ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో మార్గశిర శుద్ధ విదియ 16-12-20 తెల్లవారితే బుధవారం నుండి 13-1-2001మార్గశిర బహుళ అమావాస్య 13-1-2001 భోగి వరకు ధనుర్మాసం సందర్భంగా ప్రతి రోజూ ఉదయం 5-30నుండి స్వామి వారలకు సుప్రభాత సేవ ,తిరుప్పావై ,శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారలకు అష్టోత్తర ,సహస్రనామార్చన ,శ్రీ గోదా రంగనాయక స్వాములకు అష్టోత్తర పూజ ,,ముకుందమాల స్తోత్ర పఠనం,సుందర కాండ పారాయణ ఉదయం 6-30కు నైవేద్యం ,హారతి ,పంత్రపుష్పం,తీర్ధ ప్రసాద వినియోగం నిర్వహింప బడును .భక్తులు పాల్గొని స్వామి వారల అనుగ్రహ౦ పొందమని మనవి .
27-12-20 ఆదివారం శ్రీ హనుమద్ వ్రతం 25-12-20 నుండి త్రయాహ్నికంగా నిర్వహింపబడును
25-12-20 మార్గశిర శుద్ధ ఏకాదశి శుక్రవారం- ముక్కోటి (వైకుంఠ)ఏకాదశి సందర్భంగా ఉదయం 4 గంటలకే ప్రత్యేక పూజ ,పుష్పాలంకరణ ,వివిధ రకాలపుష్పాలతో పూజ ,ఉదయం 5గంటలకు ఉత్తరద్వార దర్శనం ఉంటాయి .
26-12-20 శనివారం మార్గశిర శుద్ధ ద్వాదశి -ఉదయం 9 గంటలకు గంధ సిందూరం , వివిధ పండ్లతో ప్రత్యేక పూజ
27-12-20 మార్గశిర శుద్ధ త్రయోదశి ఆదివారం –శ్రీ హనుంద్ వ్రతం సందర్భంగా
ఉదయం 9గంటలకు –పంపాకలశ ఆవాహన ,అష్టోత్తర పూజ ,13ముడులున్న తోరాలకు పూజ ,స్వామి వారలకు తమలపాకులతో అష్టోత్తర సహస్ర నామ ప్రత్యేకపూజ మంత్రం తో తోరదారణ –అనంతరం అయిదు కథలతో,శ్రీ హనుమద్ వ్రతం ,నైవేద్యం, హారతి,మంత్రపుష్పం , తీర్ధ ప్రసాద వినియోగం .
1-1-2021-శుక్ర వారం –నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఉదయం 5-30గంటలకు –‘’లడ్డూలతో ‘’స్వామివార్లకు ప్రత్యేక పూజ .అనంతరం భక్తులకు లడ్డూ ప్రసాద వినియోగం .
10-1-21 -ఆదివారం ఉదయం 5-30గంటలకు స్వామివార్లకు’’ అరిసెలతో’’ ప్రత్యేక అర్చన
13-1-21-బుధవారం –భోగి పండుగ –ఉదయం 5-30గంటలకు వివిధ కూరగాయలతో స్వామివార్లకు శాకంభరీ పూజ
ఉదయం 9-30 గంటలకు –శ్రీ సువర్చలా౦జ నేయ స్వామి వారలకు ,శ్రీ గోదా, రంగ నాథ స్వామి వారలకు శాంతి కళ్యాణ మహోత్సవం
14-1-21-గురువారం –మకర సంక్రాంతి పండుగ –ఉదయం 7-30గంటలకు- సంక్రాంతి పురుషుని విశేషాల వివరణ
15-1-21-శుక్రవారం కనుమ పండుగ .
గబ్బిట దుర్గా ప్రసాద్ –ఆలయ ధర్మకర్త ,మరియు భక్త బృందం
ఉయ్యూరు -9-12-20.