కిరాతార్జునీయం-.28
చతుర్దశ సర్గ -2
కిరాతునితో కిరీటి ఇంకా ఇలా చెబుతున్నాడు ‘’మీ రాజు నా స్నేహానికి యోగ్యుడు అని ఎలాచచెప్పగలవు ?అతడికి మునులంటే ఈర్ష్య .గుణోన్నతులైన వారిని ద్వేషించే విరోధులు సజ్జనులకు ఎప్పుడూ శత్రువులే –‘’సఖా న యుక్తః కథితఃకథం త్వయా –యదృచ్ఛయా సూయతి యస్తపస్యతే –గుణార్జనోచ్ఛ్రాయ విరుద్ధ బుద్ధయః –ప్రకృత్యమిత్రా హి సతామసాధనః .మేము వర్ణాశ్రమ ధర్మ సంరక్షుకులమైన క్షత్రియులం .హీనజాతి హి౦సామార్గగామి మీ రాజుతో స్నేహం ఎలా చేస్తాం ?ఏనుగులు నక్కలతో స్నేహం చేస్తాయా ?మీరాజుతో అందుకే స్నేహం కుదరదు .-‘’వయం కృవర్ణాశ్రమ రక్షణోచితాః-క్వ జాతిహీనా మృగ జీవితచ్ఛిదః-సహాప కృష్టైర్మహతాం న సంగత౦ –భవంతి గోమాయు సఖా న దంతినః’’ .మూర్ఖుడు సజ్జనులను అవమాని౦చినంత మాత్రాన వాళ్ళ ధీరత్వానికి లోటు ఏమీరాదు.సమాన పరాక్రమ౦, వంశం, ,పౌరుషం ఉన్నవారు అతిక్రమిస్తేనే అది అవమానమౌతుంది –‘’పరోవ జానాతి యదజ్ఞతా జడ-స్తదున్నతాం న విహంతిధీరతాం-సమాన వీర్యా న్వయ పౌరు షేషు యః-కరోత్యతి క్రాంతి మాసౌ తిరస్క్రియా’’ .సజ్జనులు నీచులతో వైరం పెంచుకొంటే వారి కీర్తికే చెడ్డ పేరొస్తుంది.వారి తో స్నేహం చేస్తే గుణాలు చెడిపోతాయి .అందుకే నీచులతో సజ్జనులు ఉపేక్షా భావం తో ఉంటారు .ఈ రెండు కారణాలవలన మీరాజు పలికిన తిరస్కార వాక్యాలు సహించాను .కాదూ కూడదూ అంటూ ,బాణాన్ని తీసుకోవటానికే ఇక్కడికి వస్తే ,భయంకర సర్పం పడగపై శిరోమణి గ్రహించటానికి వచ్చిన వాడి గతేపడుతుంది –‘’మయా మృగాన్ హంతు రనేన హేతునా –య విరుద్ధ మాక్షేప వచస్తి తిక్షితం –శరార్థమే ష్యత్యథ లప్స్యతే గతిం –శిరోమణిం దృష్టివిషాజ్జి ఘ్రుక్షతః ‘’.’
ఇలా అర్జునుడు తన అభిప్రాయం చెప్పగా కిరాతుడు సైన్య సమేతంగా ఉన్న శివుడి దగ్గరకు విషయం చెప్పటానికి వెళ్ళాడు .తర్వాత కిరాత సేనాపతి ఆజ్ఞతో సేన భయంకర శబ్దాలు చేస్తూ బయల్దేరింది .ప్రళయం లో సుడిగాలితో సముద్ర తరంగాలు ఎగసి పడుతున్నట్లుగా ఉంది .అప్పుడే అనుకూలవాయువు వీచింది .సుగంధ తు౦పురులతోసేన పతాకాలు రెపరెప లాడుతూ యుద్ధానికి తొందర చేస్తున్నట్లు ఆగాలి సేనకు ముందే వీచింది .జయజయ ధ్వానాలు అల్లతాడు ధ్వనులు పర్వత గుహలనుంచి భూమిని కంపింప జేస్తూ దిక్కులన్నిటా వ్యాపించింది .తీక్ష్ణమైన కిరాతుల శస్త్రాలపై పడిన సూర్య కిరణాలు అధికకా౦తితో అని దిక్కుల్నీ కాల్చి వేస్తున్నట్లు ప్రకాశించాయి –‘వనే సదాం హేతిషుభిన్న విగ్రహై –ర్విపు స్పురే రశ్మి మతో మరీచిభిః’’. శివుడు విశాల వక్షస్థలం తో ఒక వైపు ఆచ్ఛాదించి ,అల్లెత్రాడు లాగి ,ధనుస్సును మండలాకారం గా చేసి భయంకర ధ్వని కల్పిస్తూ ,తన ప్రభావం తో రెండుప్రక్కలా భూమిని వ్యాపించాడు .ప్రమథ గణాలుమధ్యలో ఉన్నా ,వారందరికీ పైనే ఉన్నట్లు ప్రకాశించాడు –‘’వితత్య పక్షద్వయ మాయత౦ బభౌ –విభుర్గణానాముపరీవ మధ్యగః ‘’.
గణాలు సమాన వేగంగా పోటీ పడుతూ ముందుకు సాగుతోంది .వనాలు శ్వాస పీల్చుకోవటానికి కూడా వీలు లేనట్లు అతలాకుతలమయ్యాయి –‘’గణైరవి చ్చేదనిరుద్ధ మాబభౌ –వనం నిరు చ్ఛ్వాస మివాకులాకులం .సేన పర్వతాలు ఎక్కుతూ దిగుతూ పోతుంటే ,క్షణం లో ఎత్తుపెరిగి ,మరుక్షణం లో లోతుగా మారినట్లు కనిపించాయి –‘’కిరాత సైన్యే రపిధాయ రేచితా –భువః క్షణం నిమ్నత యేవ భేజిరే ‘’.సైన్యం పెద్దపెద్ద అ౦గ లేస్తూ వెడుతుంటే తీగలు తొక్కిడికి గురై ,సైన్యవేగంవలన ఏర్పడిన గాలితో మద్ది ,చందన వృక్షాలు అటూ ఇటూ ఊగి వనాలు గణాలకు తలవాల్చాయా అని పించింది .
ఇక్కడ మద జలం కారి చిక్కిపోయిన ఏనుగులా ఘోర తపస్సు తో చిక్కి బక్క అయిన అర్జునుడు ఉన్నాడు .దిక్కులను కాల్చే అగ్ని తేజస్సుతో ఉన్నాడు -‘’పరిజ్వలంతం నిధనాయ భూ భ్రుతాం-దహంత మాశాఇవ జాత వేదసం ‘’. ,అనుకూల మిత్రుని పొందే కోరికగా ,జయం పొందే కాంక్షగా అమ్ములపొది నుంచి అలవోకగా ఒక బాణం తీయటం లో –విఫలమై ,ప్రతీకారం తీర్చుకోవాలనే సముద్రం లాంటి కిరాత సేన ను నిర్లక్షంగా చూశాడు .-‘’అనాదరోపాత్త ధృతైక సాయకం –జయేనుకూలే సుహృదీవస స్పృహం-శనై రపూర్ణప్రతీకార పెలవే-నివేశయంతంనయనే బలో దధౌ ‘’
ఆపదలను దూరం చేసే గా౦డీవాన్ని ధరించి ,సహజ సిద్ధ స్థితి లో కూర్చుని దాటరాని మహా సముద్రంలా భాసి౦చాడు. అర్జునముని –‘’నిషణ్ణ మాప త్ప్రతి కారకార ణే-శరాసనే ధైర్య ఇవానపాయినీ –అల౦ఘనీయం ప్రకృతావపి స్థితం –నివాత నిష్కంప మివాపగాపతిం .’’ఎదురుగా చచ్చి పడిఉన్న పందివధ కారణంగా అర్జునుడు మృత్యు భయంకర రూపం గా ఉన్నాడు .యజ్ఞం లో బ్రాహ్మణ ఆహ్వానం పై వచ్చిన సాక్షాత్ రుద్రునిలా తపోరుద్రుడు అర్జునుడు ఉన్నాడు –‘’ఉపే యుషీం బిభ్రత మంతక ద్యుతిం – వధాదదూరే పతితస్య దంష్ష్ట్రిణః-పురః సమావేశిత సత్పశుం ద్విజైః-పతిం పశూనా మివ హూతమధ్వరే’’.ధైర్యంతో ఇతరుల గౌరవాన్ని జయి౦చేట్లు గంభీరంగా ఉన్నాడు .నాలుగు వైపులా దట్టమైన చెట్లు పెరిగి వ్యాపించి అంధకారం కలిగించే మహాపర్వతంలా ఉన్నాడు –‘’విజేన నీతంవిజితాన్య గౌరవం –గాభీరతాం ధైర్య గుణేన భూయసా -వనోదయేన ఘనోరు వీరుధా-సమంధ కారీకృత ముత్త మాచలం ‘’.మహా వృషభ మూపురం వంటి ఎగు బుజాలు ,లావైన బలమైన మెడ,కోట గోడ లా విశాలమైన వక్షస్థలం కలిగి ఉన్న అర్జునుడు మహాభారమైన భూమిని సముద్రం నుంచి ఉద్ధరించే మహా ఆది వరాహ మైన విష్ణుమూర్తిలా లా భాసి౦చాడు-‘’మహార్షభస్కంధమనూన కంధరం –బృహచ్ఛిలా వప్ర ఘనేన వక్షసా –సముజ్జి హీర్షు౦ జగతీంమహా భరాం-మహా వరాహం మహాతోర్ణ వాదివ ‘’
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-12-20-ఉయ్యూరు
.