రాతుర్జ్యేష్టస్య శాసనే ‘’..పూజ్య కృష్ణ ద్వైపాయన మహర్షి ఆజ్ఞాపించగా ఈ రకంగా తపో నిష్ఠ లో ఉన్నాను .ఇంద్రుని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం లో ఉన్నాను .ఇంద్రుడు క్షత్రియ దేవుడు కనుక సుఖారాధ్యుడు అని భావం .-‘’కృష్ణ ద్వైపాయ నాదేశాత్ విభిర్ని వ్రత మీద్రుశం .-భ్రుశమారాదనే యత్తః స్వారాధ్యస్య ‘’.మరుత్వతః.కపట పాచికలతో ఆడి, ధర్మరాజు రాజ్యం,సోదరులు నల్గురు భార్య ద్రౌపదిని స్వయంగా పణంగా ఒడ్డి ఓడిపోయాడు .ఏదో జరగాల్సిందేదో అలా జరిగిపోయింది ‘’భవితవ్యతాఖలు బలవతీ ‘’ సూక్తి నిజమైంది .’’దురక్షాం దీవ్యతా రాజ్ఞా రాజ్యమాత్మావయం వధూః-నీతాని ణతాం నూను నమీదృశీభావితవ్యయా ‘’.నేను లేకుండా మిగతా సోదరులతో ఉన్న యుధిస్టిరుడుద్రౌపదీ దీర్ఘ రాత్రులు గడపలేక ఇబ్బంది పడ్డారు .నాకోసం వాళ్ళు, వారికోసం నేను బాధ పడుతుంటే వైరాగ్య భావన కలుగదు కదా –‘’తేనానుజ సహాయేన ద్రౌపది వినా –భ్రుశ మా యామి యామాసు యామినీ ష్వభితప్యతే ‘’.కౌరవ సభలో మా ధర్మపత్ని ద్రౌపది కొంగు లాగి సిగ్గు పడేట్లుచేశారు .నీచమైన మాటలశూలాలతో మా ననస్సులకు గాయాలు చేశారు –‘’హృతోత్తరీయాం ప్రసభం సభాయామాగత హ్రియః –మర్మచ్ఛిదానో వచసా నిరతకక్ష న్నరాయతః ‘’.కాలపురుష మృత్యువు భీష్మాదులున్న సభలో ద్రోపదిని ఈడ్చుకురావటం మమ్మల్ని కూడా అలాగే ఈడ్చాలనే ప్రయత్నం లో ఉన్నట్లు అర్ధమైంది .’’వినాశకాలే విపరీత బుద్ధిః’’లోకోక్తికి ఉదాహరణగా నిలిచారు’’ –‘’ఉపాధత్త సపత్నేషు కృష్ణాయా గురు సన్నిధౌ –భావమాన యనే సత్యాః సత్యం కార మివా౦ తకః ‘’
దుశ్శాసనుడు సభలోకి ఆమెను ఈడ్చుకొని వచ్చినప్పుడు ,సభాజనం క్షణ కాలం చూశారు .తర్వాత తలలు తిప్పుకొన్నారు అది సాయం వేళసూర్యుని కెదురుగా ఉన్న చెట్టు నీడ క్షణ కాలం ఉన్నట్లుగా అనిపించింది –‘’అభి సాయార్క మా వృత్తాం.చాయా మివ మహా తరోః.’’ఏ పనీ చేయలేని నీ భర్తలను చూసి మాత్రం ప్రయోజనం ఏముంది అన్నట్లు ద్రౌపది కళ్ళను కన్నీరు కప్పేసింది – ‘’ఆయథార్ధ క్రియా రంభైః పతిభిఃకిం తవైక్షి తైః-అరుధ్యేతామితీ వాస్యా నయనే బాష్ప వారిణా ‘’.మా దుర్దశకు మా పెద్దన్న ధర్మరాజు గారే సహించాడు శత్రునాశనం ఎప్పుడైనా సులభమే .ఇవాళకాకపోతే రేపైనా తప్పదు..కాని సజ్జనులమధ్య అపవాదు మంచిది కాదు కదా .ఆది తప్పిన వాడు అనే పేరు రాకూడదని అన్నగారి ఉపేక్ష .-‘’సోఢవాన్నో దశా మంత్యాం జ్యాయేనేవ గుణప్రియః –సులభో హి ద్విషాం భంగోదుర్లభా సత్స్వ్య వాచ్యతా ‘’.సముద్రజలం చెలియలికట్ట దాటరాదు అనే మర్యాద తో అతలాకుతలమౌతుంది అయినా స్వచ్చంగానే ఉంటుంది .అలాగే అభిమాన వంతుడైన ధర్మరాజు మనస్సు కూడా ప్రతిజ్ఞాభంగం కాకూడదని వ్యాకులమైంది అయినా మనస్సుమాత్రం .స్వచ్చంగా సంయమనం పాటిస్తోంది –‘’స్థిత్యతి క్రాంతి భీరూణిస్వచ్ఛాన్యాకులితాన్యపి-తోయాని తోయరాశీనాం మనాంసి చ మనస్వినాం .ధృత రాష్ట్ర కుమారులతో మా మైత్రి మా శత్రుత్వానికి కారణమయింది .నీడ కోసం కూలిపోయే నది గట్టు ను ఆశ్రయిస్తే అదికూలి ప్రాణం తీసినట్లు ,దుర్జన స్నేహం అనర్ధ దాయకమే .మిత్ర ద్రోహమే దీనికి కారణం .—దార్త రాష్ట్రైః సహప్రీతి ర్వైర మస్మాస్వ సూయతః –అసన్మైత్రీ హి దోషాయ కూల చ్ఛాయేవసేవితా ‘’.
లోకనిందకు భయపడని మంచి చెడు విషయం లో తారతమ్యం లేని దురాచార దుష్టుని మనసు దైవ విదిలాగా ఊహకు అందనిది .వాడి పనిని బట్టే అది బయట పడుతుంది ..-‘’అపవాద భీతస్య సమస్య గుణ దోషయోః-అసద్వ్రుత్తేరహో వృత్తం దుర్విభావం విధేరివ’’.శత్రు అవమానం పొందిన నామనస్సు వెంటనే బ్రద్దలయ్యేట్లుంది.ప్రతీకారం తీర్చుకోవాలన్న నా కోపం దానికి సాయపడి కాపాడింది .బతికి ఉండటానికి కారణం ప్రతీకారం తీర్చుకోవటానికే –ద్వంసేత హృదయం సద్యః పరి భూతస్య మే పరైః-యద్యమర్షఃప్రతీకారం భుజా లంబం నలంభయేత్’’.శత్రువుల అవమానం తో మృగాలుగా గడుపుతున్న మేము ఒకరి కొకరం చూసుకొని సిగ్గుతో తలవంచు కుంటున్నాం .స్నేహబృందం మాట చెప్పేదేముంది ?-‘’అవదూతాయాభి ర్నీతా హిరణై స్తుల్య వృత్తి తాం-అన్యోన్యస్యాపి జిహ్రీమః కిం పునః సహవాసినాం ‘’.అభిమానం వదిలితే నమ్రత, దుర్బలత్వం గౌరవహాని కలుగుతాయి అలాటి మానహీండు గడ్డి పోచతో సమానం .ఎన్నికస్టాలొచ్చినా అభిమానం వదలరాదు కదా ‘’-శక్తి వైకల్య నమ్రస్యనిః సారత్వా ల్లఘీ యశసః-జన్మినో మాన హీనస్య తృణస్య చ సమాగతిః’’.పర్వత శిఖరాలలో దాట శక్యం కాని శిఖరాన్ని చూసి గొప్ప అభిమానం ఏ కారణంగా నూ సతోషం పొందదు.అనుల్లంఘ నీయత్వమే గొప్పవారికి ప్రీతి కలిగిస్తుంది –‘’అనుల్లంఘ్యం తత్త దురీక్ష్యయద్య దుచ్చైర్మహీ భ్రుతాం-ప్రియతాం జ్యాయసీ౦ మాగాన్మహతాం కేన తుంగతా ‘.’
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-12-20-ఉయ్యూరు